శుభా బల్సావర్ ఖోటే భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి, ఆమె అనేక హిందీ భాష, కొన్ని మరాఠీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె స్విమ్మింగ్, సైక్లింగ్‌లలో మాజీ మహిళా జాతీయ ఛాంపియన్ కూడా.

శుభా ఖోటే
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సినిమా & థియేటర్
జీవిత భాగస్వామి
డి.ఎం. బల్సవర్
(m. 1960)
పిల్లలు2 (భావన బల్సావర్ తో సహా)
కుటుంబందుర్గా ఖోటే (పిన్ని)
విజు ఖోటే (సోదరుడు)
తన తమ్ముడు విజు ఖోటేతో కలిసి శుభా ఖోటే
తన కుమార్తె భావన బల్సావర్‌తో కలిసి శుభా ఖోటే

1962లో ఘరానా (1961), ససురల్ (1961) చిత్రాలలో తన నటనకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు ఆమె నామినేట్ చేయబడింది.

ప్రారంభ జీవితం మార్చు

శుభ ఖోటే మరాఠీ-కొంకణి కుటుంబంలో జన్మించింది, తండ్రి మరాఠీ రంగస్థల ప్రముఖ నటుడు నందు ఖోటే, కాగా, తల్లి కర్ణాటకలోని మంగళూరుకు చెందిన కొంకణి మహిళ. నటుడు విజు ఖోటే ఆమె తమ్ముడు.[1] ప్రముఖ నటి దుర్గా ఖోటే, నందు ఖోటే సోదరుని భార్య. శుభా ఖోటే తల్లి మేనమామ నాయంపల్లి కూడా నటుడు.[2]

శుభా ఖోటే చార్ని రోడ్ లోని సెయింట్ థెరిసాస్ హై స్కూల్, సెయింట్ కొలంబా స్కూల్ (గాందేవి)లలో చదివింది. ఆమె స్విమ్మింగ్, సైక్లింగ్‌లలో రాణించింది. ఆమె వరుసగా మూడు సంవత్సరాలు, 1952 నండి 1955 వరకు స్విమ్మింగ్, సైక్లింగ్‌లలో మహిళల జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత, ఆమె విల్సన్ కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైంది.

మంగళూరుకు చెందిన డి. ఎం. బల్సావర్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఆయన ప్రధాన భారతీయ కార్పొరేట్ నోసిల్‌లో మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్.[3] ఆమె నిర్మించి దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం చిముక్లా పహునా (1968)లో అతను అతిధి పాత్రలో కనిపించాడు.[4] వీరి కుమార్తె భావనా ​​బల్సావర్ కూడా టీవీ నటి.[5]

ఫిల్మోగ్రఫీ మార్చు

కొన్ని సినిమాలు మార్చు

సీమా (1955)
పేయింగ్ గెస్ట్ (1957)
దేఖ్ కబీరా రోయా (1957)
ముజ్రిమ్ (1958)
దీదీ (1959)
ఛోటీ బహెన్ (1959)
అనారి (1959)
ఘరానా (1961)
ససురల్ (1961)
హమ్రాహి (1963)
గ్రహస్తి (1963)
దిల్ ఏక్ మందిర్ (1963)
జిద్ది (1964)
ఫూలోన్ కీ సెజ్ (1964)
ఆకాశ్దీప్ (1965)
లవ్ ఇన్ టోక్యో (1966)
తుమ్సే అచ్ఛా కౌన్ హై (1969)
మిలి (1975)
బెనామ్ (1974)
గోల్ మాల్ (1979)
బాదల్తే రిష్టే (1978)
నసీబ్ (1981)
ఏక్ దుయుజే కే లియే (1981)
సురాగ్ (1982)
ఏక్ దిన్ బహు కా (1983)
పుకార్
మెయిన్ ఆవారా హూన్ (1983)
కూలీ (1983)
మేరా ఫైస్లా (1984)
గాంగ్వా (1984)
హమ్ డోనో (1985)
హకీకత్
సాగర్ (1985)
ఆఖిర్ క్యోన్? (1985)
మజ్లూమ్ (1986)
స్వరాగ్ సే సుందర్ (1986)
హిఫాజత్ (1987)
మజా పతి కరోడ్‌పతి (1988)
ఖూన్ భారీ మాంగ్ (1988)
బిల్లూ బాద్షా (1989)
కిషన్ కన్హయ్య (1990)
జవానీ జిందాబాద్ (1990)
షేర్ దిల్ (1990)
ప్యార్ హువా చోరీ చోరీ (1990)
బెగునా (1991)
కర్జ్ చుకనా హై (1991)
దిల్ హై కి మంత నహిన్ (1991)
సౌదాగర్ (1991)
ఏక్ లడ్కా ఏక్ లడ్కీ (1992)
పర్దా హై పర్దా (1992)
జునూన్ (1992)
అనారి (1993)
వక్త్ హమారా హై (1993)
సాజన్ కా ఘర్ (1994)
సాంగ్దిల్ సనమ్ (1994)
కోయిలా (1997)
సిర్ఫ్ తుమ్ (1999)
శరరత్ (2002)
టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ (2017)
బకెట్ లిస్ట్ (2018)
డబుల్ ఎక్స్ ఎల్ (2022)

టెలీవిజన్ మార్చు

జునూన్ (1994)
జబాన్ సంభాల్కే (1993)
ఏక్ రాజా ఏక్ రాణి (1996)
అందాజ్ (1998)
డ్యామ్ డామా డ్యామ్ (1998-1999)
జుగ్ని చలి జలంధర్ (2008-2010)
బా బహూ ఔర్ బేబీ (2010)
ఏక లగ్నాచి తీస్రీ గోష్టా (2013 మరాఠీ)
మంగళం దంగలం (2018-2019)
స్పై బహు (2022)
తిప్‌క్యాంచి రంగోలి (2022)

మూలాలు మార్చు

  1. Rakhi Special: Bollywood's best brother-sister duo
  2. "Shubha Khote – Memories". cineplot.com. Retrieved 2016-08-12.
  3. "I never believed I was pretty - Shubha Khote". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-05.
  4. "Shubha Khote – Memories". cineplot.com. Retrieved 2016-08-12.
  5. Shobha Khote with daughter Bhavna Balsaver during 'SAB Ke Anokhe Awards' The Times of India, 26 June 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=శుభా_ఖోటే&oldid=4004255" నుండి వెలికితీశారు