భారత రాజ్యాంగ ఆధికరణలు

మూస:భారత సంవిధానం.rk

1 వ భాగం: సమన్వయ భారతం:

1 వ అధికరణ: దేశనామము, సమన్వయ భారత పరధి 2 వ అధికరణ: నూతన రాష్ట్రాల స్థాపించుట, చేర్చుకొనుట 2 ఎ వ అధికరణ: ఉపసంహరింపబడింది. 3 వ అధికరణ: నూతన రాష్ట్రాల ఏర్పాటు, ఇప్పుడున్న రాష్ట్రా పరిధులు, విస్తీర్ణముల మార్పూ 4 వ అధికరణ: 2,3 లకు ఉపయుక్తమైనవి, ఆవశ్యకమైనవి, అనుసంబవమైన మార్పూలు; ఒకటి, నాలుగు షెడ్యూలులో మార్పులు.

{{2 వ భాగం : పౌరసత్వం}}

5 వ అధికరణ: ఈ సంవిధానం ప్రారంభంనాటి పౌరసత్వం 6 వ అధికరణ: పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారి పౌరసత్వ హక్కులు. 7 వ అధికరణ: పాకిస్తాన్ నుంచి వలసపొయిన వారి పౌరసత్వ హక్కు. 8 వ అధికరణ: వేరే ఇతర దేశములలో నివసిస్తున్న జన్మత భారతీయుల్తెన వారి పౌరసత్వ హక్కు 9 వ అధికరణ: తమంతట తాము ఇతర దేశములందు పౌరసత్వ హక్కును సంపాదించుకొన్నవారు భారతపౌరులు కారు. 10 వ అధికరణ: పౌరసత్వ హక్కు, దాని కొనసాగింపు 11 వ అధికరణ: పౌరసత్వ హక్కును నియంత్రణ చేయు అధికారం

3 వ భాగం:ప్రాథమిక హక్కులు - సాధారణ వివరణ

12 వ అధికరణ: నిర్వచనము 13 వ అధికరణ: ప్రాథమిక హక్కులతో సరిపడనివి, అపవాదమైనవి అయిన చట్టములు

సమానత్వం: 14 వ అధికరణ: చట్టం ముందు అందరూ సమానులే 15 వ అధికరణ: మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా చూపే వివక్షత నిషేధం... 16 వ అధికరణ: ప్రభుత్వోద్యోగ వసతులతో సమానవకాశాలు 17 వ అధికరణ: అస్పృశ్యత నిషేధించడమైనది. 18 వ అధికరణ:కితాబుల రద్దు.

వ్యక్తి స్వేచ్ఛ: 19 వ అధికరణ: వాక్స్వాతంత్ర్యము మెదల్తెన హక్కుల పరిరక్షణ 20 వ అధికరణ: నేరారోపణ పరంపరంలో నేరస్తుడి హక్కులు 21 వ అధికరణ:వ్యక్తి స్వాతంత్ర్యం, వ్యక్తి జీవనానుభవముల రక్షణ 21 వ ఎ) అధికరణ: విద్యను అభ్యసించు హక్కు 22 వ అధికరణ: విచారణలేని నిర్బంధం గురించిన రక్షణలు 23 వ అధికరణ: మానవుల క్రయ విక్రయాల నిషేధం, నిర్బంధకూలీ నిషేధం 24 వ అధికరణ: కర్మాగారాలలో పసివారి నియామకం, నిషేధం

మత స్వేచ్ఛ:

25 వ అధికరణ: మనసారా అత్మసాక్షిగా నమ్మే విశ్వాసములకు, మతప్రచారములకు సంపూర్ణ స్వాతంత్ర్యం. 26 వ అధికరణ: మతపరమైన వ్యవహరాలను నిర్వహించుకునే హక్కు 27 వ అధికరణ: మతప్రచార ప్రోత్సాహం కొరకు విధింపబడే పన్నులు ఇతరులను భాధింపరాదు 28 వ అధికరణ: విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు, పూజలందు నిర్బంధం ఉండరాదు, సాంఘిక సాంస్కృతిక విద్యాపరమైన హక్కులు. 29 వ అధికరణ: అల్పసంఖ్యాకుల సంక్షేమ రక్షణ 30 వ అధికరణ: విద్యాసంస్థలను స్థాపించుట కొరకు అల్పసంఖ్యాకులకు కల్పించిన రక్షణలు. 31 వ అధికరణ: ఉపసంహరింపబడినది

కాపాడబడిన చట్టములు:

31 ఎ) వ అధికరణ: ఎస్టేట్స్ సేకరణ చట్టాలకు కల్పించిన రక్షణ 31 బి) వ అధికరణ: కొన్ని చట్టాల పునరుద్ధరణ 31 సి) వ అధికరణ: ఆదేశిక సూత్రాలను అనుసరించి చేసిన చట్టాలకు రక్షణ 31 డి) వ అధికరణ: ఉపసంహరింపబడినది 32 వ అధికరణ: ప్రాథమిక హక్కుల రక్షణ పరష్కారము 32 ఎ) వ అధికరణ: ఉపసంహరింపబడినది 33 వ అధికరణ:రక్షణదళాలు, ప్రాథమిక హక్కులను వర్తింపజేయుటలో పార్లమెంట్ అధికారము 34 వ అధికరణ: మార్షల్ లా అమలులో ఉన్నప్పటి చర్యలకు రక్షణ 35 వ అధికరణ: ఈ భాగంలోని అంశాలప్తె చట్టాలు చేసే అధికారం.

4 వ భాగం: ఆదేశిక సూత్రములు

36 వ అధికరణ: ఆదేశిక సూత్రములు నిర్వచనము

37 వ అధికరణ: ఈ భాగంలో వివరించిన సూత్రములను అమలుపరుచు బాధ్యత

38 వ అధికరణ: ప్రజా సంక్షేమం, శ్రేయస్సుల నిమిత్తం సాంఘిక సంస్థలను స్థాపించుట.

39 వ అధికరణ: పరిపాలనా విధానంలో రాజ్యం అనుసరించివలసిన సూత్రములు

39 ఎ) వ అధికరణ: సమాన న్యాయం, న్యాయ సహాయం 40 వ అధికరణ: గ్రామ పంచాయితీల ఏర్పాతటు

41 వ అధికరణ: పనిని కలిగి ఉండే హక్కు, చదువుకునే హక్కు, నిస్సహాయులకు ఆర్థిక సహాయం

42 వ అధికరణ: మానవతా దృష్టితో పనివారికి పనికాలంలో ఏర్పరచవలసిన పరిశుద్ధ వాతావరణం, ప్రసూతి సహాయం.

43 వ అధికరణ: పనివారికి జీవనభృతి తప్పనిసరి.

