మంచాళ జగన్నాధరావు ప్రముఖ వైణిక విద్వాంసులు. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగీతం రెండూ వీణపై వాయించేవారు.

మంచాల జగన్నాధ రావు
Manchala jagannadha rao.jpg
వ్యక్తిగత సమాచారం
మూలంఆంధ్ర ప్రదేశ్
రంగంవీణ
వృత్తిఆకాశావాణి హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టు

జీవిత విశేషాలుసవరించు

వైణికులుగా జగన్నాథ రావు సుప్రసిద్ధులు. ఆయన కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో సుప్రసిద్ధులు. ఆయనకు 10శాతం దృష్టి ఉన్నప్పుదు ఒక సినిమాలో "మా మంచి పాపాయి" అనే పాటను స్వరపరచి పాడారు. ఆ తరువాత ఆయన పూర్తిగా అంధులైనారు. రేడియో కార్యక్రమాలలో ఆయన వీణ ద్వారా సంగీత సహకారాన్ని అందించేవారు.

ఈయన మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పనిచేసారు. ఆకాశవాణి పాట్నాలో కొంతకాలం పనిచేశారు. 1954లో హైదరాబాదుకు బదిలీ అయ్యారు. 1981 లో పదవీవిరమణ చేశారు. గీత శంకరం (సంస్కృతం), రాధావంశీధరవిలాస్ (హిందీ) సంగీత రూపకాలకు స్వరరచన చేశారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు రచనలను నొటేషంతో ప్రచురించారు. (తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంతో). కొన్ని వందల అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. ఎంకి పాటలకు నండూరి సుబ్బారావుతో కలిసి బాణీ తయారుచేసి రేడియోలో పాడించారు. స్వీయరచనలైన లలితగీతాలను, పలు భావకవుల గీతాలను స్వరపరిచి నొటేషన్ తో 'ఆధునిక సంగీతం' పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించారు.

ఉద్యోగ జీవితంసవరించు

వీరు, సోదరుడు వాడ్రేవు పురుషోత్తం ఆకాశవాణి హైదరాబాదులో కలసి పనిచేశారు. జగన్నాథ రావు హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టుగా చేరి ఆ తర్వాత సంగీత విభాగం ప్రొడ్యుసర్ గా రెండున్నర దశాబ్దాలు పనిచేశారు. 1984 లో పదవీ విరమణ చేశారు. జగన్నాధ రావు హైదరాబాదులో పరమపదించారు. నేత్ర వ్యాధితో వారు బాధ పడినా చక్కటి వీణావాదన చేసి శ్రోతల్ని మంత్ర ముద్గుల్ని చేసేవారు. అలహాబాదు, పాట్నా కేంద్రాలలో హిందుస్థానీ ప్రొడ్యూసర్ గా చేశారు. వయోలిన్ విద్వాంసులు మారెళ్ళ కేశవరావు హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వారిలో ఒకరు. ఆయన సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 6 సంపుటాల త్యాగరాజ కీర్తనలు రూపొందించారు. ఆయన తి.తి.దే పబ్లికేషన్స్ లో చేరారు. ఆయన క్షేత్రయ్య పదాలు, రామదాసు కీర్తనలపై కృషిచేసారు.[1]

రచనలుసవరించు

లలిత గీతాలుసవరించు

  1. బంగారు పాపాయి బహుమతులు పొందాలి

గ్రంథాలుసవరించు

  1. గీతగోవిందం - గీతశంకరం
  2. క్షేత్రయ్య పదములు - స్వరసహితము
  3. ఆంధ్రుల సంగీతకళ

మూలాలుసవరించు

  1. "Remembering a Carnatic maestro". GUDIPOODI SRIHARI. ద హిందూ. 2006-02-10. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులుసవరించు