భూమిలోపలి ఋతువులు

భూమి లోపల, భూతలమునకు దిగువన 10 అడుగుల లోతున ఉండే ఋతువులు ఒకటే ఉండవు.దానికి కారణం నేల మంచి ఉష్ణవాహకం కాదు.లెనింగ్రాడ్లో విపరీతంగా మంచు పడుతున్నప్పుడు కూడా నీరు గడ్డకట్టి నీటి గొట్టాలు బద్దలు కావు.అవి 2 మీటర్ల లోతున ఉంటాయి.నేలకు పై భాగాన కలిగే శీతోష్ణపు మార్పులు దిగువన ఉండే వేరువేరు పొరలకు అందడంలో చాలా జాప్యం జరుగుతుంది.లెనిన్ గ్రాడ్ మండలంలోని స్లూత్స్క్ పట్టణంలో పరీక్షించినమీదట తెలిసినదేమిటంటే, మూడు మీటర్ల లోతున అత్యధిక ఉష్ణం 76 రోజులు ఆలస్యంగాను, అత్యధిక శీతలం 108 రోజులు ఆలస్యంగాను వస్తుంది.నేలపైన అత్యధిక ఉష్ణం జూలై 25న కలిగితే, నేలకు మూడు మీటర్ల అడుగున అత్యుష్ణదినం అక్టోబరు 9, అతి శీతలదినం నేలపై జనవరి 15 అయితే, అదే లోతున అతి శీతల దినం మే నెలదాక రాదు.ఇంకా లోతుకుపొతే ఈ రోజులు మరింత ఆలస్యంగా వస్తాయి. లోతుకు వెళ్ళిన కొలదీ ఉష్ణస్థితిలో కలిగే మార్పులు సన్నగిల్లుతూ, ఒక లోతుకు వెళ్ళేసరికి ఉష్ణస్థితిలో మార్పే ఉండదు.ఇక్కడ శతాబ్దాల తరబడి ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ విధంగా భూమిపైన మనకుండే ఋతువులు ఎన్నడు భూమిలోపల ఉండవు.మనకు శిశిర ఋతువైనప్పుడు మూడు మీటర్ల దిగువన శరత్ కాలం ఉంటుంది.ఇలా ఋతువులు వేరువేరుగా ఉంటాయి.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు