భారవి (ఆంగ్లం : Bharavi) (సా.శ. 6వ శతాబ్దం) ఒక సంస్కృత భాష కవి. ఇతడు తన మహాకావ్యం కిరాతార్జునీయం వలన ప్రసిద్ధుడయ్యాడు. మహాభారతానికి చెందిన ఈ కావ్య విషయం సంస్కృత భాషలో వ్రాశాడు. భారవి దక్షిణభారత దేశానికి చెందినవాడు. పశ్చిమ గంగ సామ్రాజ్యము నకు చెందిన దుర్వినిత, పల్లవ రాజైన సింహవిష్ణు కాలంలో ఈ కావ్యరచన గావించాడు.

పుట్టు పూర్వోత్తరాలు మార్చు

చాలా మంది సంస్కృత కవులలాగానే భారవి జీవిత విశేషాల గురించి కూడా చాలా కొద్ది సమాచారం మాత్రమే లభ్యమవుతోంది. క్రీ.పూ 634 సంవత్సరానికి చెందిన చాళుక్యుల శాసనంలో కాళిదాసు, భారవి పేరు పొందిన కవులుగా పేర్కొన్నారు. 8వ శతాబ్దానికి చెందిన కవి మాఘ, భారవిచే ప్రభావితుడయ్యాడని ప్రతీతి.

రచనలు మార్చు

ఆయన రాసిన రచనల్లో కిరాతార్జునీయం మాత్రమే లభ్యమవుతోంది. కానీ ఆ ఒక్క కావ్యంతోనే ప్రఖ్యాతి గాంచాడు.

మూలాలు మార్చు

బయట లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=భారవి&oldid=3496145" నుండి వెలికితీశారు