బాల్ టాంపరింగ్

క్రికెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా బంతి ఆకారాన్ని మార్చే చర్య

క్రికెట్ క్రీడలో బాల్ టాంపరింగ్ అనేది ఫీల్డరు బంతి స్థితిని చట్టవిరుద్ధంగా మార్చే చర్య. స్వింగ్ బౌలింగ్‌కు దోహదం చేసేందుకు బంతి ఏరోడైనమిక్స్‌లో జోక్యం చేసుకోవడం బంతి ట్యాంపరింగులో ప్రాథమికమైన ప్రేరణ.

సహజమైన ఆకృతిలో క్రికెట్ బంతి

నిర్వచనం

మార్చు

క్రికెట్ చట్టాల్లో చట్టం 41, సబ్‌సెక్షన్ 3 ప్రకారం, కృత్రిమ పదార్థం దేన్నీ ఉపయోగించకుండా బంతిని పాలిష్ చేయవచ్చు. బంతి తడిగా ఉంటే దాన్ని తువ్వాలుతో తుడవవచ్చు. మట్టి అంటుకుంటే ఇతరుల పర్యవేక్షణలో ఆ మట్టిని తీసివేయవచ్చు. బంతి ఆకారాన్ని, స్థితినీ మార్చే ఇతర చర్యలు ఏవైనా సరే, చట్టవిరుద్ధం. బంతిని నేలపై రుద్దడం, వేలిగోరు లేదా ఇతర పదునైన వస్తువులతో చెక్కడం, బంతిపై ఉండే సీమ్‌ను ట్యాంపరింగ్ చేయడం వంటివి నిషేధిత చర్యల్లో కొన్ని.

ఎందుకు చేస్తారంటే

మార్చు

బంతి, బౌలింగుకు మరింత అనుకూలంగా ఉండేలా చేసేందుకు బంతి స్థితిని మారుస్తారు. బంతి ట్యాంపరింగ్‌కు ఉదాహరణలుగా పెదాలపై రాసుకునే బామ్ లేదా తీపి లాలాజలం వంటి పదార్థాన్ని పూయడం, బంతిపై ఉండే సీమ్‌ను పీకడం వంటివి ఉంటాయి. రాపిడితో లేదా కోయడం చెక్కడం (బూట్ స్పైక్‌లు లేదా బాటిల్ క్యాప్స్ లేదా సాండ్‌పేపర్ వంటివి) వంటివి చేసి, బంతిని ఒక వైపు గరుకుగా మార్చడం కూడా బంతి ట్యాంపరింగ్ కిందకి వస్తుంది.

బంతిని చట్టబద్ధంగా మార్చడం

మార్చు

ఉమ్మి, చెమటను ఉపయోగించి బంతిని మెరిపించడం స్వింగ్ బౌలింగ్ అభ్యాసకులకు మామూలే. (అయితే COVID-19 మహమ్మారి కారణంగా దీన్ని నిషేధించారు). ఉమ్మి లేదా చెమటలో ఉండే తేమ, బంతిలో ఒక సగానికి మాత్రమే పూయడంతో బంతికి ఆ వైపు మెరుపు వస్తుంది, రెండో వైపు కంటే మృదువుగా ఉంటుంది. తద్వారా బంతి గాల్లో ప్రయాణించేటపుడు దాని ఉపరితలంపై మృదువుగా ఉన్న వైపున గాలి, రెండో వైపు కంటే వేగంగా వెళ్లేలా చేస్తుంది. సరిగ్గా బౌలింగ్ చేసినప్పుడు, బంతి గాలిలో ఒక వైపు నుండి మరొక వైపుకు వంపుగా వెళ్తుంది. అలాగే, చాలా క్రికెట్ మ్యాచ్‌లలో కనిపించే విధంగా ఫీల్డర్లు బంతి తడిని తుడవడానికి లేదా పాలిష్ చేయడానికి తమ దుస్తులపై రుద్దడం కూడా సర్వసాధారణం.

