భువనవిజయం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భువనవిజయం, అనేది శ్రీ కృష్ణదేవ రాయలు ఆస్థానం.భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజాలుగా ప్రఖ్యాతి పొందారు.
విశేషాలు
మార్చుశ్రీ కృష్ణదేవ రాయలు సాహితీ పిపాసకుడు. తెలుగునాట రాజ్యమేలిన రాజులలోకెల్లా అత్యంత ఉత్తముడైన కళాపోషకుడు, కళాబంధు. తాను స్వయంగా ఆముక్త మాల్యద అనబడే పద్య గ్రంధాన్ని రచించాడు. వారి కొలువులో నిత్యం పద్యపారాయణం సాహిత్యపూర్వకమైన స్నేహపూర్వకమైన పోటీలూ భేటీలూ నిర్వహించే కవులనే అష్టదిగ్గజాలు అంటారు. శ్రీకృష్ణ దేవరాయుని సాహితీ సమరాంగణంలో అష్టదిగ్గజాల పాత్ర మరువలేనిదీ బహు అమూల్యమైనదీనూ.
అష్టదిగ్గజాలు
మార్చుఅష్టదిగ్గజాలు అనబడే ఆ కవులపేర్లు వరుసగా;
- ధూర్జటి
- అల్లసాని పెద్దన
- నంది తిమ్మన
- మాదయ్యగారి మల్లన
- అయ్యలరాజు రామభధ్రుడు
- పింగళి సూరన
- వేములవాడ భీమకవి
- తెనాలి రామకృష్ణుడు
భువనవిజయం (రూపకం)
మార్చుఈనాటికీ తెలుగునాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో సాహితీ ప్రియులు ఒ చల్లటి సాయంత్రాన ఏ వేదికలోనో కలుసుకుని వారిలో ఒకరిని శ్రీకృష్ణ దేవరాయునిగా ఎన్నుకుని ఎవరికివారు అష్టదిగ్గజాల్లో మరొకరి పాత్ర తీసుకుని భువనవిజయ వైభవాన్ని మురిపెంగా ప్రదర్శించుకుంటారు. ఆ పాత మధురాలను ఆప్యాయంగా నెమరువేసుకుని చూపరులనూ చదువరులనూ ఆహూతులనూ మైమరిపింపచేస్తారు.
మూలాలు
మార్చుఇతర లింకులు
మార్చు
అష్టదిగ్గజములు |
---|
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |