మంటలూ - మానవుడూ (పుస్తకం)

వచన కవితా సంపుటి, సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తెలుగు రచన


మంటలు - మానవుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి రచించిన వచన కవితా సంపుటి.[1] 1973లో ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.[2]

మంటలు - మానవుడు
కృతికర్త: సింగిరెడ్డి నారాయణరెడ్డి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): వచన కవిత్వం
ప్రచురణ: ప్రథమ ముద్రణ - శ్రీ ప్రింటర్స్ (1970, చిక్కడపల్లి), యువభారతి (1975), మనస్విని ప్రచురణలు (1982)
విడుదల:
పేజీలు: 93 పేజీలు

సాహిత్యంసవరించు

అంత్యప్రాసల కవిత్వం వస్తున్న తరుణంలో మాత్ర చందస్సులో ఈ కవిత్వ పుస్తకాన్ని రాశాడు. అంతేకాకుండా వచన కవులకు మార్గదర్శిగా నాటి కవులతో పోటీ పడుతూ మంటలు మానవుడు రచించాడు.

పుస్తకంలోసవరించు

1970 ప్రాంతంలో భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలకు స్పందించిన సినారె ఈ వచన కావ్యాన్ని రాశాడు. సమాజాన్ని భిన్న కోణాలలో దర్శించి ఆయా సంఘటనలను ప్రతీకాత్మకంగా చిత్రించాడు.

విశేషాలుసవరించు

ఈ కావ్యాన్ని ఇళంభారతి అనల్ కాట్రు అనే పేరుతో తమిళంలోకి, కొత్త ముఖం తొడుక్కో వంటి ఇరవైఏడు కవితల్ని శ్రీనివాస హొస ముఖ తొట్టుకో పేరుతో కన్నడంలోకి అనువదించారు. 1990 జూలైలో అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము ఆంధ్రభారతి అధ్యాపకులు ఎచ్.ఎస్. బ్రహ్మనంద పర్యవేక్షణలో కె. ఆదినారాయణ మంటలూ - మానవుడూ - రచనా వైశిష్ట్యం అనే అంశంపై లఘు సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు.[3]

మూలాలుసవరించు

  1. ప్రజాశక్తి (21 July 2017). "'మంటలు మానవుడు' వచన కవితాఝరి". Retrieved 15 June 2018.
  2. ఆంధ్రభూమి, అక్షర (26 January 2018). "సినారె వైభవం.. ఓ కావ్యం". Archived from the original on 28 జూన్ 2018. Retrieved 15 June 2018.
  3. Shodhganga, Sri Krishnadevaraya University Department of Telugu. "మంటలూ - మానవుడూ - రచనా వైశిష్ట్యం (లఘు సిద్ధాంత గ్రంథం)". www.shodhganga.inflibnet.ac.in. Retrieved 16 June 2018.