మంత్రపుష్పం

(మంత్రపుష్పము నుండి దారిమార్పు చెందింది)

మంత్ర పుష్పం వేదాంతర్గతమైనది. తైత్తిరీయోపనిషత్తు లో మంత్ర పుష్పం, తైత్తిరీయారణ్యకంలో మహా మంత్రపుష్పం ఉన్నాయి. సహస్రశీర్షం దేవం' ఇత్యాది మంత్రాలు మంత్రపుష్పంగానూ, 'యోపాం పుష్పం వేద' ఇత్యాది మంత్రాలు మహా మంత్రపుష్పంగానూ ప్రసిద్ధిచెందాయి.

మననం చేసేవాణ్ణి రక్షించేది మంత్రం. మామూలుగా అయితే పుష్పాలతో దేవున్ని పూజిస్తాము. మంత్రం పఠిస్తూ పుష్పాన్ని సమర్పించడమనీ లేక మంత్రమనే పుష్పాన్ని సమర్పించడమనీ రెండు విధాల అర్ధాన్ని మంత్రపుష్పం అనే మాటకు చెప్పవచ్చును.

ధ్యానం, ఆవాహనం, మొదలైన షోడశోపచారాల పూజలో మంత్రపుష్పం కూడా ఒక అంగము. భగవత్పూజావసానం వంటి మంగళకర సందర్భాలలో మంత్రపుష్పం పఠించాలి.

సారాంశం మార్చు

పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడని చెబుతారు. మోక్ష మార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే "దైవం పరంజ్యోతి" అంటారు. అతనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.[1]

ఉపయోగం మార్చు

దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు. పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పం చెబుతుంది. మానవుల లోపల, బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని, ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో మంత్రపుష్పం చెబుతుంది.

‘‘మానవ శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడు: అని మంత్ర పుష్పంలో వర్ణించబడింది. ’

చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తుల విశ్వాసం.

మనిషిలో వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి భక్తుడు, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని విన్నప్పుడు కళ్ళు మూసుకుని పరమాత్మని దర్శనం చేసుకోవాలి. [2]

మూలాలు మార్చు

  1. "మంత్రపుష్పం". Sandehalu Samadhanalu (in ఇంగ్లీష్). 2017-11-08. Retrieved 2020-06-27.
  2. "మంత్రపుష్పం ఎందుకు చదువుతారంటే". TeluguOne Devotional (in english). 2020-06-27. Retrieved 2020-06-27.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

భాహ్య లంకెలు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: