మజహర్ అలీ ఖాన్
మజహర్ అలీ ఖాన్, 19వ శతాబ్దంలో చివరి-మొఘల్ శకంలో ఢిల్లీకి చెందిన చిత్రకారుడు.[1] పాశ్చాత్య ప్రభావంతో మొఘల్ చిత్రకళ తర్వాత కాలం నాటి కంపెనీ శైలిలో చిత్రాలను గీసాడు.[2] 1840 నుండి చిత్రాలను గీయడం ప్రారంభించిన మహజర్, థామస్ మెట్‌కాల్ఫ్ రూపొందించిన ఢిల్లీ బుక్[3] లోని టోపోగ్రాఫికల్ పెయింటింగ్స్ తో పేరొందాడు.[4]
మజహర్ అలీ ఖాన్ | |
---|---|
జననం | |
మరణం | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | టోపోగ్రాఫికల్ పెయింటింగ్స్, పోర్ట్రెయిట్స్ |
గుర్తించదగిన సేవలు | ఢిల్లీ బుక్ ఫ్రేజర్ ఆల్బమ్ |
శైలి | కంపనీ స్టైల్ |
జీవిత విషయాలు
మార్చుమజహర్ ఢిల్లీలో జన్మించాడు. కఠినమైన మొఘల్ చిత్రకళలో శిక్షణను పొందిన మహజర్, గొప్ప సూక్ష్మ కళాకారుల వంశంలో కలిసిపోయాడు. 1820లలో గులాం అలీ ఖాన్ ద్వారా శిక్షణ పొందాడు. 1850 లో మజహర్ అలీ ఖాన్ అజ్మీర్ నగరంలోని దర్గా మందిర దృశ్యాన్ని కూడా చిత్రించాడని, దీని తరువాత అతను అరేబియాలోని పవిత్ర పుణ్యక్షేత్రాలను చిత్రీకరించడానికి అరేబియాకు వెళ్ళాడని చరిత్రకారుల అభిప్రాయం.
కళారంగం
మార్చు1842-1844 మధ్య కాలంలో భారతదేశంలోని మొఘల్ చక్రవర్తి ఆస్థానంలో గవర్నర్ జనరల్ ఏజెంట్‌గా పనిచేసిన మెట్‌కాల్ఫ్ స్మారక చిహ్నాలు, శిథిలాలు, రాజభవనాలు, పుణ్యక్షేత్రాల చిత్రాలను గీయాలని ఢిల్లీ కళాకారుడైన మజహర్ అలీ ఖాన్ ను ఆదేశించాడు. మహజర్ 100 పెయింటింగ్‌లను గీశాడు. వాటిని ఆ పుస్తకంలో ప్రచురించారు.[5] మజహర్ అలీ ఖాన్ఢిల్లీ పనోరమా 1846లో పూర్తయింది. ఇది షాజహనాబాద్ ను 360 డిగ్రీలలో ఆవిష్కరిస్తోంది. 1857లో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం తరువాత, బ్రిటిష్ దళాలు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌ను తొలగించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాయి. ఆ దాడిలో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. వాటిలో మిగిలి ఉన్న ఏకైక రికార్డు మెట్‌కాల్ఫ్, ఖాన్ చేత వెలువడిన ఈ పుస్తకం.
మూలాలు
మార్చు- ↑ Museum, Victoria and Albert. "One of four drawings of Mughal architecture. | Unknown | Khan, Mazhar Ali | V&A Explore The Collections". Victoria and Albert Museum: Explore the Collections (in ఇంగ్లీష్). Retrieved 2021-08-14.
- ↑ "Self-Portrait by Mazhar Ali Khan - Famous Indian Art - Handmade Oil Painting on Canvas — Canvas Paintings". ArtworkOnly.Com (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-14.
- ↑ Losty, J. P. (2013-09-25). Delhi 360: Mazhar Ali Khan's View from Lahore Gate.
- ↑ William Dalrymple on The Dehlie Book | Art and design | The Guardian
- ↑ Losty, Jeremiah. "'Depicting Delhi: Mazhar Ali Khan, Thomas Metcalfe and the Topographical School of Delhi Artists', in Dalrymple, W., and Sharma, Y., ed. Princes and Painters in Mughal Delhi, 1707-1857, Asia Society, New York, 2012, pp. 52-59". Princes and Painters in Mughal Delhi, 1707-1857, Asia Society, New York, 2012, pp. 52-59.