ఉదాహరణలు, ఆరోపణలు

మార్చు

బంతిని పాలిష్ చేయడానికి బయటి పదార్థాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం. కానీ అంపైర్‌లకు దాన్ని గుర్తించడం కష్టం. సాధారణంగా బంతికి మెరుపు నివ్వడానికి లాలాజలం ఉపయోగిస్తారు. కానీ COVID-19 మహమ్మారి కారణంగా లాలాజలం ద్వారా వైరల్ సంక్రమించే ప్రమాదం ఉన్నందున దాన్ని ఇప్పుడు నిషేధించారు. ఈ నియమం ఎప్పుడైనా తిరిగి మార్చబడుతుందా అనేది అస్పష్టంగా ఉంది. ఆటగాళ్ళు ఇప్పుడు చెమట వంటి బంతిని ప్రకాశింపజేయడానికి ఇతర చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయోజనం కోసం ఉపయోగించిన పదార్ధాలలో హెయిర్ జెల్, స్వీట్ల నుండి చక్కెర, లిప్ బామ్ ఉన్నాయి. తెలుసుకోలేని విధంగా బంతి ట్యాంపరింగ్ జరుగుతూ ఉండవచ్చని కొంతమంది వ్యాఖ్యాతలు సూచించారు. [1]

ప్రధాన సీమ్‌కు ఉండే దారాలను పీకడం లేదా సాంప్రదాయిక, రివర్స్ స్వింగ్‌కు సహాయం చేయడానికి క్వార్టర్ సీమ్‌ను 'లాగడం' వంటివి చేయడం కూడా చట్టవిరుద్ధమే. క్వార్టర్ సీమ్‌ను లాగడాన్ని గుర్తించడం లేదా నిరూపించడం చాలా కష్టం. [2]

అంతర్జాతీయ క్రికెట్‌లో టెలివిజన్ కవరేజీ పెరగడం వల్ల బంతి ట్యాంపరింగ్ ఆరోపణకు సంబంధించిన అనేక ఉన్నత స్థాయి సందర్భాలు వెలుగు లోకి వచ్చాయి. బంతి ట్యాంపరింగ్ అనేది ఒక రకమైన మోసం, దాన్ని నిరూపించడం చాలా కష్టం కాబట్టి, ఆరోపణలు తరచుగా వివాదాస్పదం అవుతూ ఉంటాయి.

క్రిస్ ప్రింగిల్, 1990

మార్చు

1990 సిరీస్‌లో పాకిస్తాన్ పర్యటనలో, న్యూజిలాండ్ బౌలర్ క్రిస్ ప్రింగిల్ ఫైసలాబాద్‌లో బంతిని ఒక వైపు గరుగ్గా చేయడానికి దాచిపెట్టిన బాటిల్ మూతను ఉపయోగించాడు. ప్రింగిల్, కెప్టెన్ మార్టిన్ క్రో, ఇద్దరూ ఆట నుండి రిటైర్ అయిన తర్వాత దీనిని అంగీకరించారు. [3] ఈ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు కూడా అదే పని చేస్తుందని న్యూజిలాండ్ జట్టు అనుమానించింది. అయితే వారివి ఆరోపణలే తప్ప వాటికి ఆధారాలు లేవు. [4]

మైఖేల్ అథర్టన్, 1994

మార్చు

1994 నాటి "జేబులో దుమ్ము" వ్యవహారంలో, లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ మైఖేల్ అథర్టన్పై బంతి ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. అథర్టన్ జేబులో చెయ్యిపెట్టి, ఆపై బంతిపై ఏదో పదార్థాన్ని రుద్దుతున్నట్లు టెలివిజన్ కెమెరాలకు చిక్కాడు. అథర్టన్ బాల్ టాంపరింగ్‌ను ఖండించాడు. తన జేబులో ఉన్న దుమ్ముతో తన చేతులను తుడుచుకున్నానని చెప్పాడు. మ్యాచ్ రిఫరీకి అబద్ధాలు చెప్పాడని కూడా అతనిపై ఆరోపించారు. అథర్టన్‌, మ్యాచ్ రిఫరీకి దుమ్ము గురించి చె3ప్పనందుకు గాను, అతనికి £2,000 జరిమానా విధించారు. [5]

వకార్ యూనిస్, 2000

మార్చు

2000 జూలైలో ఒక మ్యాచ్ తర్వాత బాల్ టాంపరింగ్ కారణంగా సస్పెన్షన్‌కు గురైన మొదటి ఆటగాడు, పాకిస్థాన్‌కు చెందిన వకార్ యూనిస్. దాంతోపాటు అతని మ్యాచ్ ఫీజులో 50% జరిమానా కూడా విధించారు. [6]

సచిన్ టెండూల్కర్, 2001

మార్చు

పోర్ట్ ఎలిజబెత్‌లోని సెయింట్ జార్జ్ పార్క్‌లో 2001లో భారతదేశం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో, బంతి ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో సచిన్ టెండూల్కర్‌ను మ్యాచ్ రిఫరీ మైక్ డెన్నెస్ ఒక గేమ్‌కు సస్పెండ్ చేశాడు.[7] టెలివిజన్ కెమెరాల్లో టెండూల్కర్ క్రికెట్ బంతి సీమ్‌ను స్కిఫ్ చేస్తున్నట్లు సూచించే చిత్రాలు కనిపించాయి.[8] అంపైర్ అనుమతి లేకుండానే అతను బంతి‌ను క్లీన్ చేశాడని తెలిపినప్పటికీ, ఐసిసి టెండూల్కర్‌పై బంతి ట్యాంపరింగ్ ఆరోపణలను తొలగించింది.[9]

రాహుల్ ద్రవిడ్, 2004

మార్చు

జింబాబ్వేతో గాబ్బా స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియన్ ట్రై-సిరీస్ మ్యాచ్‌లో భారతదేశానికి చెందిన రాహుల్ ద్రవిడ్, బంతి మెరిసే వైపు దగ్గుబిళ్ళను చప్పరించగా వచ్చే లాలాజలాన్ని రుద్దాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది, అయితే ద్రవిడ్ బాల్ టాంపరింగ్ చేసిన ఫుటేజీ బయటకు రావడాంతో, అతని మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు.[10]

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు, 2005

మార్చు

మార్కస్ ట్రెస్కోథిక్ తన ఆత్మకథ, కమింగ్ బ్యాక్ టు మీలో, మరింత స్వింగ్ చేయడానికి బంతిని ప్రకాశింపజేయడానికి మింట్‌లను ఉపయోగించినట్లు ఒప్పుకున్నాడు. "కొద్దిగా ఉమ్మి వేసి, బాగా పాలిష్ చేసి కొత్త బంతిపై మెరుపును వీలైనంత ఎక్కువసేపు ఉంచడం నా పని. ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేను చివరికి ఏ రకమైన ఉమ్మి వాడాలో నిశ్చయించుకున్నాను. కొన్ని తీపి పదార్థాల వలన ఉత్పత్తి అయ్యే లాలాజలాన్ని బంతికి పూసినప్పుడు, అది ఎక్కువసేపు మెరుస్తూ, స్వింగ్‌ అవుతూ ఉంటుందని కొంతకాలంగా కౌంటీ క్రికెట్‌లో అందరికీ తెలిసిన విషయమే." అని అతను అన్నాడు. ముర్రే మింట్‌లు అందుకు ఉత్తమంగా పనిచేస్తాయని అతను కనుగొన్నాడు. [11]

2005 యాషెస్ సిరీస్ ముగిసిన మూడు సంవత్సరాల తర్వాత అతను ఇది రాసాడు. ఆ సీరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆస్ట్రేలియాను ఓడించింది.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు, 2006

మార్చు

2006 లో పాకిస్తాన్, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌ను బాల్ టాంపరింగ్ ఆరోపణలు కమ్మేసాయి. మధ్యాహ్నం బంతి ట్యాంపరింగ్ కోసం జరిమానా విధించబడిన తర్వాత, సాయంత్రం సెషన్‌లో మైదానం లోకి వెళ్లేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. క్వార్టర్ సీమ్ పరిస్థితి గురించి చర్చిస్తున్న అంపైర్లను టెలివిజన్ కెమెరాలు పట్టుకున్నాయి. [12] టీ తర్వాత వారు ఆలస్యంగా వచ్చి, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని పాకిస్తాన్ అనుకున్నట్లు భావించారు; అయితే, వారు ఆడటానికి నిరాకరిస్తున్నప్పుడు, అంపైర్లు క్రికెట్ చట్టాల ప్రకారం ఆటను ఇంగ్లాండ్‌కు అప్పగించారు.[13]

చివరకు 19:50 UTCకి టెస్టు ముగిసినట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మైదానంలోకి దిగేందుకు పాకిస్థాన్ నిరాకరించడంతో చట్టం 21.3 ప్రకారం, అలా చేయని పక్షంలో ఆటను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించిన తర్వాత అంపైర్లు ఇంగ్లండ్‌కు మ్యాచ్‌ను అప్పగించారని ECB ప్రకటన పేర్కొంది. టెస్టు మ్యాచ్‌లో ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.[13]


పాకిస్తాన్ ఆటను కోల్పోయిన ఫలితంగా, ఇంజమామ్‌పై అభియోగాలు మోపబడ్డాయి. "బంతి పరిస్థితిని మార్చడం"కు సంబంధించిన ఆరోపణల నుండి అతను తొలగించబడినప్పటికీ, "ఆటకు చెడ్డపేరు తెచ్చినందుకు" దోషిగా తేలింది. [14]

2008 జూలైలో, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆ మ్యాచ్ ఫలితాన్ని డ్రాగా మార్చింది.[15] 2009 ఫిబ్రవరి 1 న, ICC ఆ నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకుని, మ్యాచ్ ఫలితాన్ని తిరిగి ఇంగ్లండ్‌ గెలుపుగా మార్చింది. [16]

జేమ్స్ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్, 2010

మార్చు

2010 జనవరిలో, ఇంగ్లండ్ బౌలర్లు స్టూవర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ లు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో బంతి‌ను తమ బూట్ల స్పైక్‌లతో ఆపి బంతి ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.[17] బ్రాడ్, ఆ రోజు కేప్ టౌన్‌లో ఉష్ణోగ్రత 40 °C (104 °F) ఉందనీ కేవలం సోమరితనంతో ఆ పని చేసానని చెప్పాడు.[17] [18] కెప్టెన్‌ నాజర్ హుస్సేన్ ఇలా అన్నాడు: "స్టూవర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ వారు ప్రవర్తించిన తీరు తప్పుగా ఉంది. అదే పని వేరే దేశానికి చెందిన ఆటగాడు చేస్తే మోసం చేశారని మేం అనేవాళ్లం, అందులో సందేహమే లేదు." [19] విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేసినప్పటికీ, దక్షిణాఫ్రికా అధికారికంగా ఎటువంటి ఆరోపణలు చెయ్యలేదు. [20]

షాహిద్ అఫ్రిది, 2010

మార్చు

2010 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడినందుకు పాకిస్థాన్ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధాన్ని అందుకున్నాడు. అతను బంతి సీమ్‌ను మార్చేసే వింత ప్రయత్నంలో క్రికెట్ బంతి‌ను కొరుకుతూ కెమెరాకు చిక్కాడు. చివరికి ఆ బంతిని మార్చారు.[21] [22] [23] [24] అతను హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ బంతిని వాసన చూస్తున్నానని చెప్పినప్పటికీ, [25] బంతి ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. [26] లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పిచ్‌ను ట్యాంపరింగ్ చేసినందుకు అఫ్రిది అంతకుముందు ఒకసారి నిషేధానికి గురయ్యాడు.

ఆస్ట్రేలియా vs శ్రీలంక, 2012

మార్చు

మొదటి టెస్టులో, శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ పీటర్ సిడిల్ బంతి సీమును పీకుతున్నాడని శ్రీలంక జట్టు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు తెలియజేసింది. పీటర్ సిడిల్ అప్పటికి 5/54 గణాంకాలు సాధించాడు. ఆ తర్వాత ఐసీసీ అతడిని నిర్దోషిగా తేల్చింది. [27]

ఫాఫ్ డు ప్లెసిస్, 2013

మార్చు

దుబాయ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో, దక్షిణాఫ్రికా ఫీల్డర్ ఫాఫ్ డు ప్లెసిస్ తన ప్యాంటు జిప్‌కి వ్యతిరేకంగా బంతిని స్కిఫ్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలు బంధించాయి. ఆ జట్టుకు జరిమానాగా అంపైర్లు ప్రత్యర్థి పాకిస్థాన్ స్కోరుకు 5 పరుగులు జోడించారు. [28] ఫీల్డర్ నేరాన్ని అంగీకరించిన తర్వాత మ్యాచ్ రిఫరీ, డు ప్లెసిస్‌పై 50% మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. అయితే జట్టు మేనేజర్ మొహమ్మద్ మూసాజీ ఆ పెనాల్టీ "కఠిన<గా ఉంది" అని పేర్కొన్నాడు. మరింత భారీ ఆంక్షలకు దారితీసే అవకాశం ఉన్నందున జట్టు, దానిని సవాలు చేయకూడదని జట్టు నిర్ణయించుకుంది. తప్పును అంగీకరించినప్పటికీ, జట్టు వైస్-కెప్టెన్ AB డివిలియర్స్ "మేము మోసగాళ్ళం కాదు" అని పేర్కొన్నాడు. జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ బాల్ టాంపరింగ్‌లో పాల్గొనడం వలన సిరీస్‌ను సమం చేసిన విజయం మసక బారిందని అనడాన్ని ఖండించాడు. దక్షిణాఫ్రికా ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. [29]

