వ్యభిచారం చేసేవారు ఉండే వీధులని ఆంధ్ర రాష్ట్రంలో భోగం వీధులు అని అంటారు. పూర్వం రాజులూ, భూస్వాములూ తమ భోగ విలాసాల కోసం వ్యభిచార వృత్తిని ప్రోత్సహించేవారు. వ్యభిచారం చేసే కులంగా భోగం అనే కులం ఏర్పడింది. భూస్వాములు పెళ్ళిళ్ళలో భోగం మేళాలు ఏర్పాటు చేసేవారు. అందులో భోగం కులానికి చెందిన పురుషులు సంగీతం వాయించగా భోగం స్త్రీలు నృత్యం చేసేవాళ్ళు. వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు లాంటి సంఘ సంస్కర్తలు వ్యభిచారాన్నీ, భోగం మేళాలనీ వ్యతిరేకించారు. భోగం వీధులని నిర్మూలించారు, భోగం మేళాలని రద్దు చెయ్యించారు.

వీధి వేశ్య - ప్రతీకాత్మక చిత్రం

విజయనగర సామ్రాజ్యంలో భోగం స్త్రీలకు రాజభవనాలలో నిరాఘాటంగా ప్రవేశముండేది. హజారరామాలయంలో వివిధ భూషణాలతో మురుస్తూ వున్న వేశ్యలను శిలా స్థంభాలపై తీర్చి దిద్దారు. దేవీ నవరాత్రులలో ప్రతి ఉదయం, భువనవిజయంలో, రథోత్సవాలు అన్నిటిలోనూ, దేవాలయాలలో ప్రతి శనివారమూ వారు నృత్యం చేసేవారు. నృత్యం నేర్పే గురువులకు రాయల వారు కొన్ని ఇనాములు ఇచ్చేవారు.[1]

మూలాలు

మార్చు
  1. "పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/93 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-04-29.