భువనేశ్వర్ కుమార్

భువనేశ్వర్ కుమార్ (జ. ఫిబ్రవరి 5, 1990) ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతని స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్. దేశీవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ తరపున ఆడాడు.

Bhuvneshwar Kumar
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Bhuvneshwar Kumar Singh
పుట్టిన తేదీ (1990-02-05) 1990 ఫిబ్రవరి 5 (వయసు 34)
Meerut, ఉత్తర ప్రదేశ్, India
మారుపేరుBhuvi
ఎత్తు5 ft 10 in (1.78 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రBowling all-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 276)2013 ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2014 జూలై 17 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 194)2012 డిసెంబరు 30 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2014 సెప్టెంబరు 5 - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 45)2012 డిసెంబరు 25 - పాకిస్తాన్ తో
చివరి T20I2014 ఏప్రిల్ 06 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–presentఉత్తర ప్రదేశ్
2009–2010రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2011–2013పూణే వారియర్స్
2014–presentసన్ రైజర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI T20I ఫస్ట్
మ్యాచ్‌లు 11 39 9 52
చేసిన పరుగులు 343 136 6 1944
బ్యాటింగు సగటు 24.50 10.47 - 29.45
100లు/50లు 0/3 0/0 0/0 1/11
అత్యుత్తమ స్కోరు 63* 31 6* 128
వేసిన బంతులు 1661 1934 186 9057
వికెట్లు 28 42 11 158
బౌలింగు సగటు 37.88 36.07 17.55 26.69
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0 8
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a n/a n/a 0
అత్యుత్తమ బౌలింగు 6/82 4/8 3/9 6/77
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 13/– 1/- 10/–
మూలం: Cricinfo, 2014 ఫిబ్రవరి 12

వ్యక్తిగతం మార్చు

భువనేశ్వర్ తండ్రి కిరణ్‌పాల్ సింగ్ ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్. తల్లి ఇంద్రేష్ గృహిణి. వారి బంధువులు చాలా మంది పోలీసు, ఆర్మీ ఉద్యోగాల్లో ఉండేవారు కావడంతో సహజంగా భువికి కూడా చిన్నతనంలో ఆర్మీలో చేరాలని ఉండేది. కానీ 10 ఏళ్ళ వయసులో క్రికెట్ ఆడుతున్నపుడు ఆటపై అతని ఆసక్తిని గమనించి అక్క రేఖ అతన్ని మీరట్ లోని విక్టోరియా పార్క్ మైదానంలో శిక్షణ ఇచ్చే విపిన్ వత్స్, సంజయ్ రస్తోగి ల దగ్గర చేర్చింది. అక్కడే భువనేశ్వర్ ఆటలో మెళకువలు తెలుసుకున్నాడు.

2018 భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన మార్చు

భువనేశ్వర్‌ టెస్టు కెరీర్‌లో 2014 ఇంగ్లండ్‌ సిరీస్‌లో 19 వికెట్లతో చెలరేగడం అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత కూడా టెస్టుల్లో అతనిపై పెద్దగా నమ్మకం ఉంచలేదు. కానీ 2018 భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో అతను అన్ని విధాలా దానిని తప్పని నిరూపించాడు. తొలి రోజు సఫారీ ఓపెనర్లతో పాటు ఆమ్లా వికెట్‌ తీసిన తీరు అతను ఈ సిరీస్‌ కోసం ఎలా సన్నద్ధమయ్యాడో చూపించింది. ఆ తర్వాత డి కాక్‌ వికెట్‌ కూడా పడగొట్టాడు. అయితే వికెట్లు తీసిన తీరుకంటే భువీ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా తడబడటం అతని సత్తాకు నిదర్శనం. జొహన్నెస్‌బర్గ్‌ టెస్టు గెలుపులో నిస్సందేహంగా భువీదే ప్రధాన పాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో చకచకా చేసిన 30 పరుగులు, అనూహ్యమైన బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదకరంగా మారిన పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 33 పరుగులు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చాయి. తొలి ఇన్నింగ్స్‌లో మళ్లీ ఎల్గర్, మార్క్‌రమ్‌లతో పాటు డివిలియర్స్‌ను అద్భుత బంతితో బౌల్డ్‌ చేసి భువీ ఈ మ్యాచ్‌ చేయిదాటిపోకుండా చూశాడు. ఈ కష్టాన్ని గుర్తించే కాబోలు ఆరో వన్డేకు ముందు ‘నిజంగా విశ్రాంతి ఇవ్వాల్సిందంటే భువనేశ్వర్‌కే’ అంటూ కెప్టెన్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. వాస్తవానికి ఆల్‌రౌండర్‌ అంటూ హార్దిక్‌ పాండ్యాపై అందరి గురి నిలిచింది కానీ భారత జట్టుకు సంబంధించి అసలైన ఆల్‌రౌండర్‌ భువనేశ్వరే. తొలి టి20 మొదటి స్పెల్‌లో 3 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన భువీ, తన చివరి ఓవర్లో మరో 3 వికెట్లతో మ్యాచ్‌ను గెలిపించడం విశేషం.

విశేషాలు మార్చు

  • తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లోనే తొలి ఓవర్లో వికెట్ తీశాడు.
  • తొలి వన్డేలో మొదటి బంతికే వికెట్ తీశాడు.

నకుల్ బాల్ మార్చు

ఆటపై బ్యాటింగ్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో బౌలర్లు ప్రతీ సారి భిన్నంగా ప్రయత్నించాల్సి ఉంటోంది. అదే క్రమంలో భువనేశ్వర్‌ నకుల్‌ బాల్‌ ను ప్రత్యేకంగా సాధన చేశాడు. టి20 మ్యాచ్‌లో అతను దానిని సమర్థంగా ఉపయోగించాడు. ఇందులో సఫలం అయ్యేందుకు దాదాపు ఏడాదిగా శ్రమిస్తున్నట్లు భువనేశ్వర్‌ చెప్పాడు. నకుల్‌ బాల్‌ అనేది బేస్‌బాల్‌ క్రీడ నుంచి వచ్చింది. పేరులో నకుల్స్‌ (వేలి మెటికలు) ఉన్నా అవేమీ ఉపయోగించరు. వేలి గోళ్లతో పట్టు బిగించి ఆ తర్వాత బంతిని వదులుతారు. బంతిని సంధించే సమయంలో సాధారణ బంతిలాగే వేగాన్ని కొనసాగిస్తే బ్యాట్స్‌మెన్‌ దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే బౌలర్‌ కూడా దీనిని నియంత్రణలో ఉంచుకోవాలంటే తీవ్ర సాధన అవసరం. గతంలో జహీర్‌ ఖాన్‌ నకుల్‌ బాల్‌తో కొంత సఫలం కాగా, సునీల్‌ నరైన్‌ బాగా వాడాడు. అయితే టాంపరింగ్‌ ఆరోపణలతో యాక్షన్‌ను మార్చుకున్న తర్వాత నరైన్‌ దీనికి దూరమయ్యాడు.

మూలాలు మార్చు

  1. "Pacers take parallel tracks to success". The Times of India. డిసెంబరు 27 2012. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved జూలై 17 2013. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)