మందు పాతర
మందు పాతర అంటే యుద్ధాల్లో వాడే ఒక ప్రేలుడు పదార్థం. వీటిని సాధారణంగా నేలలో పాతి పెడతారు. ఇవి ఒత్తిడికి గురైనా లేక ఏదైనా ట్రిప్ వైరుకు అనుసంధానించడం ద్వారా పేల్చివేస్తారు. వీటి ధాటికి 1975 నుంచి ఇప్పటి దాకా సుమారు ఒక పది లక్షల మంది మరణించారు[1]. ఇందువల్ల ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాల్లో వీటి వాడుకను అరికట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వీటిని తయారు చేయడం సులభం, తక్కువ ఖర్చు అవుతుంది. శత్రువులను నివారించడానికి ఎక్కువ విస్తీర్ణంలో సులభంగా అమర్చవచ్చు. వీటిని సాధారణంగా మనుషులో భూమిలో పాతి పెడుతుంటారు. అయితే వీటి కోసం కూడా యంత్రాలున్నాయి.
మూలాలుసవరించు
- ↑ "మందు పాతర గురించి హౌ స్టఫ్ వర్క్స్ లో వ్యాసం". Archived from the original on 2010-03-18. Retrieved 2010-04-01.