మట్టపల్లి చలమయ్య

మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, ప్రముఖ దాత.

మట్టపల్లి చలమయ్య

జీవిత విశేషాలు సవరించు

ఆయన 1923 నవంబరు 19న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జన్మించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకే చదువుకున్నా 17 ఏళ్ల ప్రాయంలోనే తండ్రికి అండగా వ్యాపార రంగంలోకి ప్రవేశించి ప్రముఖ పారిశ్రా మికవేత్తగా ఎదిగారు. 1941లో బర్మా నుంచి వలస వచ్చి, సామర్లకోట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న శరణార్థులకు ప్రతిరోజు 5వేల మందికి అన్నం పెట్టి ఆకలి తీర్చారు.[1]

సామాజిక సేవలు సవరించు

ఆయన నగరంలో పలు చోట్ల విరివిగా అన్నదానం కార్యక్రమాలను చలమయ్య నిర్వహించడం లేదా అటువంటి కార్యక్రమాలకు భారీ మొత్తంలో విరాళాలు అందివ్వడం చేస్తుండేవారు. రోడ్ల పక్కన, పేవ్‌మెంట్లపైన రాత్రులందు నిద్రించే అభాగ్యులకు దుప్పట్లు, తువ్వాలు పంపిణీ చేయడం, నగదు సాయం చేయడం ఆయనకు నిత్యకృత్యంగా ఉండేది. నగరంలోని అనేక చిన్న, పెద్ద వ్యాపార సంస్థలను చలమయ్య చేతులమీదుగా ప్రారంభించడం గతకొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. చలమయ్య చేతులమీదుగా వ్యాపారం ప్రారంభిస్తే రాణిస్తుందనేది వ్యాపారుల నమ్మిక.[2]

1940వ దశకంలో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన తుదిశ్వాస విడిచేంత వరకు 70 ఏళ్లుగా సాగుతున్న ఈ అన్నదాన యజ్ఞాన్ని తన తదనంతరం కూడా కొనసాగించాలని కుమారులకు ఆయన సూచించారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల నిర్మాణాలకు ఆయన విరాళాలిచ్చారు. లోక కల్యాణార్థం ఎక్కడ క్రతువులు నిర్వహించినా అక్కడ తప్పనిసరిగా అన్నప్రసాదాలను అందించేందుకు చలమయ్య ముందుండేవారు. ఆర్‌. ఎస్. ఎస్. భావాలు కలిగిన చలమయ్య సంఘ్‌పరివార్‌కు చెందిన ముఖ్యనేతలు అశోక్‌ సింఘాల్‌, ప్రవీణ్‌ తొగాడియా వంటి వారితో సంబంధాలను నెరిపారు.[3]

అస్తమయం సవరించు

ఆయన ఫిబ్రవరి 20 2017 న గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

మూలాలు సవరించు

ఇతర లింకులు సవరించు