మంగళ్ పాండే
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
మంగళ్ పాండే (19 జూలై, 1827 – 8 ఏప్రిల్, 1857) (హిందీ : मंगल पांडे), ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. మంగళ్ పాండే 1831 సంవత్సరం జనవరి 30 తేదీన ఉత్తర్ ప్రదేశ్ లోని నాగ్వాద దివాకర్ పాండే కి పుత్రుడిగా జన్మించాడు. చిన్నతనంలో శాస్త్రాధ్యయనం వద్దనుకొని శస్త్ర విద్యను అభ్యసించాడు. తాను 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే బ్రిటీషు వారి సైన్యంలో చేరాడు. తాను చూపించిన అద్వితీయ ప్రతిభతో అనదికాలంలోనే తాను సైనిక దళ నాయకుడా ఎన్నుకోబడ్డాడు.
మంగళ్ పాండే | |
---|---|
c.19 జూలై 1827–8 ఏప్రిల్ 1857 | |
![]() | |
జన్మస్థలం: | నగ్వా, బల్లియా, అవధ్ |
నిర్యాణ స్థలం: | బారక్ పూర్, కోల్కతా, భారతదేశం |
1857 సిపాయిల తిరుగుబాటుసవరించు
కలకత్తా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857, మధ్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. ఇందుకు కారణం బ్రిటిషు వారు సిపాయిలకు ఆవు కొవ్వు, పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు . సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే ! బాగ్ ను చంపినందుకుగాను ఆతనిని బ్రిటీషువారి న్యాయాలయానికి తీసుకువెళ్తాం అనే నాటకం చెప్పి బహిరంగంగా అత్యంత కిరాతకంగా చంపారు.
మంగళ్ పాండేపై సినిమాలుసవరించు
2005 లో మంగళ్ పాండే పై ఒక హిందీ సినిమా తీసారు. ఇందులో సతనాయకుడిగా ఆమీర్ ఖాన్ నటించాడు.
తపాళా బిళ్ళసవరించు
భారత ప్రభుత్వం మంగళ్ పాండే గౌరవార్థం, 1984 అక్టోబరు 5 న ఒక తపాళాబిళ్ళను విడుదల చేసింది. దీని చిత్రకారుడు ఢిల్లీకి చెందిన సి.ఆర్. ప్రకాశ్.
మూలాలుసవరించు
ఇవీ చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
- Mangal Pandey
- Freedom Fighters - Mangal Pandey
- Between fact and fiction - A newspaper article on Rudrangshu Mukherjee's book
- Indian Postal Service's commemorative stamp on Mangal Pandey
- Man who led the mutiny
- The man who started the Revolt
- In the Footsteps of Mangal Pandey
- The Great Mutiny: India's War for Freedom
- Review of The Roti Rebellion in The Hindu (June 8, 2005) Archived 2007-02-07 at the Wayback Machine