43 ఎ) వ అధికరణ: పనివారికి వారు పనిచేసే సంస్థలలో నిర్వహణధికార ఫ్రాప్తి

43 బి) వ అధికరణ: సహకార సంస్థలకు ప్రోత్సాహం

44 వ అధికరణ: సార్వత్రిక పౌరస్మృతి

45 వ అధికరణ: పసివారికి ఉచిత నిర్బంధ చదువు

46 వ అధికరణ: షెడ్యూల్డ్ తెగలకు, షెడ్యూల్డ్ కులాలవారికి ఇతర వెనకబడిన తరగతులవారికి విద్యా ఆర్థికాబివృద్దికి కృషి

47 వ అధికరణ: పౌష్టిక ఆహారం, ప్రజారోగ్య స్థాయి పెంపు

48 వ అధికరణ: వ్యవసాయం పశు సంవర్ధన

48 ఎ) వ అధికరణ: పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం వన్యప్రాణుల సంరక్షణ

49 వ అధికరణ: పురావస్తు పరిరక్షణ

50 వ అధికరణ: న్యాయశాఖను పరిపాలనా శాఖనుంచి వేరుచేయుట

51 వ అధికరణ: అంతర్జాతీయ శాంతి

4 ఎ భాగం:

51 ఎ. వ అధికరణ: ప్రాథమిక విధులు

5 వ భాగం: కేంద్ర ప్రభుత్వము (లేదా) యూనియన్

కార్యనిర్వహణ శాఖ

52 ఎ వ అధికరణ: భారతి రాష్ట్రపతి

53 వ అధికరణ: యూనియన్ కార్యనిర్వహణాధికారం

54 వ వ అధికరణ: రాష్ట్రపతి ఎన్నిక

55 వ అధికరణ: రాష్ట్రపతి ఎన్నిక విధానం

56 వ అధికరణ:రాష్ట్రపతి హొదా, కాలపరిమితి

57 వ అధికరణ: రాష్ట్రపతి తిరిగి ఎన్నిక

58 వ అధికరణ: రాష్ట్రపతిగా ఎన్నికమ్యేందుకు అర్హతలు

59 వ అధికరణ: రాష్ట్రపతి హొదా షరతులు

60 వ అధికరణ: రాష్ట్రపతి చేయవలసిన ప్రమాణం

61 వ అధికరణ: అభిశంసన విధానము

62 వ అధికరణ: రాష్ట్రపతి స్థానం ఖాళీ అయితే తిరిగి ఎన్నిక, ఎన్నిక్తెన వారి హోదా, కాలపరిమితి

63 వ అధికరణ: ఉపరాష్ట్రపతి

64 వ అధికరణ: ఉపరాష్ట్రపతి రాజ్యసభ చ్తెర్మన్ గా వ్యవహరించుట

65 వ అధికరణ: ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించుట

66 వ అధికరణ: ఉపరాష్ట్రపతి ఎన్నిక

67 వ అధికరణ: ఉపరాష్ట్రపతి హోదా కాలపరిమితి

68 వ అధికరణ: ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ అయితే తిరిగి ఎన్నిక, ఎన్నిక్తెన వారి హోదా, కాలపరిమితి

69 వ అధికరణ: ఉపరాష్ట్రపతి చేయవలసిన ప్రమాణం

70 వ అధికరణ: అవసరమైన ఇతర పరిస్థితులలో రాష్ట్రపతి పనులను ఉపరాష్ట్రపతి నిర్వహించుట

71 వ అధికరణ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబదించిన విషయములు

72 వ అధికరణ: క్షమాభిక్ష, శిక్షను నిలుపుచేయుట, తగ్గించుట, పరివర్తనం చేయుట

73 వ అధికరణ: యూనియన్ కు కల కార్యనిర్వహణధికార విస్తరణ

మంత్రివర్గం:

74 వ అధికరణ: కార్యనిర్వహణలో రాష్ట్రపతికి మంత్రివర్గం సహకారం

75 వ అధికరణ: మంత్రుల గురించిన వివరములు

అటార్ని జనరల్

76 వ అధికరణ: అటార్ని జనరల్

ప్రభుత్వ నిర్వహణ

77 వ అధికరణ: భారత ప్రభుత్వ వ్యవహరాల నిర్వహణ

78 వ అధికరణ: రాష్ట్రపతికి అందిచవలసిన సమాచార విషయములలో ప్రధానమంత్రి బాధ్యతలు

పార్లమెంట్ సాధారణ వివరణ

79 వ అధికరణ: లోక్‌సభ ఏర్పాటు

80 వ అధికరణ: రాజ్యసభ కూర్పు

81 వ అధికరణ: లోక్‌సభ కూర్పు

82 వ అధికరణ: ప్రతి జనాభా లెఖ్ఖల అనంతరం లోక్‌సభ సభ్యుల సంఖ్యలో సర్దుబాటు

83 వ అధికరణ: లోక్‌సభ, రాజ్యసభ కాలవ్యవధి

84 వ అధికరణ: పార్లమెంట్ సభ్యుల అర్హతలు

85 వ అధికరణ: పార్లమెంట్ సమావేశముల ముగింపు, రద్దు

86 వ అధికరణ: లోక్‌సభ, రాజ్యసభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే రాష్ట్రపతికి గల హక్కు, ఉభయ సభలకు సందేశాలను పంపిచే హక్కు

87 వ అధికరణ: రాష్ట్రపతి విశేష ప్రసంగం

88 వ అధికరణ: ఉభయ సభలలో మంత్రులకు, అటార్నీ జనరల్ కూ ప్రసంగించే హక్క.

పార్లమెంట్ అధికారులు

89 వ అధికరణ: రాజ్యసభ చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్

90 వ అధికరణ: రాజ్యసభ డిప్యూటి చ్తెర్మన్, రాజీనామా, తొలగింపు, ఇతరటత్రా ఆ హొదాలో ఖాళీ

91 వ అధికరణ: డిప్యూటి చ్తెర్మన్, చ్తెర్మన్ గా వ్యవహరించుట

92 వ అధికరణ: చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్, వారి తొలగింపును ఉద్దేశించిన తిర్మానం చర్చాంశనీయంమైనపుడు వారు రాజ్యసభా సమావేశానికి అధ్యక్షత వహించరాదు.

93 వ అధికరణ: స్పికర్, డిప్యూటి స్పీకర్ :లోక్‌సభ

94 వ అధికరణ: స్పికర్, డిప్యూటి స్పీకర్ రాజీనామా తొలంగిపు ఇతరత్రా ఆ హొదాలో ఖాళీ

95 వ అధికరణ: డిప్యూటి స్పికర్ స్పీకర్ గా వ్యవహరించు హక్కు

96 వ అధికరణ: డిప్యూటి స్పికర్ స్పీకర్ వారి తొలగింపును ఉద్దేశించిన తిర్మానం చర్చాంశనీయంమైనపుడు వారు లోక్‌సభ సమావేశానికి అధ్యక్షత వహించరాదు.

97 వ అధికరణ: చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్, స్పికర్, డిప్యూటి స్పీకర్ ల జీతభత్యములు

98 వ అధికరణ: పార్లమెంట్ కార్యలయం

కార్యకలాపాల నిర్వహణ

99 వ అధికరణ: సభ్యులు చేయవలసిన ప్రమాణం

100 వ అధికరణ: సభ్యులు ఓటు చేయు విధానం, కనీస సంఖ్యలో సభ్యులు హాజరు లేకపోయినా వ్యవహరించు హక్కు

సభ్యుల అనర్హతలు

101 వ అధికరణ: సభ్యులు సభ్యత్వాన్నించి విరమించవలసిన పరిస్థితులు

102 వ అధికరణ: సభ్యుల అర్హతలు

103 వ అధికరణ: అనర్హతల వివాదాలప్తే తీర్పు

104 వ అధికరణ: అర్హతను కోల్పోయిన సభ్యుడూ, అనర్హతకు లోబడిన సభ్యుడూ పెనాల్టీలకు గురి అగుట

105 వ అధికరణ: సభ్యుల సభాహక్కులు మినహయింపులు మొదల్తెనవి

106 వ అధికరణ: సభ్యుల జీతభత్యములు 107 వ అధికరణ: బిల్లులను సమర్పించు విధానం 108 వ అధికరణ: ఉబయసభల ఉమ్మడి సమావేశము 109 వ అధికరణ: ద్రవ్య బిల్లు : ప్రత్యేక విధానం 110 వ అధికరణ: ద్రవ్య బిల్లు నిర్వచనం 111 వ అధికరణ: బిల్లుల పరిమితి

ఆర్థిక వ్యవహరాలను గురించిన విధానము

112 వ అధికరణ: వార్షిక ఆర్థిక పరిస్థితిప్తె నివేదిక 113 వ అధికరణ: ఆర్థిక అంచనాలు పార్లమెంట్ చర్చావిధానము 114 వ అధికరణ: ద్రవ్య వినియోగబిల్లులు 115 వ అధికరణ: అనుభంధ అదనపు, మితిమీరిన ఖర్చుల సహాయ నిధులు 116 వ అధికరణ: తాత్కాలిక పద్ధతులప్తె ఓటింగ్, అత్యవసర ఖర్చులప్తె ఓటింగ్ 117 వ అధికరణ: ద్రవ్య బిల్లుప్తె చర్చ- ప్రత్యేల విధానము

ఫార్లమెంట్ లో జరుగు కార్యకలపాలను గురించిన సాధారణ విధానము

118 వ అధికరణ: నియామవళి 119 వ అధికరణ: పార్లమెంట్ లో ద్రవ్యవ్యవహరల చర్చ విధానం 120 వ అధికరణ: పార్లమెంట్ లో ఉపయోగించవలసిన భాష, రాజభాష ప్రస్తావన 121 వ అధికరణ: పార్లమెంట్ లో జరిగే చర్చలను గురించిన ఆంక్షలు 122 వ అధికరణ: పార్లమెంట్ లో జరుగు వ్యవహరలప్తె ఏ విధమైయిన విచారణ జరిపే అధికారం కోర్టులకు లేదు

రాష్ట్రపతి శాసనాధికారము

123 వ అధికరణ: పార్లమెంట్ అభినివేశనమందు లేనప్పుడు రాష్ట్రపతి అధ్యాదేశములను ప్రకటన ద్వారా జారిచేయు అధికారము

యూనియన్ న్యాయవ్యవస్థ

124 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము; స్థాపించుట, కూర్పు 125 వ అధికరణ: న్యాయమూర్తుల జీతభత్యములు 126 వ అధికరణ: తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం 127 వ అధికరణ: అవసరసిద్ధి కొరకు నియమింపబడె న్యాయమూర్తి 128 వ అధికరణ: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సహాయం 129 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము కోర్టు ఆఫ్ రికార్డ్ 130 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థాన సమావేశస్థలము 131 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము ప్రారభింక విచారణాధికార పరిధి 131 ఎ వ అధికరణ: ఉపసంహరింపబడినది 132 వ అధికరణ: హ్తెకోర్టు తీర్పులప్తె సర్వోన్నత న్యాయస్థానానికి వున్న అప్పీలు పరిధులు, కేసుల స్వభావం 133 వ అధికరణ: హ్తెకోర్టు తీర్పులప్తె సర్వోన్నత న్యాయస్థానానికి వున్న అప్పీలు పరిధులు, కేసుల స్వభావం 134 వ అధికరణ: క్రిమినల్ కేసులో సర్వోన్నత న్యాయస్థానానికి వున్న అప్పీలు పరిధులు 134 ఎ) వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానమునకు పోవు అప్పీలును గురిచింన హ్తెకోర్టులు ఇచ్చే సర్టిపికెట్ 135 వ అధికరణ: ఫెడరల్ కోర్టు అధికారల బదిలీ 136 వ అధికరణ: అప్పీలు అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసే ప్రత్యేకాధికారం 137 వ అధికరణ: పునర్విచారణాధికారం 138 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము; పరిధుల విస్తరణ 139 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానమునకు గల రిట్టులను మంజూరు చేయు అధికార విస్తరణ 139 ఎ) వ అధికరణ: కేసులను బదలి చేయు అధికారము 140 వ అధికరణ: అనుబందిత అధికారలు 141 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము తేల్చీన న్యాయమును అన్ని కోర్టులు విధిగా పాటించుట 142 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానం తీర్పులోని అదేశముల అమలు 143 వ అధికరణ: రాష్ట్రపతి సర్వోన్నత న్యాయస్థానమును సలహ అడగవచ్చు 144 వ అధికరణ: సివిల్, జుడిషియల్ అధికారులు అందరూ సర్వోన్నత న్యాయస్థానంతో సహకరించవలెను 144 ఎ) వ అధికరణ: ఉపసహరించబడినది 145 వ అధికరణ: కోర్టు నియమావళి 146 వ అధికరణ: కోర్టు ఉద్యోగులు, సిబ్బంది; సర్వోన్నత న్యాయస్థాన కార్యలయ ఖర్చులు 147 వ అధికరణ: వివరణ

కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్

148 వ అధికరణ: భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ 149 వ అధికరణ: విధులు-అధికారములు 150 వ అధికరణ: యూనియన్, రాష్ట్ర ప్రభుత్వ లెఖ్ఖల నమూనా 151 వ అధికరణ: తనిఖి లెఖ్ఖల నివేదిక

6 వ భాగం: రాష్టములు

152 వ అధికరణ: నిర్వచనములు

కార్యనిర్వహణ

గవర్నర్

153 వ అధికరణ: రాష్ట్ర గవర్నర్ 154 వ అధికరణ: రాష్ట్ర కార్యనిర్వహణాధికారం 155 వ అధికరణ: గవర్నర్ నియామకం 156 వ అధికరణ: గవర్నర్ హోదా కాలపరిమితి 157 వ అధికరణ: గవర్నర్ నియామకమునకు అవసరమైన అర్హతలు 158 వ అధికరణ: గవర్నర్ పదవీ షరతులు 159 వ అధికరణ: ప్రమాణ స్వీకారము 160 వ అధికరణ: కొన్ని పరిస్థితులలో గవర్నర్ చేయు పనులను వేరొకరు నిర్వహించుట 161 వ అధికరణ: క్షమాభిక్ష, శిక్షలను నిలుపుచేయుట, తగ్గించుట, పరివర్తనం చేయు అధికారాలు 162 వ అధికరణ: రాష్ట్ర కార్యనిర్వహణాధికార విస్తరణ

మంత్రివర్గం

163 వ అధికరణ: కార్యనిర్వహణలో గవర్నర్ కు మంత్రివర్గ సహకారం 164 వ అధికరణ: మంత్రుల గురిచింన వివరములు

రాష్ట్ర అడ్వకేట్ జనరల్

165 వ అధికరణ: రాష్ట్ర అడ్వకేట్ జనరల్

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహర నిర్వహణ

166 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహర నిర్వహణ 167 వ అధికరణ: గవర్నర్ కు అందించవలసిన సమాచారం విషయంలో ముఖ్యమంత్రి బాధ్యతలు

సాధారణ వివరణ

168 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి స్థాపన 169 వ అధికరణ: శాసనమండలి ఏర్పాటు, రద్దు 170 వ అధికరణ: శాసనసభ కూర్పు 171 వ అధికరణ: శాసనమండలి కూర్పు 172 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి కాలపరిమితి 173 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి సభ్యుల అర్హతలు 174 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి సమావేశముల ముగింపు, రద్దు 175 వ అధికరణ: శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఉద్దేశించి ప్రసగించే హక్కు, ఉభయసభలకు సందేశాలను పంపే హక్కు 176 వ అధికరణ: గవర్నర్ విశేష ప్రసంగం 177 వ అధికరణ: మంత్రులకు-అడ్వకేట్ జనరల్ కు శాసనసభలో ప్రసంగిచే హక్కు

ఉభయసభల అధికారులు

178 వ అధికరణ: శాసనసభ స్పీకర్, డిప్యూటి స్పీకర్ 179 వ అధికరణ: రాజీనామా తొలగింపు: ఇతరత్రా స్పీకర్, డిప్యూటి స్పీకర్ హోదాలో ఖాళీలు 180 వ అధికరణ: డిప్యూటి స్పీకర్ గా వ్యవహరించుట 181 వ అధికరణ: స్పీకర్ - డిప్యూటి స్పీకర్ లు వారిని తొలగించుట కొరక్తె ఉద్దేశించిన తీర్మానం చర్చనియాంశంమైనపుడు వారు సభా సమావేశాలప్తె అధ్యక్షత వహించరాదు 182 వ అధికరణ: చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్ 183 వ అధికరణ: రాజీనామా, తొలగింపు, ఇతరత్రా చ్తెర్మన్, డిప్యూటి చ్తెర్మన్ హోదాలో ఖాళీలు 184 వ అధికరణ: డిప్యూటి చ్తెర్మన్, చ్తెర్మన్ గా వ్యవహరించుట 185 వ అధికరణ: డిప్యూటి చ్తెర్మన్, చ్తెర్మన్ వారిని తొలగించుట కొరక్తె ఉద్దేశించిన తీర్మానం చర్చనియాంశంమైనపుడు వారు శాసనమండలి సమావేశాలప్తె అధ్యక్షత వహించరాదు 186 వ అధికరణ: చ్తెర్మన్ డిప్యూటి చ్తెర్మన్, స్పీకర్ - డిప్యూటి స్పీకర్ ల జీతభత్యములు 187 వ అధికరణ: ఉభయసభల కార్యాలయం 188 వ అధికరణ: కార్యకలాపాల నిర్వహణ, సభ్యులు చేయవలసిన ప్రమాణం 189 వ అధికరణ: సభ్యులు ఓటుచేయు విధానం, కనీస సభ్యులు హాజరులో లేకపోయిన వ్యవహరించు హక్కు

సభ్యుల అనర్హతలు

190 వ అధికరణ: సభ్యులు సభ్యత్వం నుంచి విరమించవలసిన పరిస్థితులు 191 వ అధికరణ: సభ్యుల అనర్హతలు 192 వ అధికరణ: అనర్హతల వివాదం ప్తె తీర్పు 193 వ అధికరణ: అనర్హతను కోల్పోయిన సభ్యుడు, అనర్హతలకు లోనయిన సభ్యుడు, ప్రమాణ స్వికారం చేయని సభ్యుడు సభల సమావేశాలకు హజరు అయినచో పెనాల్టీకి గురి అవుదురు 194 వ అధికరణ: సభ్యుల సభాహక్కుల, మినహయింపు మొదలయినవి 195 వ అధికరణ: సభ్యుల జీతభత్యములు

ఉభయసభల వ్యవహర విధానము

196 వ అధికరణ: బిల్లులను శాసనసభకు సమర్పించు విధానము 197 వ అధికరణ: ద్రవ్య బిల్లు మినహ ఇతర బిల్లుల గురించి శాసనమండలిప్తె ఆంక్షలు 198 వ అధికరణ: ద్రవ్య బిల్లు గురించి ప్రత్యేక విధానము 199 వ అధికరణ: ద్రవ్య బిల్లు-నిర్వచనము 200 వ అధికరణ: బిల్లుల అనుమతి 201 వ అధికరణ: రాష్ట్రపతి ఆమోదం కొరకు బిల్లును నిలుపుచేయుట

ఆర్థిక వ్యవహరములను గురించిన విధానము

202 వ అధికరణ: వార్షిక, ఆర్థిక పరిస్థితిపై నివేదిక 203 వ అధికరణ: ఆర్థిక అంచనాలు శాసనసభ చర్చావిధానము 204 వ అధికరణ: ద్రవ్య వినియోగ బిల్లులు 205 వ అధికరణ: అనుబంధ అదనపు మితిమీరిన ఖర్చుల సహాయ నిధులు 206 వ అధికరణ: తాత్కాలిక పద్దులప్తె ఓటింగ్ అత్యవసర ఖర్చులప్తె ఓటింగ్ 207 వ అధికరణ: ద్రవ్య బిల్లుప్తె చర్చ ప్రత్యేక విధానము

నియామావళి

208 వ అధికరణ: శాసనసభలో జరుగు కార్యక్రమాల గురించిన సాధారణ విధానము 209 వ అధికరణ: ఆర్థిక వ్యవహరాల గురించిన రెగ్యులేషన్ 210 వ అధికరణ: శాసనసభలలో ఉపయోగించవలసిన భాషలు 211 వ అధికరణ: శాసనసభలలో చర్చలప్తె ఆంక్షలు 212 వ అధికరణ: శాసనసభలలో జరుగు వ్యవహారాలప్తె ఏ విధమైన విచారణ జరిపే అధికారం కోర్టులకు లేదు

గవర్నర్ శాసనాధికారము

213 వ అధికరణ: శాసనసభలు అభినివేశమందు లేనపుడు గవర్నర్ కు అధ్యాదేశమును జారీచేయు అధికారము

రాష్ట్ర హ్తెకోర్టులు

214 వ అధికరణ: రాష్ట్ర హ్తెకోర్టులు 215 వ అధికరణ: హ్తెకోర్టను కోర్ట్ అఫ్ రికార్డుగా భావించుదురు 216 వ అధికరణ: హ్తెకోర్టు స్థాపన 217 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల నియామకం షరతులు 218 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానమునకు వర్తించు కొన్ని విషయములు, హ్తెకోర్టులకు కూడా వర్తింపజేయుట 219 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం 220 వ అధికరణ: న్యాయమూర్తి నియామకంలో ఖాయపడిన వ్యక్తి తదుపరి వృత్తిప్తె ఆంక్ష 221 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల జీతభత్యములు 212 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల బదిలిలు 223 వ అధికరణ: తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం 224 వ అధికరణ: అదనపు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం 224.ఎ) వ అధికరణ: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సహాయం 225 వ అధికరణ: హ్తెకోర్టుల అధికార పరిధి 226 వ అధికరణ: హ్తెకోర్టులకు రిట్టులను మంజూరుచేయు అధికారము 227 వ అధికరణ: దిగువ కోర్టుల ప్తె హ్తెకోర్టు అజమాయిషి 228 వ అధికరణ: హ్తెకోర్టు దిగువ కోర్టు కేసులను బదిలీ చేసుకొనుట 228 ఎ) అధికరణ: ఉపసంహరింపబడినది 229 వ అధికరణ: కోర్టు ఉద్యోగులు, సిబ్బంది; హ్తెకోర్టు కార్యలయ ఖర్చులు 230 వ అధికరణ: యూనియన్ టెరిటరీకి హ్తెకోర్టు అధికార విస్తరణ 231 వ అధికరణ: రెండు అంతకు మించిన రాష్ట్రములకు ఒకే హ్తెకోర్టును స్థాపించుట 232 వ అధికరణ: ఉపసంహరింపబడినది

దిగువ న్యాయస్థానములు

233 వ అధికరణ: జిల్లా న్యాయమూర్తుల నియామకం 233 ఎ వ అధికరణ: కొందరు జిల్లా జడ్జిల నియామకములను వారు అందిచిన తీర్పులకు మాన్యతను చేకూర్చుట 234 వ అధికరణ: జుడిషయల్ సర్వీసు నియామకాలు 235 వ అధికరణ: క్రింది కోర్టులప్తె జిల్లా కోర్టు పర్యవేక్షణ 236 వ అధికరణ: వివరణలు 237 వ అధికరణ: ఈ ఛాప్టర్ లోని అంశములను మేజిస్ట్రేతట్లకు వర్తింపచేయుట

7 వ భాగం: పార్ట్ బి రాష్ట్రాలు-మొదటి షెడ్యూలు

238 వ అధికరణ: ఉపసంహరింపబడినది

8 వ భాగం:యూనియన్ టెరిటరీస్

239 వ అధికరణ: యూనియన్ టెరిటరీస్ పరిపాలన. 239 ఎ) వ అధికరణ: కొన్ని యూనియన్ టెరిటరీలకు స్థానిక శాసనసభలను మంత్రివర్గములను ఏర్పుర్చుట 239 ఎఎ) వ అధికరణ: ఢిల్లీ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు 239 ఎబి) వ అధికరణ: సంవిధాన పరిపాలన విఫలంమైనచో ఇతర ఏర్పాతట్లు 239 బి) వ అధికరణ: శాసనసభ విరామ సమయంలో శాసనానికి బదులు ఆద్యాదేశములను జారీ చేయు అధికారము 240 వ అధికరణ:రాష్ట్రపతికి యూనియన్ టెరిటరీస్ గురించి వినమయములను చేయు అధికారము 241 వ అధికరణ: యూనియన్ టెరిటరీలకు హ్తెకోర్టులు 242 వ అధికరణ: ఉపసంహరింపబడినది

9 వ భాగం: పంచాయతీలు

243 వ అధికరణ: నిర్వచనములు 243 ఎ) వ అధికరణ: గ్రామసభ 243 బి) వ అధికరణ: పంచాయితీల వ్యవస్థాపన 243 సి) వ అధికరణ: పంచాయితీల నిర్మాణము 243 డి) వ అధికరణ: స్థానముల కేటాయింపు 243 ఇ) వ అధికరణ: పంచాయితీల కాలపరిమితి 243 ఎఫ్) వ అధికరణ: పంచాయితీ సభ్యత్వ అనర్హతలు 243 జి) వ అధికరణ: పంచాయితీల సామర్థ్యతలు అధికారలు బాధ్యతలు 243 హెచ్) వ అధికరణ: పన్నులు విధించు అధికారములు, నిధులు 243 ఐ) వ అధికరణ: పంచాయతీల ఆర్థిక పరిస్థితి సమిక్ష కొరకు ఫ్తెనాస్స్ కమిషన్ ఏర్పాటు 243 జె) వ అధికరణ: పంచాయితీ లెక్కల తనిఖీ 243 కె) వ అధికరణ: పంచాయితీ ఎన్నికలు 243 ఎల్) వ అధికరణ: యూనియన్ టెరిటరీలకు వర్తింపు చేయుట 243 ఎమ్) వ అధికరణ: గ్రామ పంచాయితీ విధానము షెడ్యూల్డ్ ఏరియాస్ కి వర్తింపు చేయుట 243 ఎన్) వ అధికరణ: అమలులో ఉన్న పంచాయితీ చట్టముల చలామణి 243 ఒ) వ అధికరణ: ఎన్నికల వివాదాలతో కోర్టులకు సంబంధం ఉండదు

9 ఎ వ భాగం: మున్సిపాలిటీలు 243 పి) వ అధికరణ: నిర్వచనములు 243 క్యు) వ అధికరణ:మున్సిపాలిటీల వ్యవస్థాపన 243 అర్) వ అధికరణ: మున్సిపాలిటీల నిర్మాణము. 243 ఎస్) వ అధికరణ: వార్డు కమీటిల నిర్మాణము వగ్తెరా 243 టి) వ అధికరణ: సభృత్వములలో ప్రత్యేక కెటాయింపు 243 యు) వ అధికరణ : మున్సిపాలిటీల కాలపరిమితి 243 వి) వ అధికరణ : మున్సిపాలిటీల సభ్యత్వ అనర్హతలు 243 డబ్ల్యు) వ అధికరణ : మున్సిపాలిటీల సామర్థ్యతలు, అధికారాలు, బాధ్యతలు 243 ఎక్స్) వ అధికరణ : పన్నులను విధుంచుట, విధులను ఏర్పరుర్చుట 243 వ్తె) వ అధికరణ : ఫ్తెనాన్స్ కమిషన్ 243 జడ్) వ అధికరణ : మున్సిపాలిటీ లెఖ్ఖల తనీఖీ 243 జడ్ ఎ) వ అధికరణ : మున్సిపాలిటీల ఎన్నికలు 243 జడ్ బి) వ అధికరణ : యూనియన్ టెరిటరీలకు వర్తింపచేయుట 243 జడ్ సి) వ అధికరణ: వర్తింపులేని ప్రదేశములు 243 జడ్ డి) వ అధికరణ: జిల్లా ప్రణాళికా సంఘముల ఏర్పాటు 243 జడ్ ఇ) వ అధికరణ: మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం 243 జడ్ ఎఫ్) వ అధికరణ: అమలులో ఉన్న మున్సిపల్ చట్టముల చలామణి 243 జడ్ జి) వ అధికరణ: ఎన్నికల వివాదాలతో కోర్టులకు సంబంధం ఉండరాదు

9 బి వ భాగం:

