ప్రధాన మెనూను తెరువు
మండల పరిషత్ కార్యాలయం, వింజమూరు, నెల్లూరు జిల్లా

గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థ ( పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్ధాయి వ్యవస్థని ఆంధ్ర ప్రదేశ్ లో మండల పరిషత్ అంటారు. ప్రతి మండలానికి ఒక మండల పరిషత్తు వుంటుంది. దీని పరిధిలో 20 నుండి 30 గ్రామ పంచాయతీలు వుంటాయి. వీటి అభివృద్ధికి పనిచేస్తుంది.

మండల పరిషత్తు నిర్మాణంసవరించు

ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకోటానికి మండలాన్ని కొన్ని ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజిస్తారు. వీరిని ఎంపిటిసి (Mandal Parishad Territorial Constituency : MPTC) సభ్యులంటారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. వీరితో పాటు, మండలానికి ప్రాతినిధ్యం వహించే విధానసభ, లోక్‌సభ సభ్యులు, మండలంలో నివాసముంటున్న రాజ్యసభ సభ్యులు, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన సభచే ఆహ్వానించబడిన (కో ఆప్టెడ్) వారు సభ్యులుగా వుంటారు. సమావేశాలకుశాశ్వత ఆహ్వానితులు: జిల్లా కలెక్టర్, మండల పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, మండల పరిధిలో మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు. వీరికి సమావేశాలలో ఓటు హక్కు లేదు.

అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడుసవరించు

ఎంపిటిసి సభ్యుల మొదటి సమావేశంలో, వారిలో ఇద్దరిని అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది.

మండల పరిషత్ అభివృద్ధి అధికారిసవరించు

మండలంలో ముఖ్య కార్యనిర్వాహక అధికారిని మండల అభివృద్ధి అధికారి అంటారు. మండల పరిషత్తు నిర్ణయాలను అమలు పరచటం, ఈ అధికారి విధి. మండలంలోని ప్రభుత్వ సిబ్బందికి నాయకత్వం వహిస్తారు. ఆయితే రెవిన్యూ విభాగానికి, మండల రెవిన్యూ అధికారి అధిపతిగా వుంటారు.

మండల పరిషత్ విధులుసవరించు

 1. గ్రామ పంచాయతీలు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం
 2. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు
 3. పశుసంపదని పెంచడానికి చర్యలు
 4. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి కేంద్రాల ఏర్పాటు
 5. ప్రాథమిక పాఠశాలలు,
   
  దేవరపల్లి, పర్చూరు మండలం, ప్రాథమిక పాఠశాల
  మాధ్యమిక పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ
 6. గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణం, నిర్వహణ
 7. గ్రామ పంచాయతీల బడ్జెటుల ఆమోదం
 8. గణాంక వివరాల సేకరణ

మండల పరిషత్ ఆర్థిక వనరులుసవరించు

1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టము లోని సెక్షన్ 172 మండల పరిషత్తు ఆదాయ-వ్యయాలను వివరిస్తుంది.[1]

 1. భూమి శిస్తు, రాష్ట్ర పన్నులలో భాగం
 2. గ్రామ పంచాయతీలు, ప్రజలు ఇచ్చే విరాళాలు
 3. ప్రభుత్వ గ్రాంటులు
 4. సంస్థలకు పథకాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు
 5. ప్రభుత్వం ఇచ్చే తలసరి పన్ను.

వనరులుసవరించు