చిక్కడపల్లి
చిక్కడపల్లి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదులోని వ్యాపార కేంద్రాలలో ఒకటైన ఈ చిక్కడపల్లికి ముషీరాబాద్, అశోక్‌నగర్, నారాయణగూడ, బాగ్ లింగంపల్లి మొదలైనవి పరిసర ప్రాంతాలుగా ఉన్నాయి.
చిక్కడపల్లి | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°24′12″N 78°29′55″E / 17.403247°N 78.498641°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500020 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
చరిత్ర
మార్చులోతట్టు ప్రాంతంలో ఉన్న చిక్కడపల్లికి వివిధ ప్రాంతాలనుండి నీరు చేరడంవల్ల ఈ ప్రాంతమంతా బురదగా మారేది. అలా చిక్కడ్ (బురద), పల్లి (స్థలం) అన్న పదాలతో చిక్కడపల్లి వచ్చిందని కొందరు స్థానికుల అభిప్రాయం కాగా, చీకటిపల్లి అనివున్న పేరు చిక్కడపల్లిగా మారిందని మరికొందరి స్థానికుల అభిప్రాయం.
దేవాలయాలు
మార్చుఇక్కడవున్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీఆంజనేయస్వామి ఆలయాలు ప్రాముఖ్యతను కలిగివున్నాయి. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.[1]
ఇతర వివరాలు
మార్చుభక్తి గాయకుడు ఎం.ఎస్.రామారావు ఇక్కడ నివసించేవారు, ఆయన పేరుమీద ఒక వీధికి సుందర కాండ ఎం.ఎస్.రామారావు లైను అని నామకరణం చేశారు. ఈ ప్రాంతంలోవున్న త్యాగరాయ గానసభలో నిత్యం సాంస్కృతిక, సాహిత్య, కళలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటాయి.
ఇక్కడవున్న నగర కేంద్ర గ్రంథాలయానికి ప్రతిరోజు ఎంతోమంది పాఠకులు, విద్యార్థులు వచ్చి చదువుకుంటారు. 2017 నవంబరు 21న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు బంగారు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ ఈ గ్రంథాలయాన్ని సందర్శించి, గ్రంథాలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయిస్తామని, ఆ నిధులతో ఆధునిక డిజిటల్ లైబ్రరీని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పుతామన్నారు.[2][3]
చిత్రమాలిక
మార్చు-
త్యాగరాయ గానసభ
-
సిటీ సెంట్రల్ లైబ్రరీ
-
శ్రీ ఆంజనేయస్వామి గుడి
-
శ్రీ వేంకటేశ్వరస్వామి గుడి
-
దేవి (70 ఎంఎం), సుదర్శన్ (70 ఎంఎం) థియేటర్లు
మూలాలు
మార్చు- ↑ 10టీవి (29 December 2017). "చిక్కడపల్లి వెంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి". Retrieved 29 July 2018.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] - ↑ ఆంధ్రప్రభ (21 November 2017). "హైదరాబాద్:చిక్కడపల్లి గ్రంథాలయానికి రూ.5కోట్లు కేటాయిస్తాం:మంత్రి కేటీఆర్". Retrieved 29 July 2018.[permanent dead link]
- ↑ నవతెలంగాణ (21 November 2017). "చిక్కడపల్లి లైబ్రరీకి 5కోట్లు:కేటీఆర్". Retrieved 29 July 2018.