243 జడ్ హెచ్ వ అధికరణ: నిర్వచనాలు 243 జడ్ ఐ వ అధికరణ: సహకార సంస్థల ఏర్పాటు 243 జడ్ జె వ అధికరణ: మండలి, కార్యలయ సభ్యుల సంఖ్య, కాలపరిమితి 243 జడ్ కె వ అధికరణ: మండలికి సభ్యుల ఎంపిక 243 జడ్ ఎల్ వ అధికరణ: మండల, మధ్యంతర యాజమాన్య విలంబన, అతిలంబన 243 జడ్ ఎం వ అధికరణ: సహకార సంస్థల ఖాతాల ఆడిట్ 243 జడ్ ఎన్ వ అధికరణ: సాధారణ మండలి సమావేశాల నిర్వహణ 243 జడ్ ఓ వ అధికరణ: సభ్యులకు సమాచార హక్కు 243 జడ్.పి వ అధికరణ: రిటర్నులు 243 జడ్ క్యూ వ అధికరణ: నేరాలు, దండనలు 243 జడ్ ఆర్ వ అధికరణ: బహు రాష్ట్ర సహకార సంస్థలకు అనువర్తన 243 జడ్ ఎస్ వ అధికరణ: కేంద్రపాలిత ప్రాంతాలకు అనువర్తన 243 జడ్ టివ అధికరణ: ప్రస్తుత చట్టాల కొనసాగింపు

10 వ భాగం: షెడ్యూల్డ్, ట్త్రెబల్ ప్రాంతములు

244 వ అధికరణ: షెడ్యూల్డ్, ట్త్రెబల్ ప్రాంతము పరిపాలన 244 ఎ) వ అధికరణ: స్వయంపాలిత రాష్ట్ర స్థాపన

11 వ భాగం: యూనియన్, రాష్ట్రల మధ్య సంబంధాలు

చాట్టాలను చేసే అధికారాలను గురించి

245 వ అధికరణ: శాసనాలను చేయుటలో పార్లమెంట్ కు, రాష్ట్ర శాసనసభలకు ఉన్న అధికారపరిధి 246 వ అధికరణ: పార్లమెంట్ కు, శాసనసభలకు కేటాయించిన అంశాలు - జాబితాలు 247 వ అధికరణ: అదనపు కోర్టులను స్థాపించు అధికారము 248 వ అధికరణ: మిగిలిన అంశాలప్తె శాసనాలను చేసే అధికారము 249 వ అధికరణ: రాష్ట్ర శాసనసభలకు కేటాయించిన అంశాలప్తె జాతి శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంట్ చాట్టాలను చేయవచ్చు 250 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలములో రాష్ట్ర జాబితాలోని అంశాలప్తె పార్లమెంట్ శాసనాలను చేయవచ్చు 251 వ అధికరణ: పార్లమెంట్ చేయు చాట్టములకు రాష్ట్ర శాసనసభలు చేయు చాట్టములకు మధ్య వ్తెరుధ్యం ఉంటే 252 వ అధికరణ: రెండు అంతకంటే మించిన రాష్టములు తమ కొరకు ఏదేని శాసనాన్ని చేయమని కోరితే పార్లమెంట్ వాటన్నిటికి అనువర్తించు శాసనాన్ని చేయవచ్చు 253 వ అధికరణ: అంతర్జాతీయ ఒప్పందాల అమలుకొరకు చేయు చట్టాలను పార్లమెంట్ మాత్రమే చేయగలదు 254 వ అధికరణ: పార్లమెంట్ చేసిన చట్టము శాసనసభ చేసిన చట్టాల మధ్య వ్తెరుధ్యం 255 వ అధికరణ: ముందుగా సిపార్సులను పొందవలెనని ఎక్కడ్తెనా వుంటే అది విధానానికి సంబంధించిన షరతు అని గుర్తించాలి

యూనియన్, రాష్ట్రముల మధ్య పరిపాలన సంబంధాలు సాధారణ విషయములు 256 వ అధికరణ: యూనియన్, రాష్ట్రముల బాధ్యతలు 257 వ అధికరణ: రాష్ట్రములప్తె యూనియన్ కు ఉన్న అదుపు 257 ఎ వ అధికరణ: ఉపసహరించబడినది 258 వ అధికరణ: రాష్ట్రలకు, యూనియన్ కు కల అధికారము కొన్ని పరిస్థితులలో దత్తాధికారమివ్వవచ్చు 258 ఎ వ అధికరణ: రాష్ట్రలు కూడా తమ కార్యకలపాలను యూనియన్ కు దత్తపరచవచ్చు 259 వ అధికరణ: ఉపసహరించబడినది 260 వ అధికరణ: భారతదేశానికి ఆవల ఉన్న ప్రదేశాల పరిపాలను యూనియన్ చేపట్టవచ్చు 261 వ అధికరణ: యూనియన్, రాష్ట్రములు చేసే అన్ని చర్యలకు వారి రికార్డులకు సర్వత్రా గుర్తింపు: న్యాయస్థానాల తీర్పులకు సర్వత్రా గుర్తింపు

నదీజలాలప్తె వివాదములు

262 వ అధికరణ: అంతర్రాష్ట్ర నీటి వనరులు, నదులప్తె పరిష్కారం

రాష్ట్రముల మధ్య సహాయసహకారములు

263 వ అధికరణ: ఇంటర్ స్టేట్ కౌన్సిల్

12 వభాగం: ద్రవ్యం, ఆస్తి ఒప్పందాలు, దావాలు ద్రవ్య సాదరణ విషయములు 264 వ అధికరణ: వివరణ 265 వ అధికరణ: చట్టం లేనిచో పన్ను ఉండదు 266 వ అధికరణ: యూనియన్, రాష్ట్రములకు చెందిన సంచితనిధి పబ్లిక్ అక్కౌంట్స్ 267 వ అధికరణ: అకస్మిక నిధి యూనియన్, రాష్ట్రాల మధ్య ఆదాయాల పంపిణీ 268 వ అధికరణ: యూనియన్ విధించు డ్యూటీలు- రాష్ట్రములు వసూలు చేయుట, వినియోగించుట 268 వ అధికరణ: సేవలప్తె పన్ను-యూనియన్ ప్రభుత్వంచే విధింపు- యూనియన్, రాష్ట్ర ప్రభుత్వములచే వసూలు-యూనియన్ రాష్ట్ర ప్రభుత్వముల కొరకు వినియోగము 269 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - రాష్ట్రములకు పంచుట 270 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - యూనియన్ రాష్ట్రములకు పంచుట 271 వ అధికరణ: యూనియన్ ప్రయోజనాల కొరకు విధించే సర్ ఛార్జి 272 వ అధికరణ: ఉపసహరించబడినది 273 వ అధికరణ: ఎక్స్ పొర్టు డ్యూటి బదులు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ - జ్యూట్, జ్యూట్ ప్రోడక్ట్స్ 274 వ అధికరణ: రాష్ట్రములకు ఆసక్తి ఉన్న పన్నుల గురించి రాష్ట్రపతి సిఫార్సు ఆవశ్యకత 275 వ అధికరణ:యూనియన్ నుంచి కొన్ని రాష్ట్రములకు అందిచే గ్రాంట్స్ 276 వ అధికరణ: వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, ఇతర సర్వీసులప్తెన విధించు పన్ను 277 వ అధికరణ: మినహయింపులు 278 వ అధికరణ: ఉపసహరించబడినది 279 వ అధికరణ: నెట్ ప్రోసిడ్స్ ను లెఖ్ఖించు విధానము 280 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమిషన్ 281 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమిషన్ సిఫార్సులు

ఇతర ద్రవ్య విషయములు

282 వ అధికరణ: యూనియన్, రాష్ట్రప్రభుత్వములు వారి ఆదాయం నుంచి చేయు ఖర్చులు 283 వ అధికరణ: సంచిత నిధి, కంటింజెన్స్ ఫండ్, పబ్లిక్ అక్కౌంట్స్ ఆధీనము సంరక్షణ 284 వ అధికరణ: కోర్టులలోను పబ్లిక్ ఆఫీసర్ వద్ద జమపడే డిపాజిట్లు స్వాధీనము 285 వ అధికరణ: రాష్ట్రాలు విధించే పన్నులనుంచి యూనియన్ విధించే పన్ను ఉండరాదు 286 వ అధికరణ: వస్తువుల అమ్మకం, కొనుగోళ్ళ విలువలప్తె పన్ను విధింపు గురించిన ఆంక్షలు 287 వ అధికరణ: విద్యుత్ ప్తె పన్నుల మినహయింపు 288 వ అధికరణ: నీరు, విద్యుత్ లప్తె రాష్ట్రాలు విధించే పన్నులప్తె మినహయింపులు 289 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులప్తె యూనియన్ విధించే పన్ను ఉండరాదు 290 వ అధికరణ: యూనియన్, రాష్ట్రముల మధ్య కొన్ని లెఖ్ఖల సర్దుబాటు 29 ఎ) వ అధికరణ: దేవస్వం నిధులు 291 వ అధికరణ: ఉపసహరించబడినది

రుణ సేకరణ: 292 వ అధికరణ: యూనియన్ ప్రభుత్వ రుణ సేకరణ 293 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ రుణ సేకరణ

ఆస్తులు, ఒప్పందాలు, హక్కులు, బాధ్యతలు, కర్తవ్యాలు, దావాలు

294 వ అధికరణ: దేశ విభజన మూలంగా సంక్రమించిన ఆస్తులు బాధ్యతలు 295 వ అధికరణ: ఇతరత్రా పార్టు బి రాష్ట్రాల ద్వారా సంక్రమించిన ఆస్తులు, బాధ్యతలు 296 వ అధికరణ: వారసులు లేని వారి ఆస్తి 297 వ అధికరణ: టెరిటొరియల్ వాటర్స్, కాంటినెంటల్ షెల్ఫ్ లోని విలువ్తెన ఆస్తులు అన్నీ యూనియన్ కు చెందును 298 వ అధికరణ: ప్రభుత్వాలకు వ్యాపారం చేసే హక్కు 299 వ అధికరణ: ప్రభుత్వము చేసుకొనే ఒప్పందములు 300 వ అధికరణ: వ్యాజ్యములు

13 వ భాగం: దేశవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యసంసర్గముల యందు స్వేచ్ఛ

301 వ అధికరణ: వ్యాపార వాణిజ్య, సంసర్గముల యందు స్వేచ్ఛ 302 వ అధికరణ: వ్యాపార, వాణిజ్యాలప్తె ఆంక్షలను విధించే అధికారము పార్లమెంట్ కు ఉన్నది 303 వ అధికరణ: వ్యాపార, వాణిజ్యాల నింయంత్రణప్తె రాష్ట్రలకు, యూనియన్ కు ఉన్న అధికారల పరిమితి 304 వ అధికరణ: రాష్ట్రముల మధ్య జరిగే వ్యాపార, వాణిజ్యాలను గురించిన ఆంక్షలు 305 వ అధికరణ: ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల మినహయింపు, ప్రభుత్వ గుత్తాధికార సంస్థలు 306 వ అధికరణ: ఉపసంహరించబదినది 307 వ అధికరణ: ఆధికరణ 301 నుండి ఆధికరణ 304 లోని అంశాల అమలుకొరకు స్థాపించు ప్రాధికార సంస్థ

14 వ భాగం: యూనియన్, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఉద్యోగులు

308 వ అధికరణ: వివరణ 309 వ అధికరణ: యూనియన్, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల నియామకం, షరతులు 310 వ అధికరణ: ఉద్యోగుల పదవీ కాలము 311 వ అధికరణ: ఉద్యోగుల ప్తె క్రమశిక్షణా చర్యలు 312 వ అధికరణ: ఆలిండియా సర్విసెస్ 312 ఎ అధికరణ: ఉద్యోగుల షరతులను నిర్ణయించు, మార్పు చేయు, ఉపసంహరించు అధికారం 313 వ అధికరణ: సంధికాలపు సమస్యల పరిష్కారము 314 వ అధికరణ: ఉపసంహరించబడినది

పబ్లిక్ సర్విస్ కమిషన్

315 వ అధికరణ: యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ లు 316 వ అధికరణ: సభ్యుల నియామకం, షరతులు 317 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యుల తొలగింపు, తాత్కాలిక నిలుపుదల 318 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యుల, సిబ్బంది సేవాషరతులప్తె రెగ్యులేషన్స్ 319 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యులు పదవి నుంచి వ్తెబొలగిన అనంతరం ఇతర ప్రభుత్వ హోదాలకు అర్హులు కారు 320 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ ల కర్తవ్యములు . 321 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ విధుల విస్తరణ 322 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ లకు అగు ఖర్చులు 323 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమిషన్ నివేదికలు

14 ఎ భాగం: ట్రిబ్యునల్స్ 323 ఎ వ అధికరణ: ప్రభుత్వోద్యోగులకు పరిమితమైన ఎడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ 323 బి వ అధికరణ: వేరే అన్ని ఇతర వ్యవహారాలను గురించిన ట్రిబ్యునల్స్

15 వ భాగం: ఎన్నికలు

324 వ అధికరణ: ఎన్నికల కమిషన్ అధికారములు 325 వ అధికరణ: ఓటర్ల జాబితాలో చేర్చబడుటకు మత, జాతి, కుల, లింగ భేదములు అడ్దురాకూడదు 326 వ అధికరణ: వయోజన ఓటు హక్కు 327 వ అధికరణ: రాష్ట్ర శాసనసభల ఎన్నిక గురించి చట్టాలను చేయు అధికారం పార్లమెంట్ కు కలదు 328 వ అధికరణ: ఆధికరణ 327 క్రింద పార్లమెంట్ శాసనసభల గురించి చట్టాలను చేయనిచో శాసనసభల గురించి చట్టాలను చేయనిచో శాసనసభలు తత్సంబంధిత చట్టాలను చేయవచ్చును. 329 వ అధికరణ: ఎన్నికలు తత్సంబంధిత విషయములప్తె కోర్టులు జోక్యం చేసుకొనరాదు 329 ఎ వ అధికరణ; ఉపసంహరింపబడినది

16 వ భాగం: కొన్ని తరగతుల రక్షణక్తె ప్రత్యేకాంశాలు

330 వ అధికరణ: లోక్‌సభలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు 331 వ అధికరణ: లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం 332 వ అధికరణ: శాసనసభలలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు 333 వ అధికరణ: శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం 334 వ అధికరణ: ప్తె కేటాయింపులు 50 సంవత్సరముల అనంతరం కొనసాగరాదు 335 వ అధికరణ: షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ ప్రభుత్వోద్యోగాలలో హక్కుల గుర్తింపు 336 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ లకు కొన్ని శాఖలలో ఉద్యోగావకాశాలు 337 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ ల విద్యాభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్స్ 338 వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ 338 ఎ వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ ట్త్రెబ్స్ 339 వ అధికరణ: షెడ్యూల్ద్ ఎరియాస్ ప్తె యూనియన్ పరిపాలన 340 వ అధికరణ: వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించే నిమిత్తం కమిషన్ నియామకం 341 వ అధికరణ: షెడ్యూల్ద్ తరగతులు 342 వ అధికరణ: షెడ్యూల్ద్ తెగలు

17 వ భాగం:రాజభాషలు యూనియన్ రాజభాష 343 వ అధికరణ: యూనియన్ రాజభాష 344 వ అధికరణ: రాజభాషప్తె పార్లమెంట్ నియమించు కమిషన్, కమీటీలు ప్రాంతీయ భాషలు 345 వ అధికరణ: రాష్ట్రములలోని రాజభాషలు 346 వ అధికరణ: రాష్ట్రముల మధ్య, రాష్ట్రములూ, యూనియన్ మధ్య ఉపయోగించవలసిన రాజభాష 347 వ అధికరణ: రాష్ట్రములలో ప్రాంతీయ భాషలు

సర్వోన్నత న్యాయస్థానము, హ్తెకోర్టులు ఉపయోగించు భాష

348 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము, హ్తెకోర్టులు, చట్టాలలోనూ ఉపయోగించవలసిన భాష 349 వ అధికరణ: భాషా సమస్యలప్తె చట్టములు

ప్రత్యేక ఆదేశాలు

350 వ అధికరణ:ఇంబ్బందుల నివారణక్తె సమర్పించు అర్జీల భాషలు 350 ఎ వ అధికరణ: మాతృభాషల ప్రోత్సాహకర వసతులు 350 బి వ అధికరణ: స్పెషల్ ఆఫిసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ 351 వ అధికరణ: హిందీ భాషాభివృద్ధి

18 వ భాగం:అత్యవసర పరిస్థితి

352 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన 353 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావం 354 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు యూనియన్, రాష్ట్రముల మధ్య రెవెన్యూ పంపిణీ 355 వ అధికరణ: రాష్ట్రములలో శాంతిభద్రతల పరిరక్షణ, వీదేశీ దండయాత్ర నివారణ, యూనియన్ బాధ్యత 356 వ అధికరణ: రాష్త్రములలో సంవిధానానుసర పరిపాలన భంగపడితే గవర్నర్ పాలన 357 వ అధికరణ: ప్తె అధికరణలను అనుసరించి ప్రకటన చేసినచో రాష్ట్ర శాసనసభల శాసనాధికారం యూనియన్ కు చెందును 358 వ అధికరణ: అత్యవసర పరిస్థితులలో అధికరణ-19 నిలుపుచచేయబడును 359 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు 3 వ భాగంలోని హక్కుల నిలుపుదల 3 9 ఎ వ అధికరణ: : ఉపసంహరించబడినది 360 వ అధికరణ : ఆర్థిక అత్యవసర పరిస్థితి

19 వ భాగం: ఇతరములు

361 వ అధికరణ: రాష్ట్రపతి, గవర్నర్, రాజ ప్రముఖులు - రక్షణలు 361 ఎ వ అధిఅకరణ: పార్లమెంట్, శాసనసభ సమావేశాలలో జరుగు కార్యకలాపాల ప్రచురణ 362 వ అధికరణ: ఉపసంహరించబడినది 363 వ అధికరణ: సంస్థానాధీశులతో చేసుకున్న ఒప్పందాలప్తె కోర్టులకు ప్రమేయం ఉండరాదు 363 ఎ వ అధికరణ: రాజ్యాభరణముల రద్దు 364 వ అధికరణ: నౌకాశ్రయముల, విమానాశ్రయములు 365 వ అధికరణ: యూనియన్ ఆదేశాలను రాష్ట్రలు అమలుచేయకపోతే 366 వ అధికరణ: నిర్వచనములు 367 వ అధికరణ: వివరణ

20 వ భాగం: సంవిధానములో మార్పులు

368 వ అధికరణ: సంవిధానములో మార్పు చేయు అధికారము అందుకొరక్తె అనుసరించిన విధానము

21 వ భాగం: తాత్కాలిక సంధికాలపు, ప్రత్యేకమైన అంశములు 369 వ అధికరణ: రాష్ట్రజాబితాలోని అంశాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చినట్లు భావించి చట్టాలను పార్లమెంట్ తాత్కాలికముగా చేయుట 370 వ అధికరణ: జమ్ము, కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన తాత్కాలిక అంశములు 371 వ అధికరణ: మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక అంశములు 371 ఎ వ అధికరణ: నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకాంశములు 371 బి వ అధికరణ: అస్సాం రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు 371 సి వ అధికరణ: మణిపూర్ రాష్ట్రమునకు సంబంధిచింన ప్రతేక అంశములు 371 డి వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు 371 ఇ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించుట 371 ఎఫ్ వ అధికరణ: సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు 371 జి వ అధికరణ: మిజోరాం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు 371 హెచ్ వ అధికరణ: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు 371 ఐ వ అధికరణ: గోవా రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు 371 జె వ అధికరణ:కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు 372 వ అధికరణ: రాజ్యంగ శాసనం అమలులోకి వచ్చిన తరువాత అంతకు ముందు ఉన్న చట్టాలను కొనసాగింపు 372 ఎ వ అధికరణ : చట్టాలను అనుసరింపచేయు రాష్ట్రపతి అధికారం 373 వ అధికరణ: ముందు జాగ్రత్త నిర్భంధం కేసులలో రాష్ట్రపతి అధికారాలు 374 వ అధికరణ: ఫెడరల్ కోర్టు, ప్రీవికౌన్సిల్ న్యాయమూర్తుల గురించి, ఆకోర్టులలో విచారణ కొరక్తె ఉన్నకేసులను గురించి 375 వ అధికరణ: ఈ సంవిధానం అమలుకు ముందు ఉన్న కోర్టులు. అందలి అధికారులు తమ హోదాలలో కొనసాగుదురు 376 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల గురించి 377 వ అధికరణ: కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి 378 వ అధికరణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి 378 ఎ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలపరిమితి గురించి 379-391 వ అధికరణలు : ఉపసంహరించబడినవి 392 వ అధికరణ: చిక్కులను పరిష్కరించుట కొరకు రాష్ట్రపతికి గల అధికారములు

22 వ భాగం: సంక్షిప్త నామము, ప్రారంభమగు తేదీ, శాసనం యొక్క హిందీ పాఠం, ఉపసంహరణలు

393 వ అధికరణ: సంక్షిప్త నామము 394 వ అధికరణ: ప్రారంభమగు తేదీ 394 ఎ వ అధికరణ: హిందీ పాఠము 395 వ అధికరణ: ఉపసహంరణలు