భారూచ్
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో భారూచ్ జిల్లా (గుజరాతీ:ભરૂચ) ఒకటి. భారూచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్యా పరంగా బోస్టన్ నగర జనసంఖ్యతో సమానం. జిల్లా గుజరాత్ రాష్ట్ర దక్షిణ భూభాగంలో పశ్చిమ తీరంలో ఉంది. నర్మదానది జిల్లాలో నుండి గల్ఫ్ ఆఫ్ ఖంబాత్‌లో సంగమిస్తుంది. నర్మదానది జిల్లాను ఉత్రర, మధ్య భారతీయ రాజ్యాలతో అనుసంధానం చేస్తుంది.
చరిత్రసవరించు
జిల్లాలో ఉన్న భారూచ్ నగరం, పరిసర ప్రాంతాలు పురాతనకాల నౌకానిర్మాణ కేంద్రం, నౌకాశ్రయంగా ఉండేది. ఇక్కడ నుండి గ్రీకు, పర్షియన్, రోం రాజ్యాలకు వ్యాపార సంబంధాలు ఉండేవి. వర్షాకాలంలో దేశంలోని తూర్పు భాగం నుండి సుగంధద్రవ్యాలు, సిల్క్ ఇక్కడకు వచ్చి చేరడానికి నదీ ప్రవాహాలు అనుకూలంగా ఉండేవి.
విభాగాలుసవరించు
జిల్లాలో ఉన్న తాలూకాలు :- బారుచ్, అంక్లేశ్వర్, హాన్సన్, జంబుసర్, ఝగదీ, అమొదె, గుజరాత్, వాలియా, వాగ్ర.
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,550,822, [1] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | హవాయ్ నగర జనసంఖ్యకు సమం..[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 321వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 238 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.14%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 924:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 83.03%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
జిల్లాలో ముస్లిములు 57% ఉన్నారు. హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. వొహారా పఠేల్ ముస్లిం ప్రజలకు ఇది స్వస్థలం.
సంస్కృతిసవరించు
సుప్రసిద్ధ వ్యక్తులుసవరించు
- ఆడమ్ పటేల్, బ్లాక్బర్న్ ( బారన్ పటేల్)
- అహ్మద్ పటేల్ (కాంగ్రెస్)
- అలిముద్దిన్ జుంల
- బల్వంత్రయ్ తాకోరే (1869-1952) కవి. బారుచ్ లో జన్మించారు.
- కనైయలల్ మనెక్లల్ మున్షి (1887-1971) భారత స్వాతంత్ర్య ఉద్యమం కార్యకర్త, రాజకీయ వేత్త, రచయిత, విద్యావేత్త. బారుచ్ నగరంలో జన్మించాడు [4]
- మునాఫ్ పటేల్
- నిమిత్త్ దేశాయ్ (1988-)
- రషీద్ పటేల్
- త్రిభువనదాస్ లుహర్ (1908-1991) కవి. మియమతర్‌లో జన్మించిఅడు.[5]
- మొహ్మెద్ హుస్సేన్ కాంట్రాక్టర్
- నర్మదనంద్‌జి యు.సి.హెచ్.ఎ.ఎల్.ఇ ఆశ్రమాన్ని అంక్లేశ్వర్ మమీపంలో ఉన్న నరేశ్వర్‌లో నడుపుతున్నారు.
ఇవికూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gabon 1,576,665
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Hawaii 1,360,301
- ↑ "Bhavan's Faith". Bharatiya Vidya Bhavan. Archived from the original on 21 ఏప్రిల్ 2010. Retrieved 20 May 2011.
- ↑ "Tribhuvandas Luhar (Sundaram)". Thakkar Numismatic and Art Foundation. Retrieved 20 May 2011.