మండువా లోగిలి
పరిచయం
మార్చుమండువా లోగిలి (Manduva Logili/ Courtyard house) అనేది ఒక రకమైన పురాతనమైన సంప్రదాయక పెంకుటిల్లు. చుట్టూ నలు వైపులా గదులు ఉంటాయి. ఇంటిలోకి గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి హాలులో ఇంటి మధ్య భాగంలో పైకప్పు లేకుండా ఉండి, వాన నీరు ఇంటిలో పడి అది పోవడానికి మధ్యలో ఒక గుంట, ఆ గుంటలోంచి వాన నీరు బయటకు పోవడానికి డ్రైనేజీ పైపు ఉంటుంది. గోడలు మట్టితో కట్టబడి ఉంటాయి. మండువా లోగిలి తలుపులు, గడప నల్లవిరుగుడు చావ (ఏగిస), వేప లేదా టేకు చెక్కతో తయారుచేస్తారు. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేరుగా వర్షపు నీటిని ఇంటిలోని బిందెలు, పాత్రలలో నింపుకుని అవసరానికి ఉపయోగించుకుంటారు.
మండువా లోగిళ్ళు ఇప్పటి ఇళ్ళకంటే చాలా అందంగా, హుందాతనంగా ఉంటాయి. పూర్వం ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువా లోగిలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. గ్రామీణ ప్రాంతాల్లోని ధనికులు ఎక్కువగా ఈ మండువా లోగిళ్ళలో నివసించడానికి ఇష్టపడేవారు.
ప్రస్తుత పరిస్థితి
మార్చుఆంధ్ర ప్రదేశ్ లోని చాలా జిల్లాలలో ఇప్పటికీ ఈ మండువా లోగిళ్ళు అక్కడక్కడా కన్పిస్తూ మన పురాతన సంస్కృతి సంప్రదాయాలుకు అద్ధం పడుతున్నాయి. సీతారామయ్యగారి మనవరాలు, అష్టా చమ్మా, బెండు అప్పారావు వంటి చలన చిత్రాల్లో కూడా చూపించడం జరిగింది. అయితే నేడు గ్రామాలనుండి నగరాలకు వలస, శాస్త్ర సాంకేతిక విప్లవం, పాశ్చాత్య సంస్కృతి మొదలగు కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. ఫలితంగా మండువా లోగిళ్ళు కనుమరుగవుతున్నాయి.