మంతెన రామరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.[1]

మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు)

ఎమ్మెల్యే
పదవీ కాలం
2019 - ప్రస్తుతం
ముందు వేటూకూరి వెంకట శివరామరాజు
నియోజకవర్గం ఉండి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 13 ఫిబ్రవరి 1977
కలవపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు చిన్న వెంకటరాజు, సూర్యకాంతమ్మ
జీవిత భాగస్వామి సుష్మ
సంతానం మనోహర్ మూర్తి, జస్వంత్ వర్మ
పూర్వ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) 13 ఫిబ్రవరి 1977లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, కలవపూడిలో చిన్న వెంకటరాజు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు చదువుకున్నారు.

రాజకీయ జీవితం

మార్చు

మంతెన రామరాజు (మంతెన రాంబాబు) 2006లో కలవపూడి సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికై, 2007లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన భీమవరం డి.ఎన్.ఆర్ కళాశాల పాలక వర్గ సభ్యుడిగా, కోస్టల్ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. మంతెన రామరాజు 2019లో నరసాపురం టిడిపి ఎంపీ అభ్యర్థిగా రేసులో ఉన్న కనుమూరు రఘురామ కృష్ణం రాజు వైసీపీలోకి వెళ్లిపోవడంతో, అంతకుముందు 2009, 2014 ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) ఎంపీ స్థానంకు పోటీ చేయడంతో ఆయనకు 2019లో ఉండి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కింది. ఆయన ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పి.వి.ఎల్. నరసింహ రాజుపై 10949 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.[2]

మూలాలు

మార్చు
  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Eenadu (23 May 2021). "చట్టాలకు లోబడి పనిచేయాలి". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.