భూపతిరాజు తిరుపతిరాజు

భూపతిరాజు తిరుపతిరాజు గారు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, సంఘసేవకుడు, గాంధేయవాది. ఈయన కుముదవల్లి గ్రామంలో జన్మించారు. కుముదవల్లి గ్రామంలో వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యాధికుడు అవడం వలన ఆయన తన చిన్నతనం నుండి అనేక విషయాలాలో అవగాహన పెంచుకొంటూ ఉండేవారు.

భూపతిరాజు తిరుపతిరాజు గారు

బాల్యం, విద్య

మార్చు

తిరుపతిరాజు గారు 11 మే 1867 న కుముదవల్లి గ్రామంలో క్షత్రియ కుటుంబంలో జన్మించారు.

కుటుంబం

మార్చు

సేవాకార్యక్రమాలు

మార్చు
  • ఆనాడు రాచ కుటుంబాలలో ఘోషాపద్ధతి ఉందేది. అందువలన చాలామంది స్త్రీలు బయటకు వచ్చేటందుకు సుముఖంగా ఉండేవారు కాదు. 1912 ప్రాంతంలో తిరుపతి రాజు గారు, స్త్రీలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని పిల్లల ద్వారా ఇండ్లకు పంపుతూ వారిని చదివేట్లుగా చేయింఛడానికి మిగతా పెద్దలతో కల్సి కృషిచేసేవారు.
  • 1920 నుండి వీరేశలింగ గ్రంథాలయం ద్వారా హిందీ తరగతుల నిర్వహణ చేపట్టారు. హిందీ సాహిత్యం గురించి, హిందీ అవశ్యకత గురించి హిందీ తెలిసిన వారి ద్వారా చెప్పించేవారు. రాత్రి బడులలో నేర్పించేవారు.
  • సమాజంలో కొందరిని అంటరానివారుగా పరిగణించదం పాపమని తిరుపతిరాజు గారి ప్రగాడ నమ్మకం అందుకే అంటరానితనం తొలగించేందుకు కృషిచేస్తూ, క్రైస్తవ బాల భక్త సమాజ గ్రంథాలయ స్థాపనకు సేవలందించారు.
  • ఊరిలో పేదవారికి వైద్య తక్కువ ధనంతో సహాయం అందాలనృ ఉద్దేశంతో - 1911 నుండి ఊరిలో ఆయుర్వేద వైద్యం తెలిసిన ఘంటశాల నాగభూషణం గారి ఆద్వర్యంలో గ్రంథాలయం వేదికగా వైద్య సేవలను నడీపించేవారు, ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
  • కుముదవల్లిలో రైతుల కొరకు సహకార పరపతి సంఘం ఏర్పాటుకు కృషిచేసారు.దీని ద్వారా రైతులకు స్వల్ప వడ్డేలకు రుణాలు ఇవ్వడం, విత్తనాల సరఫరా వంటివి చేసేవారు.

గ్రంథాలయ సేవలు

మార్చు
  • వీరేశలింగ గ్రంథాలాయం ప్రారంభించిన రోజుల్లో చేత చీపురు ధరించి తుడవడం నుండి, బీరువాలు శుభ్రం చేయడం, కప్పు వర్షం కారితే వాటిని బాగు చేయడం వంటి అన్ని పనులు చేసేవారు.
  • తిరుపతిరాజు గారు గ్రంథాలయం ద్వారా పాఠశాలల నిర్వహణ జరిపించేవారు, వీటి ద్వారా ఊళ్ళో చదువుకోని పెద్దలు, పిల్లలకు చదువు యొక్క విలువలు బోధించి ఈ పాఠశాల ద్వారా విద్యావంతులుగా చేసే ప్రయత్నం చేసారు.
  • క్షత్రియ కుటుంబాలలో వివాహ, ఇతర శుభకార్యక్రమాల సమయంలో ఆయా కుటుంభాల పెద్దల నుండి కొంత కట్నం సమాజాభివృద్దికి ఖర్చుచేయడం తిరుపతిరాజుగారి బృందం మొదలెట్టింది. దీనిని ఒక నిధిగా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే వడ్డేని పేద విద్యార్థులకు, ఇతర ఉపకారాలకు ఖర్చు పెట్టడం చేస్తున్నారు
  • భీమవరము తాలూకాలో గ్రంథాలయ యాత్రలను జయప్రదంగా జరిపించి.... అనేక మంది క్రొత్త గ్రంథాలయాలను స్థాపించుటకు ప్రేరణమయ్యారు.

స్వతంత్ర సంగ్రామంలో పాత్ర

మార్చు
  • జాతీయ ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు వీరేశలింగ గ్రంథాలాయం ద్వారా పలు కార్యక్రమాలు చేసేవారు.
  • గ్రామంలో మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించేవారు. వీటిలో గ్రామ యువకులకు స్వతంత్ర సంగ్రామ విశేషాలు వివరిస్తూ, వారిని ఆయా కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించేవారు.
  • గ్రామానికి అప్పట్లో ఉన్న ప్రముఖ స్వతంత్ర సంగ్రామ యోధులను ఆహ్వానించి వారికి మద్దతు తెలుపుతూ ఉపన్యాసాలిప్పించేవారు

మూలాలు

మార్చు
  • వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయ శత జయంతి సంచికలో డా. వెలగా వెంకటప్పయ్య గారి వ్యాసం నుండి
  • నిడదవోలు వెంకటరావు గారి కర్మయోగి తిరుపతిరాజు వ్యాసం నుండి కొంత భాగం
  • An Article about A Short Profile of Sri Tirupathi Raju by Dr. P Soma Raju (Professor and Librarian, Andhra University)

ఇతర లింకులు

మార్చు