దక్షిణాఫ్రికా vs శ్రీలంక, 2014

మార్చు

తొమ్మిది నెలల్లో రెండోసారి, దక్షిణాఫ్రికా టెస్టు జట్టు బంతి ట్యాంపరింగ్ కుంభకోణంలో చిక్కుకుంది. ఈసారి మీడియం-పేస్ బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ 2014 లో శ్రీలంకతో జరిగిన గాలే టెస్టు మూడో రోజున బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు.[30] ఫిలాండర్ "తన వేళ్లు, బొటనవేలుతో బంతిని గోకడం" ద్వారా, 42.1 నిబంధనను ఉల్లంఘించినట్లు కనుగొన్నారు. అతని మ్యాచ్ ఫీజులో 75% జరిమానా విధించారు. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా 153 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అంతకు ముందు దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడు బంతి స్థితిని మార్చడానికి దక్షిణాఫ్రికా జట్టు చేసిన పనుల గురించి ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ 2014 ఫిబ్రవరిలో చేసిన ఊహాగానాల తర్వాత ఈ సంఘటన జరిగింది. స్కై స్పోర్ట్స్ రేడియోతో మాట్లాడుతూ వార్నర్, బంతిని మైదానంలోకి విసిరే దక్షిణాఫ్రికా ఫీల్డర్ల గురించి వ్యాఖ్యానించాడు. అలాగే దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ AB డివిలియర్స్" ప్రతి సారీ బంతిని చేతిలోకి తీసుకుని అతని చేతి తొడుగుతో ప్రతి బంతిని గరుకు వైపు తుడవడం గురించి కూడా మాట్లాడాడు." [31] ICC ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద వార్నర్ చేసిన వ్యాఖ్యలకు గాను అతని మ్యాచ్ ఫీజులో 15% జరిమానా విధించారు. [32]

దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, 2016

మార్చు

2016 నవంబరు 18 న హోబార్ట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన తర్వాత మరో దక్షిణాఫ్రికా ఆటగాడిపై బంతి ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఒక మింట్ లేదా లాలీ నుండి వచ్చిన లాలాజలాన్ని బంతిపై పూస్తున్నట్లు టీవీ ఫుటేజీలో కనిపించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేయనప్పటికీ, ఐసిసి ఈ అభియోగం మోపింది. [33] నవంబరు 22న డుప్లెసిస్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో, రెండో టెస్టులో అతని మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు. [34]

ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, 2018

మార్చు

2018 మార్చి 24 న ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై బంతి ట్యాంపరింగ్ అభియోగాలు మోపారు. న్యూలాండ్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో మూడో రోజు పసుపు రంగు వస్తువుతో బంతిని రుద్దడం, ఆ తర్వాత దాన్ని దాచడం వీడియోలు వెలువడ్డాయి. ఆ తర్వాత బాన్‌క్రాఫ్ట్, ఆ పసుపు రంగు వస్తువు అధెసివ్ టేప్ అనీ, దానికి దుమ్ము అతుక్కొని, గరుకుగా ఉండే ఉపరితలం ఏర్పడుతుందనీ చెప్పాడు. అయితే, నాలుగు రోజుల తర్వాత, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇది నిజానికి సాండ్‌పేపరని ధృవీకరించింది. [35] ఆ రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌ను మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వద్ద, ప్రెస్‌ వద్ద అంగీకరించాడు. భోజన విరామ సమయంలో పేర్లు తెలియని ఒక "నాయకత్వ బృందం" ట్యాంపరింగ్‌కు ప్లాన్ చేసిందని స్మిత్ చెప్పాడు. స్మిత్, వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం తమ జట్టు నాయకత్వం నుండి వైదొలిగారు. కానీ జట్టులో ఆడడం కొనసాగించారు. వికెట్ కీపర్ టిమ్ పైన్ మిగిలిన టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

ICC స్మిత్‌ను ఒక టెస్ట్ మ్యాచ్‌కి నిషేధించింది. అతని మ్యాచ్ ఫీజులో 100% జరిమానాగా విధించింది. బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75% జరిమానా విధించారు. [36]

ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ప్రజల నిరసనతో పాటు, [37] [38] ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ కమీషన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్‌బుల్, అనేక మంది ప్రసిద్ధ అంతర్జాతీయ క్రికెటర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా వాణిజ్య భాగస్వాములు [39] ఈ టాంపరింగు చేసినందుకు జట్టును విమర్శించారు.

