మండేలా (తమిళ చిత్రం 2021)

మండేలా 2021లో పొలిటికల్‌ సెటైరికల్‌ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో విడుదలైన తమిళ చిత్రం. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ లో శశికాంత్, రామచంద్ర నిర్మించిన ఈ చిత్రంతో మడోన్నే అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ హాస్యనటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించాడు. మండేలా సినిమా స్టార్ విజయ్ & నెట్ ఫ్లిక్స్ లో 2021, ఏప్రిల్ 4న విడుదలైంది.[1][2]

మండేలా
దర్శకత్వంమడోన్నే అశ్విన్
రచనమడోన్నే అశ్విన్
నిర్మాతశశికాంత్
చక్రవర్తి రామచంద్ర
బాలాజీ మోహన్
తారాగణంయోగిబాబు
షీలా రాజ్ కుమార్
ఛాయాగ్రహణంవిధు అయ్యన్న
సంగీతంభరత్ శంకర్
నిర్మాణ
సంస్థలు
వై నాట్ స్టూడియోస్
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
ఓపెన్ విండో ప్రొడక్షన్స్
విష్ బెర్రీ ఫిలిమ్స్
పంపిణీదార్లునెట్ ఫ్లిక్
విడుదల తేదీ
4 ఏప్రిల్ 2021 (2021-04-04)
దేశం భారతదేశం
భాషతమిళ్

పెరియార్ ఆశయాలే ప్రాణంగా భావించిన ఓ గ్రామ పెద్ద, పంచాయితీ ప్రెసిడెంట్ అనారోగ్యంతో ఆ పదవి నుండి తప్పుకుంటాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇద్దరి కులాలు వేరు. వాళ్ళకు ఇద్దరు కొడుకులు. తన వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకు రాకూడదని పెద్దాయన భావించినా, ఈ అన్నదమ్ములు ససేమిరా అంటారు. తండ్రి పదవికి ఇద్దరూ పోటీ పడతారు. చిత్రం ఏమంటే... ఆ ఇద్దరి కులాలకు ఈ గ్రామంలో సమానమైన ఓట్లు ఉంటాయి. దాంతో గెలుపును నిర్ణయించే వ్యక్తిగా ఒకే ఒక్కడు నిలుస్తాడు. ఊరిలో ఎవరికీ పట్టని, ఏ పేరూ లేని క్షురకుడు అతను. ఆ ఊరిలోనే ఉండే ఓ యువతి అతనికి ఓ పేరు పెట్టుకోమని సలహా ఇవ్వడంతో 'మండేలా' అనే పేరు పెట్టుకుంటాడు. ఓటరు ఐడీ కార్డూనూ పొందుతాడు. సో... మండేలా వేసే ఓటే ఆ వూరి పంచాయితీ ప్రెసిడెంట్ ఎవరు అనేది నిర్ణయిస్తుంది! అక్కడ నుండి రాజకీయ నేతల వికృత క్రీడా విన్యాసాలు మొదలవుతాయి. ఆ బార్బర్ ను తమ వైపు తిప్పుకోవడానికి ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఎలా ఎత్తుగడలు వేశారు? అతనికి ఎలాంటి ఆశలు చూపించారు? ఒకానొక సమయంలో ఆ మాయాజాలంలో చిక్కుకున్న మండేలా తిరిగి తన అస్తిత్వాన్ని ఎలా కాపడుకున్నాడు? ఆ వూరికి ఎలాంటి మేలు చేశాడు? అనేది సినిమా కథ. [3]

నటీనటులు

మార్చు
  • యోగిబాబు - నెల్సన్ మండేలా
  • షీలా రాజ్‍కుమార్ - తెన్మోజ్హి
  • సంగిలి మురుగన్ - పెరియ అయ్యా
  • జి.ఎం. సుందర్ - రత్నం
  • కన్న రవి - మది
  • సేంతి కుమారి - వల్లి
  • జార్జ్ మర్యన్- బిఎల్ఓ అధికారి
  • దీపా శంకర్ - రత్నం భార్య

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం : మడోన్ అశ్విన్
  • రచన : మడోన్ అశ్విన్, సుమన్ కుమార్ (కంటెంట్ హెడ్)
  • సంగీతం : భరత్ శంకర్
  • ఛాయాగ్రహణం : విధు అయ్యన్న
  • బ్యానర్స్ : వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, ఓపెన్ విండో ప్రొడక్షన్స్, విష్ బెర్రీ
  • నిర్మాతలు : బాలాజీ మోహన్, చక్రవర్తి రామచంద్ర, శశికాంత్
  • విడుదల : స్టార్ విజయ్ & నెట్ ఫ్లిక్స్, ఏప్రెల్ 5, 2021

మూలాలు

మార్చు
  1. Film Companion (5 April 2021). "Mandela, On Netflix, Is A Chuckle-A-Minute Guide To Your Right To Vote". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  2. NTV Telugu. "మండేలా (తమిళం) : రివ్యూ". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  3. Eenadu. "ఓటు విలువ చాటిచెప్పే 'మండేలా' - mandela movie review". www.eenadu.net. Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.