మండ్లా జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మండ్ల జిల్లా (హిందీ:) ఒకటి. మండ్ల పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 8771 చ.కి.మీ.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 779,414. జిల్లాలో 4 తాలూకాలు, 1214 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని అధికభాగం నర్మదానది ముఖద్వారంలో ఉంది. జిల్లా మహాకోసల భూభాగంలో ఉంది.
Mandla జిల్లా
मंडला जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Jabalpur |
ముఖ్య పట్టణం | Mandla |
మండలాలు | 4 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Mandla |
• శాసనసభ నియోజకవర్గాలు | 12 |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,771 కి.మీ2 (3,387 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,53,522 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (310/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 68.28% |
• లింగ నిష్పత్తి | 1005 |
Website | అధికారిక జాలస్థలి |
ఆర్ధికం
మార్చు2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మండ్ల జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,053,522,[2] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 432వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 182 .[2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.81%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1005:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 68.28%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
మార్చుజిల్లాలో ఆస్ట్రోయాసిసియాటిక్ భాష అయిన అగారియా, గోండి భాషలు 72,000 మంది ప్రజలలో వాడుకగా ఉన్నాయి.[5] హిందీ భాషతో పోలికలున్న బఘెలీ భాషను కూడా జిల్లాలో వాడుకలో ఉంది.[6][7] అలాగే బగేల్ఖండి భాష 78,00,000 మంది ప్రజలకు వాడుక భాషగా ఉంది. [6] ద్రావిడ భాష అయిన బరియా భాష 2,00,000 మండి బరియా ప్రజలలో వాడుకలో ఉంది. గిరిజన తెగలకు చెందిన బడియా ప్రజలు ఈ భాషను దేవనాగరి లిపిలో వ్రాస్తుంటారు.[8]
పర్యావరణం
మార్చుజిల్లాలో అత్యధికంగా అరణ్యప్రాంతం ఉంది. జిల్లాలో కంహా నేషనల్ పార్క్, ప్రాజెక్ట్ టైగర్ అభయారణ్యం ఉంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్న నేషనల్ పార్కుగా దీనికి గుర్తింపు ఉంది. గుడ్ ఇఫ్రాస్టక్చర్, నిర్వహణకు ఈ పార్క్ పలు జాతీయ అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పులుల అభయారణ్యం కంహా, సప్తపురా అరణ్య ప్రాంతం ఒకప్పుడు ఏనుగులు, సింహాల రాజ్యంగా ఉండేది.[9]
మండ్ల అరణ్యాలలో ఔషధ మొక్కలు కూడా అధికంగా ఉన్నాయి. ఘుఘ్రి బ్లాకులో ఉన్న ఆయుర్వేద వైద్యులు, గ్రామవాసులు అటవీప్రాంతంలోని ఔషధాలను వాడుతుంటారు. [10]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cyprus 1,120,489 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567
- ↑ M. Paul Lewis, ed. (2009). "Agariya: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ 6.0 6.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-11. Retrieved 2014-11-23.
- ↑ Smita S. Dikshit and C. P. Kala. Traditional Utilization and Harvesting of Medicinal Plants in Mandla District of Madhya Pradesh. Applied Ecology and Environmental Sciences, 2014, Vol. 2, No. 2, 48-53</ http://pubs.sciepub.com/aees/2/2/2/index.html.