భైరవ గీత
సినిమా
భైరవ గీత తెలుగు, కన్నడ భాషలలో 2018లో విడుదలైన సినిమా. దీనిలో కన్నడ నటుడు ధనంజయ్, నటి ఇర్రా మోర్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి దర్శకుడు సిద్ధార్థ తాతోలు.
భైరవ గీత | |
---|---|
దర్శకత్వం | సిద్ధార్థ తాతోలు |
రచన | రామ్ గోపాల్ వర్మ రామ్ వంశీ కృష్ణ |
నిర్మాత | అభిషేక్ నామా భాస్కర్ రాశి |
తారాగణం | ధనంజయ్ ఇర్రా మోర్ బాల రాజ్‌వాడి |
ఛాయాగ్రహణం | జగదీశ్ చీకటి |
కూర్పు | అన్వర్ అలీ |
సంగీతం | రవి శంకర్ |
విడుదల తేదీs | 7 డిసెంబరు 2018 14 డిసెంబరు 2018 (తెలుగు) | (కన్నడ)
సినిమా నిడివి | 129 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు కన్నడ |
కథ
మార్చుకథానాయకుడు భైరవ (ధనంజయ్) కుటుంబం ఆ గ్రామం లోని ఫ్యాక్షన్ నాయకుడు సుబ్బారెడ్డి (బాల రాజ్‌వాడి) దగ్గర పనిచేస్తూంటారు. తండ్రి మరణం తర్వాత భైరవ కూడా సుబ్బారెడ్డి కింద చేరతాడు. చదువు ముగించుకొని గ్రామానికి వచ్చిన సుబ్బారెడ్డి కూతురు గీత (ఇర్రా మోర్) భైరవను ప్రేమిస్తుంది. భైరవకు విషయం తెలియదు. సుబ్బారెడ్డి మాత్రం కూతురికి ఊరిలో మరో పెద్ద సంబంధం చేయాలనుకుంటాడు. కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న సుబ్బారెడ్డి భైరవను చంపేయమని మనుషులను పంపిస్తాడు. ఊరొదిలి పారిపోయిన భైరవ, గీత సుబ్బారెడ్డిని ఎలా ఎదుర్కొన్నారు అనేది మిగతా కథ.[1]
తారాగణం
మార్చు- భైరవగా ధనంజయ్
- గీతగా ఇర్రా మోర్
- గీత తండ్రి సుబ్బారెడ్డిగా బాల రాజ్‌వాడి
- ధనంజయ
- కల్పలత
మూలాలు
మార్చు- ↑ "Bhairava Geetha Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 2018-12-14. Retrieved 2021-05-16.