భువనవిజయం (రూపకం)

భువనవిజయం (రూపకం) 1952 ప్రాంతాలలో గుంటూరులోని ఏకా ఆంజనేయులు అనే సాహిత్య పోషకుడి ఆలోచనా ఫలితంగా జమ్మలమడక మాధవరామశర్మ రూపకల్పన చేసిన రూపకం.

భువన విజయం సాహిత్య రూపకం

విశేషాలు మార్చు

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి భువనవిజయము అని పేరు. ఇతడి ఆస్థానంలో సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ కవులెందరో ఉండేవారు. వారిలో ఎనిమిది మందికి అష్టదిగ్గజాలు అనే పేరు వచ్చింది. ఇతడు తన సభలో ఎనిమిది దిక్కులా ఎనిమిది సింహాసనాలు ఏర్ఫాటు చేసి అల్లసాని పెద్దన మొదలైన కవులను సింహాసనాలపై ఆసీనులను చేసి గోష్ఠి జరిపేవాడు అని ప్రతీతి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని 1952 ప్రాంతాలలో గుంటూరులోని ఏకా ఆంజనేయులు అనే సాహిత్య పోషకుడికి పెద్దనాది కవులుగా విశ్వనాథ సత్యనారాయణ వంటి పెద్ద కవులను ఆహ్వానించి రాయలుగా ఎవరైనా సాహితీప్రియుడైన ప్రముఖవ్యక్తిని కూచోబెట్టి గోష్ఠి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అతడి ఆలోచనకు జమ్మలమడక మాధవరామశర్మ రూపకల్పన చేశాడు. ఆవిధంగా మొట్టమొదటి భువనవిజయ రూపకం గుంటూరులో ప్రారంభమైంది. దీనిలో జమ్మలమడక మాధవరామశర్మ తిమ్మరుసు గాను, విశ్వనాథ సత్యనారాయణ పెద్దన గాను, మోచర్ల రామకృష్ణయ్య , వేదాంతకవి ప్రభృతులు వివిధ పాత్రలను ధరించారు. హైకోర్టు నాయమూర్తి కందా భీమశంకరం శ్రీకృష్ణదేవరాయల పాత్రను పోషించాడు. వీరంతా సాంప్రదాయ సూచకమైన ధోవతి, శాలువా, లాల్చీలే తప్ప ప్రత్యేకమైన వేషధారణ చేసుకోలేదు.

ఆనాటి నుండి భువన విజయము పేరుతో ఆంధ్రరాష్ట్రం నలుమూలలా కొన్ని వేల ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణా ప్రాంతములో దివాకర్ల వేంకటావధాని దీనిని ఒక నాటకంగా రచించి, కొంతమంది విద్యాంసులను ఎంపికచేసి, వాళ్ళచేత వేషధారణ చేయించి, రంగులు పూయించి కొన్ని వందల ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. తెలుగు రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాలలో తెలుగువారున్న ప్రతిచోటా ఈ సాహితీరూపకం ప్రదర్శింపబడింది. అంతే కాకుండా తానా సంస్థ సహకారంతో అమెరికాలో న్యూయార్క్, పిట్స్‌బర్గ్, న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, డెన్వర్, లాస్ ఏంజిలిస్, శాన్ ఫ్రాన్సిస్కో మొదలైన నగరాలలో ప్రదర్శింపబడింది. ఈ రూపకాలలో ఆయా పాత్రధారుల సాహితీప్రాభవము, సమయస్ఫూర్తి, ఆశుకవితా ప్రజ్ఞ ఈ ప్రక్రియకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను పోషించిన ప్రముఖులు మార్చు

ఆవుల సాంబశివరావు, జి.రామానుజులునాయుడు, కె.పి.నారాయణరావు, కనుమలూరు వెంకటశివయ్య, ఐ.వి.సుబ్బారావు, ఎస్.వి.జోగారావు, జూపూడి యజ్ఞనారాయణ, పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు,సీబీవీఆర్కే శర్మ,ఆచార్య ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్,వడ్డి శ్యామసుందరరావు, డా అక్కిరాజు సుందర రామకృష్ణ  మొదలైన ప్రముఖులెందరో రాయల పాత్రను ధరించి భువన విజయ రూపకానికి గౌరవం చేకూర్చారు.

అష్టదిగ్గజ కవులు, తిమ్మరుసు పాత్రలు ధరించిన కొందరు ప్రముఖులు మార్చు

ప్రసాదరాయ కులపతి, పొత్తూరి వెంకటేశ్వర రావు, పిరాట్ల వెంకటేశ్వర్లు,జంధ్యాల పాపయ్యశాస్త్రి, ఓరుగంటి నీలకంఠశాస్త్రి, వావిలాల సోమయాజులు, ఏలూరిపాటి అనంతరామయ్య, కోగంటి సీతారామాచార్యులు, మేడసాని మోహన్, తంగిరాల వెంకట సుబ్బారావు, ముదిగొండ శివప్రసాద్, గుండవరపు లక్ష్మీనారాయణ, జంధ్యాల మహతీశంకర్, కడిమెళ్ళ వరప్రసాద్, అక్కిరాజు సుందర రామకృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, మొవ్వ వృషాధిపతి, పింగళి వెంకటకృష్ణారావు, పింగళి జగన్నాథరావు, గండ్లూరి దత్తాత్రేయశర్మ, వద్దిపర్తి పద్మాకర్, డా: మల్లాప్రగడ  శ్రీమన్నారాయణమూర్తి గారు, డా.రాయప్రోలు వేంకట కామేశ్వరశర్మ, రావూరి వెంకటేశ్వర్లు, వారణాసి వెంకటేశ్వర శాస్త్రి,డా యస్వీ రాఘవేంద్రరావు, యెఱ్ఱాప్రగడ రామకృష్ణ, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, మైలవరపు సాంబశివరావు, జనాబ్ ఖాదర్ ఖాన్,ధూళిపాళ మహాదేవమణి, పీసపాటి నరసింహమూర్తి, సినీనటుడు పద్మనాభం, అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, కొంపెల్ల రామసూర్యనారాయణ , కేసాప్రగడ సత్యనారాయణ మొదలైనవారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు