మంజునాథ ఆలయం

మంజునాథ ఆలయం భారతదేశంలోని కర్ణాటకలోని ధర్మస్థల పట్టణంలో ఉంది.

మంజునాథ ఆలయం భారతదేశంలోని కర్ణాటకలోని ధర్మస్థల పట్టణంలో ఉంది. 16వ శతాబ్దంలో అప్పటి ఆలయ నిర్వాహకుడు దేవరాజ హెగ్గాడే అభ్యర్థన మేరకు ద్వైత సన్యాసి వాదిరాజ తీర్థచే ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు[1]. ఇది హిందూమతంలోని శైవ శాఖకుచెందినది కానీ పూజారులు మాత్రం మధ్వ బ్రాహ్మణులు [2]. ఈ ఆలయ ప్రధాన  దేవత శివుడు. ఈ ఆలయం అన్నదానాలకి చాల ప్రసిద్ధి.

మంజునాథ దేవాలయం, ధర్మస్థల
ధర్మస్థల మంజునాథ దేవాలయం
ధర్మస్థల మంజునాథ దేవాలయం
మంజునాథ ఆలయం is located in Karnataka
మంజునాథ ఆలయం
ధర్మస్థల
భౌగోళికం
భౌగోళికాంశాలు12°57′36″N 75°22′42″E / 12.96012°N 75.37836°E / 12.96012; 75.37836
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాదక్షిణ కన్నడ
స్థలంధర్మస్థల
సంస్కృతి
దైవంమంజునాథ
ముఖ్యమైన పర్వాలుమహా శివరాత్రి, మహామస్తకాభిషేక, లక్ష దీప ఉత్సవం
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1200 C.E.
సృష్టికర్తబిర్మన్న పెర్గాడే

స్థల పురాణం

మార్చు

800 సంవత్సరాల క్రితం, ధర్మస్థలను మల్లర్మడిలో కుడుమ అని పిలిచేవారు, అప్పటి నుండి ఇది బెల్తంగడిలో ఒక గ్రామంగా మారింది. ఇక్కడ జైన బంట్ అనే పూజారులు అయిన నెల్లియాడి బీడు అధిపతి బిర్మన్న పెర్గాడే, అతని భార్య అమ్ము బల్లల్తి ఉండేవారు. పురాణకథనం అనుసరించి ధర్మదేవతలు ధర్మరక్షణ, ధరస్థాపన, ధర్మప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఈ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించి గౌరవించారు. వారి పూజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆరోజు రాత్రి వారి కలలో కనిపించి వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి వారి జీవితాలను ఆ దైవాలసేవకు సమర్పించాలని ఆదేశించారు. పర్గాడే కుటుంబం వేరు ప్రశ్నవేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకు ఇచ్చి వారు వారి కొరకు వేరు గృహాన్ని నిర్మించుకున్నారు. ధర్మదేవతలు తిరిగి పర్గాడే కుటుంబానికి కలలో కనిపించి కాలరాహు, కలర్కై, కుమారస్వామి, కన్యాకుమారి అనే నలుగురు దైవాలకు విడివిడిగా ఆలయాలు నిర్మించమని ఆదేశించారు. పర్గాడే ఆలయాల నిర్మాణానికి బ్రాహ్మణులను పిలిపించి అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు. ఆలయం పక్కన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని పూజారులు పర్గాడే కుటుంబాన్ని కోరారు. దైవవాక్కు పలికే అణ్ణప్ప స్వామిని పంపి శివలింగ ప్రతిష్ఠ జరిపించారు. అణ్ణప్ప స్వామి మంగళూరు సమీపంలోని కద్రి నుండి లింగాన్ని తెచ్చి మంజునాథేశ్వరుని ప్రతిష్ఠించాడు[3].

ఆలయ ధర్మకర్తలు

మార్చు

పెర్గాడే కుటుంబం జైన బంట్ కుటుంబం. బిర్మన్న పెర్గాడే , అతని భార్య అమ్ము బల్లాల్తి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు. పెద్ద పురుష సభ్యుడు ధర్మ అధికారి (ముఖ్య నిర్వాహకుడు) పదవిని స్వీకరిస్తారు, హెగ్గడే అనే బిరుదును ఉపయోగిస్తారు. హెగ్గడే ఆలయ పట్టణానికి సామంత రాజు, ఇతను సివిల్ లేదా క్రిమినల్ వివాదాలను పరిష్కరిస్తాడు. ఇది న్యాయపరమైన విధి ఇది నేటికీ కొనసాగుతోంది. హెగ్గడే ప్రతిరోజు హోయులు అని పిలువబడే వందలాది సివిల్ ఫిర్యాదులపై తీర్పునిస్తూ ఉంటారు. పెర్గాడే కుటుంబానికి చెందిన దాదాపు ఇరవై తరాల వారు ధర్మ అధికారి పదవిని చేపట్టారు. ప్రస్తుత ధర్మ అధికారి వీరేంద్ర హెగ్గడే[4].

ధర్మ అధికారి సంఖ్య పేరు నుండి కు
1 వర్మన్న హెగ్గడే (బెర్మన్న పెర్గాడే)
2 పద్మయ్య హెగ్గడే
3 చందయ్య హెగ్గడే I
4 దేవరాజ హెగ్గడే
5 మంజయ్య హెగ్గడే I
6 జినప్ప హెగ్గడే
7 చందయ్య హెగ్గడే II
8 దేవప్పరాజ హెగ్గడే
9 అనంతయ్య హెగ్గడే
10 వృషభయ్య హెగ్గడే
11 గుమ్మన్న హెగ్గడే
12 వరదయ్య హెగ్గడే
13 చందయ్య హెగ్గడే III
14 కుమారయ్య హెగ్గడే
15 చందయ్య హెగ్గడే IV
16 మంజయ్య హెగ్గడే II
17 ధర్మపాల హెగ్గడే
18   చందయ్య హెగ్గడే V 1918 C.E.
19 మంజయ్య హెగ్గడే III 1918 C.E. 1955 C.E.
20 రత్నవర్మ హెగ్గడే 1955 C.E. 1968 C.E.
21   వీరేంద్ర హెగ్గడే 1968 C.E. Present

మూలాలు

మార్చు
  1. David, Stephen. "Heavenly Post". India Today. Archived from the original on 2 January 2003. Retrieved 17 June 2002.
  2. Saligrama Krishna Ramachandra Rao (1995). Art and Architecture of Indian Temples, Volume 3. Kalpatharu Research Academy. p. 69.
  3. M. V. Kamath (1988). The Other Face of India. Konark Publishers. p. 40. ISBN 9788122000887. In the Siva temple, the priests are Madhva brahmins—Vaishnavites—but Hegde, the dharmadhikari of all temples, is a Jain.
  4. B. N. Hebbar (2005). The Śrī-Kṛṣṇa Temple at Uḍupi: the historical and spiritual center of the Madhvite sect of Hinduism. Bharatiya Granth Niketan. pp. 83–84. ISBN 978-81-89211-04-2.