మంచాల రమేష్‌ కరీంనగర్ జిల్లాకు చెందిన నాటకరంగ నటుడు, దర్శకుడు.[1] దొంగలు, ఈ లెక్క ఇంతే, చీకటి పువ్వు[2] మొదలైన నాటికలకు వివిధ విభాగాల్లో బహుమతులు అందుకున్నాడు.

మంచాల రమేష్
జననంఆగష్టు 22, 1970
వంగర, భీమదేవరపల్లి మండలం, కరీంనగర్ జిల్లా
వృత్తివిద్యుత్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌
ప్రసిద్ధిరంగస్థల నటులు, దర్శకులు
తండ్రిరామచంద్రం
తల్లికనకలక్ష్మి

1970, ఆగస్టు 22న రామచంద్రం, కనకలక్ష్మి దంపతులకు కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో మంచాల రమేష్‌ జన్మించాడు.[1]

ఉద్యోగం

మార్చు

కరీంనగర్‌ జిల్లాలో విద్యుత్‌ శాఖ ఇ.ఆర్‌.ఓ రూరల్‌ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

10 సంవత్సరాల వయసులో 1980 సంవత్సరంలో 'బడిపంతులు' నాటకం ద్వారా బాలనటునిగా ప్రప్రథమంగా రంగప్రవేశం చేశాడు.[1]

ప్రదర్శించిన నాటకాలు, నాటికలు

మార్చు

బడిపంతులు, సంసారంలో సరాగాలు, ప్రేమగోల, చదవా, బంగారు గుడ్లు, నాకు ఇల్లొచ్చింది, సతిన్మ, ప్రేమ ఈక్వల్ట్‌, చెల్లనిపైసలు (60 ప్రదర్శనలు),[3] దొంగలు (96 ప్రదర్శనలు), ఈలెక్క ఇంతే (35 ప్రదర్శనలు)[4][5] మనిషి, ఆడది, ఈతరం మారాలి, పామరులు, నిరసన, ఆకలివేట, కాలచక్రం, విధాత, నేనుపట్నం పోతనే, ప్రేమపిచ్చోళ్ళు, ఇతిహాసం, క్షతగాత్రుడు, ఆశాపాశం, నగరం ప్రశాంతంగా ఉంది, లాలలీల, క్లిక్‌, పెన్‌కౌంటర్‌, గర్భగుడి, మార్గదర్శి, సన్మతి, ఎవరో ఒకరు, గారడి, ఈ లెక్క ఇంతే,[6] మా ప్రేమకు న్యాయం కావాలి, చీకటిపువ్వు,[7] స్వప్నం రాల్చిన అమృతం మొదలైనవి.

గురువులు

మార్చు

శ్రీరాముల సత్యనారాయణ, బండారి దేవరాజ్‌, గద్దె ఉదయ్‌కుమార్‌, అల్లకొండ కిషన్‌రెడ్డి, తిప్పర్తి ప్రభాకర్‌, కె.సత్యనారాయణ, వడ్నాల కిషన్‌, రంగు వెంకటనారాయణ, రచయిత శివరామ్‌ లు.

బహుమతులు

మార్చు
  • నంది ఉత్తమ నటుడు - సతిన్మ (2002 నందినాటకోత్సవం)
  • ఉత్తమ నటుడు - ఈ లెక్క ఇంతే (2015)[5]
  • ఉత్తమ ప్రతినాయకుడు - చీకటిపువ్వు (వీణా అవార్డ్స్‌ 2021, పేరిట కళల కాణాచి, వేదగంగోత్రి ఫౌండేషన్‌-తెనాలి)[8]
  • ఉత్తమ దర్శకుడు - చీకటిపువ్వు - కొండవీటి కళాపరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఏప్రిల్ 21-23, 2023), లింగారావుపాలెం)[9]

సన్మానాలు - సత్కారాలు

మార్చు
  • గ్రామీణ కళాజ్యోతి అవార్డు (ఫోక్‌ ఆర్ట్‌ అకాడమీ, కరీంనగర్‌, 1996)
  • తుమ్మల రంగస్థల పురస్కారం వారిచే సత్కారం (1999)
  • ఉత్తమ రంగస్థల నటనా పురస్కారం (చైతన్యకళాభారతి, కరీంనగర్‌)
  • జిల్లా కళాకారుల సమాఖ్య వారిచే సత్కారం
  • మానవత కల్చరల్‌ అకాడమి వారిచే సత్కారం
  • రసరమ్య కళారంజని, నల్గొండవారిచే సన్మానం (చెల్లనిపైసలు నాటికకు దర్శకత్వం వహించి, నటించి నందినాటకోత్సవాలలో తృతీయ బహుమతి పొందిన సందర్భంలో)
  • వల్లం నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (విఎన్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, 2017)[10]
  • వైకే నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (2023)
  • పాలకుర్తిలో సోమనాథ రంగస్థల పురస్కారం (2023)

బిరుదులు

మార్చు
  • కళాజగతి, నాటకరంగ పత్రిక వారిచే విశాఖపట్నంలో కళాశ్రేష్ఠ బిరుదుసత్కారం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "రంగస్థలం రమేశ్‌". Sakshi. 2024-01-29. Archived from the original on 2024-02-06. Retrieved 2024-02-06.
  2. telugu, NT News (2023-04-07). "సమాజాన్ని ప్రశ్నించేది నాటకం". www.ntnews.com. Archived from the original on 2023-04-07. Retrieved 2023-04-15.
  3. ఈనాడు, కరీంనగర్ (16 April 2019). "సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యానికి కృషి". Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2019.
  4. నమస్తే తెలంగాణ, ఖమ్మం. "ప్రారంభమైన తెలుగు నాటకోత్సవాలు". Retrieved 17 January 2017.[permanent dead link]
  5. 5.0 5.1 సాక్షి. "ఉత్తమ నాటిక 'ఎవరిని ఎవరు క్షమించాలి?'". Retrieved 17 January 2017.
  6. ప్రజాశక్తి, కర్నూలు కల్చరల్‌ (17 May 2016). "యానాది జాతుల యదార్థగాథ 'చివరి గుడిసె'". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 7 August 2019.
  7. "ఘనంగా ముగిసిన 13 వ జాతీయ స్థాయి నాటిక పోటీలు." Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-18. Retrieved 2023-05-19.
  8. ఆంధ్రజ్యోతి, గుంటూరు (15 October 2021). "వీధి నాటకాలు పునరుజ్జీవం పొందాలి". andhrajyothy. Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  9. "ఉత్తమ ప్రదర్శనగా 'నాన్న నేనొచ్చేస్తా'". EENADU. Archived from the original on 2024-01-20. Retrieved 2024-01-20.
  10. నవతెలంగాణ. "సినీరంగానికి రంగస్థలం పునాది". Archived from the original on 19 ఏప్రిల్ 2023. Retrieved 17 January 2017.

ఇతర లంకెలు

మార్చు