మంగోల్ సామ్రాజ్యం
మంగోల్ సామ్రాజ్యం (మంగోలియన్: Mongolyn Ezent Güren listen (help·info) 13, 14 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన, ప్రపంచంలోకెల్లా ఏకఖండ భూమి కలిగిన అతిపెద్ద సామ్రాజ్యం.[1] మధ్య ఆసియాలోని స్టెప్పీల్లో మొదలైన మంగోలు సామ్రాజ్యం క్రమంక్రమంగా మధ్య ఐరోపా నుంచి, జపాన్ సముద్రం వరకూ, ఉత్తరాన సైబీరియా, తూర్పు, దక్షిణాల్లో భారత ఉపఖండం, ఇండోచైనా, ఇరానియన్ పీఠభూమి వరకూ, పశ్చిమాన లెవెంట్, అరేబియాల వరకూ విస్తరించింది.
మంగోల్ సామ్రాజ్యం ప్రస్తుత మంగోలియా ప్రాంతంలోని సంచార తెగలను మంగోలల పాలకునిగా ప్రకటించుకున్న ఛెంఘిజ్ ఖాన్ తన నాయకత్వంలో ఏకీకృతం చేయగా అంకురించింది. ఆయన పరిపాలనలోనూ, ఆయన వారసుల పరిపాలనలోనూ అన్నివైపులకూ దండయాత్రలు సాగించడంతో సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించింది.[2][3][4][5][6][7] విస్తారంగా తూర్పు, పడమరలను కలుపుతూ ఏర్పడ్డ ఖండాంతర మహా సామ్రాజ్యం ఐరోపా, ఆసియాల మధ్య నిర్బంధ సాంస్కృత, వ్యాపార, భావ ప్రసారాన్ని ఏర్పరిచి పాక్స్ మంగోలికా అన్న స్థితిని కల్పించింది.[8][9]
సామ్రాజ్య వారసత్వం ఛెంఘిజ్ ఖాన్ వారసునిగా ఎన్నుకున్న కుమారుడు ఓగెడాయ్ నుంచి సాగాలా లేక ఆయన మిగతా కుమారులు తొలుయ్, చగటాయ్ లేక జోచిల్లో ఒకరి వారసుల నుంచి రావాలా అన్నదానిపై వచ్చిన వివాదం వల్ల ఛెంఘిజ్ మనవల్లో వచ్చిన వారసత్వ యుద్ధాల వల్ల సామ్రాజ్యం విభజితం కావడం ప్రారంభమైంది. చీలికలు ఓగెడాయ్, చెగటాయ్ ల కుమారుల మధ్య రక్తసిక్తమైన యుద్ధాల తర్వాత పెరిగిపోయాయి, వివాదాలు తొలుయ్ వారసుల నుంచి కూడా కలిగాయి. మోంగ్కే ఖాన్ మరణించాకా, పోటాపోటీ కురుల్ టాయ్ (పెద్దల సభ) లు వేర్వేరు వారసులను ప్రకటించాకా, ఆరిక్ బోకే, కుబులాయ్ ఖాన్ లు తొలుయిద్ పౌర యుద్ధంలో ఒకరితో ఒకరు పోరాడటం మాత్రమే కాక ఇతర ఛెంఘిజ్ కుమారుల వారుసుల సవాళ్ళను కూడా స్వీకరించి వారితోనూ పోరాడారు.[10][11] కుబులాయ్ విజయవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్నా, చెగటాయిడ్, ఓగెటాయిడ్ కుటుంబాల ప్రాంతంపైనా అధికారాన్ని స్థాపించాని ఆశించి ఫలించని ప్రయత్నం చేసినందువల్ల అంతర్యుద్ధం తప్పలేదు.
1260లోని ఐన్ జలుత్ యుద్ధం మంగోల్ దండయాత్రల చరిత్రలో మొట్టమొదటిసారి మంగోలుల ఆక్రమణను ఎదుర్కొని, వారిని ఓడించి ముఖాముఖి యుద్ధంలో యుద్ధరంగంలో వెనక్కి తిప్పికొట్టినట్టు చరిత్ర సృష్టించింది. మంగోలులు లెవెంట్ లో మరిన్ని యుద్ధాలు ప్రారంభించి, కొద్దికాలంపాటు దాన్ని ఆక్రమించి గాజా వరకూ దోపిడీలు చేసినా వాడీ అల్-ఖ్వాజందర్ యుద్ధంలో గెలిచి వివిధ భౌగోళిక రాజకీయ కారణాల వల్ల వెనుతిరగాల్సి వచ్చింది.
1294లో కుబిలై మరణ సమయానికి మంగోల్ సామ్రాజ్యం 4 వేర్వేరు ఖానేట్ లు లేక సామ్రాజ్యాలుగా విడిపోయింది, ఒక్కోదానికి వేర్వేరు ఆసక్తులు, లక్ష్యాలు ఉన్నాయి: వాయువ్యంలో గోల్డెన్ హార్డ్ ఖానేట్; మధ్య ప్రాంతంలో చెగటాయ్ ఖానేట్; నైఋతిలో ఇల్ ఖానేట్, తూర్పున ప్రస్తుత బీజింగ్ ను ఆధారం చేసుకుని యువాన్ రాజవంశం ఏర్పడ్డాయి.[12] 1304లో మూడు పశ్చిమ ఖానేట్ లు యువాన్ రాజవంశపు చక్రవర్తిత్వాన్ని ఆమోదించాయి, [9][13] కానీ దీన్ని 1368లో హాన్ చైనీస్ మింగ్ రాజవంశం త్రోసిరాజంది. ఛెంఘీజ్ వారసులైన యువాన్ పాలకులను మంగోలియా మాతృస్థానానికి ఉపసంహరింపజేసేలా చేసి ఉత్తర యువాన్ రాజవంశాన్ని పరిపాలించారు, గోల్డెన్ హార్డ్, చగటాయ్ ఖానేట్ యువాన్ రాజవంశం, ఇల్ ఖానేట్ రాజవంశాలు పతనమయ్యాకా మరికొన్ని శతాబ్దాలకు ఒక రూపంలోనో, మరో రూపంలోనో అంతమయ్యాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Morgan.
- ↑ Diamond.
- ↑ The Mongols and Russia, by George Vernadsky
- ↑ The Mongol World Empire, 1206–1370, by John Andrew Boyle
- ↑ The History of China, by David Curtis Wright. p. 84.
- ↑ The Early Civilization of China, by Yong Yap Cotterell, Arthur Cotterell. p. 223.
- ↑ Mongols and Mamluks: The Mamluk-Ilkhanid War, 1260–1281 by Reuven Amitai-Preiss
- ↑ Gregory G.Guzman "Were the barbarians a negative or positive factor in ancient and medieval history?"
- ↑ 9.0 9.1 Allsen.
- ↑ "The Islamic World to 1600: The Golden Horde".
- ↑ Michael Biran.
- ↑ The Cambridge History of China: Alien Regimes and Border States. p. 413.
- ↑ Jackson.