మంగమఠం ఆదిలాబాద్

మంగమఠం తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ రురల్ మండలంలోని సాత్నాల బస్ స్టాండ్ కు సమీపంలో ఉంది.ఈ మఠంలో శ్రీరమా సత్యనారాయణ స్వామి కొలువుదీరినారు. ఈ ఆలయాన్ని ఉత్తర భారత దేశం నుంచి వచ్చిన సన్యాసి నారాయణదాస్ ఈ మఠాన్ని స్థాపించారు.వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉన్న అత్యంత పురాతన ఆలయం[1][2].

శ్రీరమా సత్యనారాయణ స్వామి
శ్రీరమా సత్యనారాయణ స్వామి is located in Telangana
శ్రీరమా సత్యనారాయణ స్వామి
శ్రీరమా సత్యనారాయణ స్వామి
తెలంగాణ లోని ప్రదేశం
భౌగోళికాంశాలు:18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E / 18.87778; 77.95639
పేరు
ఇతర పేర్లు:మంగ మఠం
స్థానిక పేరు:Shri Ramaa Satyanarayana Swamy Temple
శ్రీరమా సత్యనారాయణ స్వామి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:ఆదిలాబాద్ సాథ్ నాల బస్ స్టాండ్ దగ్గర
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శ్రీ రమా సత్యనారాయణ స్వామి
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
వంద ఏళ్ళ చరిత్ర
నిర్మాత:ఉత్తర భారత దేశానికి చెందిన నారాయణదాస్ సాధువు

చరిత్ర

మార్చు
 
మంగమఠం ఆలయ ప్రవేశ ద్వారము.

600 సంవత్సరాల కంటే ముందే నిర్మితమైన పూరాతనమైన ఆలయాలలో ఇది నేటికి ఆధ్యాత్మికంగా విలసిల్లుతోంది. ఆదిలాబాద్ లో ఇది రెండో మఠం కాబట్టి దినిని చిన్న మఠం అని అంటారు. వంద సంవత్సరాల క్రితం ఉత్తర భారత దేశం నుంచి దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ కు ఒక సన్యాసి వచ్చి ఆదిలాబాద్ సాత్నాల పాత బస్ స్టాండ్ సమీపంలో మంగ మఠం అను పేరుతో మఠాన్ని స్థాపించారట. ఈ మఠానికి స్వామిజి మఠాధిపతిగా వ్యవహరిస్తూ అచటనే శ్రీరమా సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారని పెద్దలు చెబుతుంటారు.

ఆలయ శిల్పకళ

మార్చు

సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని పూర్తిగా నల్లనిరాతితో నిర్మించారు. ఆలయంలో మొత్తం పదహారు రాతి స్తంభాలు చెక్కిన నగిషీల తో మనకు దర్శనమిస్తాయి.గర్భాలయంలో మూల విగ్రహం ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆలయాన్ని పూర్తి వాస్తు నియమాలను పాటిస్తు ఆగమ శాస్త్రనుసారంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు.శ్రీరమా సత్యనారాయణ స్వామితో పాటు ఇతర దేవీదేవతల విగ్రహాలు ఉన్నాయి.ఆలయం ముందు దీప స్థంభం పురాతన కాలంనాటి ఆంజనేయ స్వామి విగ్రహాం ఉంది. ఇటీవల కాలంలో ఆలయాన్ని ఆధునికరించారు సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణ కోసం ఆలయంలో సువిశాలమైన మండపాన్ని కూడా నిర్మించారు. దాతల సహాయంతో ఈ దేవాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ప్రత్యేక పూజలు

మార్చు

ఆలయంలో భక్తుల తాకిడి పేరుగుతుండడంతో ఈ మఠానికి పూర్వవైభవం వచ్చింది.ఈ మఠం ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలో ఉంది.ఇక్కడ ప్రతి రోజు సత్యనారాయణ పూజలు జరగుతాయి[3]. ప్రతి పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి[4]. భక్తులకు అన్నదానం చేయడం ఈ మఠం యొక్క విశిష్టత[5] .

మూలాలు

మార్చు
  1. "వందల ఏళ్లనాటి పురాతన ఆలయం.. ప్రత్యేకత తెలిస్తే వెంటనే దర్శించుకుంటారు!". News18 తెలుగు. 2024-05-31. Retrieved 2024-07-05.
  2. "మంగ మఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు". EENADU. Retrieved 2024-07-05.
  3. "మంగ మఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు". EENADU. Retrieved 2024-07-05.
  4. "Adilabad: 23న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం". EENADU. Retrieved 2024-07-05.
  5. "మంగమఠం ఆలయ విశిష్టత తెలుసా.. ప్రత్యేకతలు ఇవే." News18 తెలుగు. 2024-06-02. Retrieved 2024-07-05.