మంగళ గౌరీ దేవాలయం (బీహార్)

మంగళ గౌరీ దేవాలయం, భారతదేశం, బీహార్‌ రాష్ట్రం, గయ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ శక్తి పీఠం. [1]పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, దేవీ భాగవత పురాణం, మార్కండేయ పురాణం, ఇతర రచనలలో ఈ దేవాలయం ప్రస్తావించబడింది. ఈ ఆలయం పద్దెనిమిది మహా శక్తిపీఠాలలో ఒకటి. [2] ప్రస్తుతం ఉన్న ఆలయం 15వ శతాబ్దానికి చెందింది. గయలోని వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఉన్న ఈ మందిరం సతీ దేవతకు అంకితం చేయబడింది. మంగళగౌరిని పరోపకార దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ఉప-శక్తి పీఠాన్ని కలిగి ఉంది - ఇక్కడ పురాణాల ప్రకారం సతీదేవి శరీరంలోని ఒక భాగం పడిపోయిందని నమ్ముతారు. ఇక్కడ సతీదేవిని రొమ్ము రూపంలో పూజిస్తారు. ఇది పోషణకు చిహ్నం. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

మంగళ గౌరీ దేవాలయం
సర్వమంగళ దేవి ఆలయం
శక్తి పీఠం
బీహార్‌లోని గయలో గల మంగళ గౌరీ దేవాలయ దృశ్యం.
మంగళ గౌరీ దేవాలయం (బీహార్) is located in Bihar
మంగళ గౌరీ దేవాలయం (బీహార్)
Location within Bihar
మంగళ గౌరీ దేవాలయం (బీహార్) is located in India
మంగళ గౌరీ దేవాలయం (బీహార్)
మంగళ గౌరీ దేవాలయం (బీహార్) (India)
మంగళ గౌరీ దేవాలయం (బీహార్) is located in Asia
మంగళ గౌరీ దేవాలయం (బీహార్)
మంగళ గౌరీ దేవాలయం (బీహార్) (Asia)
భౌగోళికం
భౌగోళికాంశాలు24°46′30.5″N 85°00′08.3″E / 24.775139°N 85.002306°E / 24.775139; 85.002306
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాగయ జిల్లా
ఎత్తు134 m (440 ft)
సంస్కృతి
దైవంసతీ దేవి (పార్వతి దేవి)
ముఖ్యమైన పర్వాలునవరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుగుహ ఆలయ శైలి
దేవాలయాల సంఖ్య9
కట్టడాల సంఖ్య2
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1300 సామాన్య శకం
సృష్టికర్తమాధో గిరి జీ మహారాజ్ (బాబా దండి స్వామి)

తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మించబడింది. మెట్లు లేదా రహదారి గుండా కొండపైకి చేరుకోవచ్చు. ఆలయం ముందు ఒక చిన్న నాట్య మండపం ఉంది. ప్రాంగణంలో హోమం నిర్వహించడం కోసం హోమ గుండం ఉంది. శివునికి అంకితం చేయబడిన రెండు చిన్న దేవాలయాలు, మహిషాసుర మర్దిని, దుర్గ, దక్షిణ కాళి చిత్రాలు ఉన్నాయి. ఆలయ సముదాయంలో కాళిమాత, గణేశుడు, హనుమంతుడు, శివుని ఆలయాలు కూడా ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Mangalagauri Temple,Mangala Gauri Mandir in Gaya,Bihar". www.durga-puja.org. Retrieved 2023-05-15.
  2. "Mangala Gauri Temple Gaya - Maha Shakti Peetha Temples In India - Jyotirlinga Temples In India". jyotirlingatemples.com. Retrieved 2023-08-15.

వెలుపలి లంకెలు మార్చు