భీంపూర్ మండలం
భీంపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] భీంఫూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. ఇందులో 19 రెవెన్యూ గ్రామాలున్నాయి.[2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.
భీంపూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, భీంపూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°30′34″N 78°53′50″E / 19.509516°N 78.897259°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | భీంపూర్ (భీంపూర్ మండలం) |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 195 km² (75.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 23,047 |
- పురుషులు | 11,490 |
- స్త్రీలు | 11,557 |
పిన్‌కోడ్ | 504311 |
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
మార్చుఇంతకుముందు భీంపూర్ గ్రామం అదిలాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోని తాంసీ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా భీంపూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా,తిరిగి అదిలాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోనే కొనసాగిస్తూ క్రింద 1+18 (పందొమ్మది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 195 చ.కి.మీ. కాగా, జనాభా 23,047. జనాభాలో పురుషులు 11,490 కాగా, స్త్రీల సంఖ్య 11,557. మండలంలో 5,241 గృహాలున్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.