స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్ లు ఆటకు చెడ్డపేరు తెచ్చారని అభియోగాలు మోపి, సస్పెండ్ చేసి ఇంటికి పంపారు. స్మిత్, వార్నర్‌లను ఆస్ట్రేలియాలోని అన్ని అంతర్జాతీయ క్రికెట్, దేశీయ క్రికెట్ నుండి పన్నెండు నెలల పాటు నిషేధించారు, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు.[40] ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమాన్, ప్రత్యక్షంగా అతనికి సంబంధం లేనప్పటికీ, కుంభకోణం తరువాత తన పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. [41]

శ్రీలంక vs వెస్టిండీస్, 2018

మార్చు

జూన్ 2018లో వెస్టిండీస్, శ్రీలంకల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఉదయం అంపైర్లు, అంతకు ముందు రోజున శ్రీలంక జట్టు బంతి ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు భావించి, వెస్టిండీస్‌కు ఐదు పెనాల్టీ పరుగులు ఇచ్చారు. మ్యాచ్ బంతిని మార్చి, వేరే బంతిని తీసుకున్నారు. శ్రీలంక జట్టు తొలుత మైదానంలోకి దిగేందుకు నిరాకరించినప్పటికీ, ఆ తరువాత మ్యాచ్‌ను పూర్తి చేసింది. శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్‌ బంతి పరిస్థితిని మార్చినట్లు మ్యాచ్ రిఫరీ అతనిపై అభియోగాలు మోపారు. [42] చండిమాల్ ఈ అభియోగంపై అప్పీల్ చేశాడు గానీ, అతనిపై ICC ఒక మ్యాచ్ నిషేధం విధించింది. [43]

ఆఫ్ఘనిస్తాన్ v వెస్టిండీస్, 2019

మార్చు

2019 నవంబరులో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో ODIలో, నికోలస్ పూరన్ బంతి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. [44] పూరన్ తన నేరాన్ని అంగీకరించాడు. అతన్ని నాలుగు T20I మ్యాచ్‌లకు నిషేధించారు. [45]

ఇవి కూడా చూడండి

మార్చు

ప్రస్తావనలు

మార్చు
  1. "BALL TAMPERERS CAUGHT OUT - Sporting Life - Cricket News - Live ball-by-ball scorecards, Pakistan v England". 4 February 2012. Archived from the original on 4 February 2012. Retrieved 26 March 2018.
  2. "Simon Hughes' Swing Guide" The Daily Telegraph 21 August 2006
  3. "When New Zealand ball tampered, got away with it and nearly won a test in Pakistan". Stuff (in ఇంగ్లీష్). 2018-03-25. Retrieved 2020-09-19.
  4. "As old as the hills". ESPNCricinfo. 16 September 2006. Retrieved 26 May 2019.
  5. "Atherton's Darkest Day" bbc.co.uk, 28 August 2000.
  6. "Waqar suspended for ball-tampering". BBC. 1 July 2007. Retrieved 22 April 2012.
  7. "Tendulkar handed suspended ban". Cricinfo. Retrieved 1 June 2008.
  8. "Tendulkar appears before match referee". Cricinfo. Retrieved 1 June 2008.
  9. "Tendulkar not guilty of ball-tampering, say ICC". the Guardian. 29 November 2001. Retrieved 26 March 2018.
  10. "India won because Rahul Dravid tempered the ball". Times of India. 25 March 2018. Retrieved 26 March 2018.
  11. "Mints made England '05 Ashes swing kings: Trescothick". The Age. The Age. 25 August 2008.
  12. "Ball tampering row mars Oval Test" Cricinfo, 20 August 2006.
  13. 13.0 13.1 "Lengthy talks fail to save Test". 20 August 2006. Retrieved 26 March 2018 – via news.bbc.co.uk.
  14. Inzamam cleared of ball tampering, from Cricinfo, retrieved 28 September 2006
  15. "FOX SPORTS - Live Sports Scores - NRL, AFL, Cricket Scores". FOX SPORTS. Retrieved 26 March 2018.
  16. ICC does U-turn on 2006 Oval Test result: Cricinfo, 1 February 2009
  17. 17.0 17.1 Cricinfo staff (9 January 2010). "Stuart Broad 'astonished' by tampering charges". Cricinfo. Archived from the original on 4 February 2010. Retrieved 1 February 2010.
  18. Paul Weaver (5 January 2010). "South Africa raise ball tampering concerns about England". London: guardian.co.uk. Archived from the original on 8 January 2010. Retrieved 1 February 2010.
  19. Nasser Hussain (8 January 2010). "Character reference". Sky Sports. Archived from the original on 14 January 2010. Retrieved 1 February 2010.
  20. McGlashan, Andrew (6 January 2010). "No official complaint over Broad footwork". Cricinfo. Archived from the original on 13 February 2010. Retrieved 1 February 2010.
  21. "Australia complete one-day series sweep over Pakistan". bbc.co.uk. 31 January 2010. Archived from the original on 3 February 2010. Retrieved 31 January 2010.
  22. "Controversy mars Australia win". metro.co.uk. 31 January 2010. Retrieved 31 January 2010.
  23. "Shahid Afridi in ball-tampering scandal during wild night at the WACA". theaustralian.com.au. Retrieved 31 January 2010.
  24. "Afridi banned for two T20s for ball-tampering". Cricinfo. 31 January 2010. Archived from the original on 3 February 2010. Retrieved 31 January 2010.
  25. "I tried to smell the ball: Afridi". Hindustan Times. Archived from the original on 25 January 2013. Retrieved 24 September 2010.
  26. "Afridi banned for wicket tampering". TheGuardian.com. 22 November 2005.
  27. "Australia v Sri Lanka, 1st Test, Hobart, 5th day : No evidence of tampering by Australia, says ICC match referee | Cricket News | Australia v Sri Lanka". ESPN Cricinfo. Retrieved 18 December 2012.
  28. "South Africa penalised for ball-tampering". ESPNcricinfo. ESPN. Retrieved 22 February 2016.
  29. "Du Plessis pleads guilty, fined for ball-tampering". ESPNcricinfo. ESPN. Retrieved 22 February 2016.
  30. "Philander fined for ball-tampering". ESPNcricinfo. ESPN. Retrieved 22 February 2016.
  31. "Warner queries South Africa swing tactics". ESPNcricinfo. ESPN. Retrieved 22 February 2016.
  32. "Warner fined for sharp-practice comments". ESPNcricinfo. ESPN. Retrieved 22 February 2016.
  33. "ICC charges du Plessis over alleged ball tampering". ESPNcricinfo. ESPN. Retrieved 18 November 2016.
  34. "Du Plessis found guilty, but free to play in Adelaide". ESPN Cricinfo. Retrieved 22 November 2016.
  35. "Sticky truth about sandpaper revelation". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 28 March 2018.
  36. "Cameron Bancroft: Australia player admits to ball-tampering, Steve Smith knew in advance". BBC Sport. 24 March 2018. Retrieved 27 March 2018.
  37. "Readers verdict: Public call for Australian cricket captain Steve Smith and leadership group to go over South Africa ball tampering Archived 26 మార్చి 2018 at the Wayback Machine". The Daily Telegraph, 25 March 2018
  38. "O'Halloran, Kate. An unashamed disgrace: ball tampering cheats Australian cricket fans". The Guardian, 25 March 2018
  39. "Australian cricket sponsors demand action after ball-tampering crisis with QANTAS latest to speak out. Nine's Wide World of Sports, 27 March 2018
  40. Ferris, Sam. "Tampering trio learn their fate". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 28 March 2018.
  41. "Australian ball-tampering: Darren Lehmann to quit as Australia coach". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 29 March 2018. Retrieved 29 March 2018.
  42. "How the ball-tampering episode unfolded in St Lucia". ESPNcricinfo. Retrieved 2018-06-19.
  43. "Dinesh Chandimal out of third Test after dismissal of appeal against ball-tampering sanctions". ESPN Cricinfo. Retrieved 22 June 2018.
  44. "Pooran suspended for four games for changing condition of the ball". International Cricket Council. Retrieved 13 November 2019.
  45. "Nicholas Pooran banned for four T20Is for ball tampering". ESPN Cricinfo. Retrieved 13 November 2019.