భావన బల్సావర్

భారతీయ నటి

భావనా బల్సావర్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి.[1] 2010లో వచ్చిన గుతుర్ గు అనే సిరీస్ లో నటించింది.[2][3]

భావన బాల్సవర్
తల్లి శుభా ఖోటేతో భావన బాల్సవర్
జననం (1975-10-21) 1975 అక్టోబరు 21 (వయసు 49)
విద్యఎస్.ఎన్.డి.టి. కళాశాల
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
కరణ్ షా
(m. 2002)
తల్లిదండ్రులుడిఎం బల్సావర్ (తండ్రి)
శుభా ఖోటే (తల్లి)

జననం, విద్య

మార్చు

భావన 1975 అక్టోబరు 21న డిఎం బల్సావర్ - హిందీ సినీ నటి శుభా ఖోటే దంపతులకు మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. భావనకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వీరిలో అశ్విన్ బల్సావర్ సౌండ్ రికార్డిస్ట్.[4] భావన ఆర్య విద్యా మందిర్ పూర్వ విద్యార్థి, 10వ తరగతిలో ఐసిఎస్ఈ టాపర్ గా నిలిచింది.[5] ఆమె ఎస్.ఎన్.డి.టి. కళాశాల నుండి డ్రెస్ డిజైనింగ్, ఫ్యాషన్ కోఆర్డినేషన్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

2002లో సినీ నటుడు కరణ్ షాతో భావన వివాహం జరిగింది.[6][7] భావన తాత, నందూ ఖోటే ప్రముఖ రంగస్థల నటుడు, మూకీ సినిమాల్లో నటించాడు, వీరి కోడలు నటి దుర్గా ఖోటే.[8] ఆమె నటుడు విజు ఖోటే మేనకోడలు.

సినిమాలు

మార్చు
  • ధూమ్ దడక్క (అంగూరి)
  • సుఖీ సంసారచీ 12 సూత్రే
  • ఆమ్చ్య సార్ఖే ఆమ్హిచ్ (శుభంగి)

టెలివిజన్

మార్చు
  • ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ (2003) (సరస్వతి/సారు)
  • దేఖ్ భాయ్ దేఖ్ (సునీతా దీవాన్) (1993)
  • జబాన్ సంభాల్కే (Ms. విజయ) (1993)
  • నో ప్రాబ్లమ్ (1993)
  • తెహ్కికాత్ (1994)
  • కరంచంద్
  • ఇధర్ ఉధర్ (కేటీ)
  • అస్మాన్ సే ఆగే
  • ఓ డాడీ
  • అస్కాన్షా
  • మృత్యూ
  • అతీత్
  • జానే మేరా జిగర్ కిదర్ గయా జీ (1996–1997)
  • ఓ డాడీ (1996)
  • హమ్ ఆప్కే హై వో (1997)
  • డ్యామ్ డామా డ్యామ్ (1998)
  • హేరా ఫేరి (1999)
  • జుగల్ బందీ
  • హమ్ సబ్ బరాతీ (2004)
  • గుటూరు గు (2010–2012)
  • అదాలత్ (2010)
  • లఖోన్ మే ఏక్ (2012) [9]
  • గుటర్ గు 2 (2012–2013)
  • సత్రంగీ ససురల్ (2014–2016)
  • గుటర్ గు 3 (2014)
  • బేలన్ వలీ బహు (2018)
  • గుడియా హమారీ సభి పె భారీ (2020)
  • గూఢచారి బహు (2022)

నాటకం

మార్చు
  • అంధాయుగ్

మూలాలు

మార్చు
  1. "Bhavana Balsavar". Gomolo. Archived from the original on 2017-02-02. Retrieved 2022-12-06.
  2. "Fans love Gutur Gu cast". The Times of India. 12 March 2011. Archived from the original on 11 April 2013.
  3. "Hush: Gutur Gu, India's first silent comedy show, goes on air from March 5". The Indian Express. 7 March 2010.
  4. "Shubha Khote – Memories". cineplot.com. Retrieved 2022-12-06.
  5. "'Comedy is about timing, not buffoonery' : with Bhavana Balsaver". Indian Television Dot Com. 2 August 2005. Retrieved 2022-12-06.
  6. Shobha Khote with daughter Bhavna Balsaver during 'SAB Ke Anokhe Awards' The Times of India, 26 June 2012.
  7. "An Interview with Bhavana Balsaver". indiantelevision.com. 2 August 2005. Retrieved 2022-12-06.
  8. The Forgotten Bollywood bhai-behan Brigade Bollywood Hungama, 9 August 2006.
  9. "Bhavna Balsavar,Rahul Vohra & Rajesh Jais in Lakhon Mein Ek". The Times of India. 11 September 2012. Archived from the original on 23 October 2012.

బయటి లింకులు

మార్చు