మణిరత్నం

ప్రముఖ సినీ దర్శకుడు

మణిరత్నం తమిళ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన కథానాయక సుహాసిని మణిరత్నం భార్య. తెలుగులో ఈయన దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా గీతాంజలి. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయకుడు, రోజా, బొంబాయి, గీతాంజలి మొదలయినవి మణిరత్నం ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ఆయన ప్రతి చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందింది.

మణిరత్నం
2015లో న్యూయార్క్ లో మణిరత్నం
జననం
గోపాల రత్నం సుబ్రమణియం

(1955-06-02) 1955 జూన్ 2 (వయసు 68)
వృత్తిసినీ దర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1983–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుహాసిని (1988–ప్రస్తుతం)
పిల్లలు1

మణిరత్నం ముంబై లోని జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీయే చేశాడు. ఆయన తండ్రి రత్నం అయ్యర్. వీనస్ స్టూడియో కి అధినేత. ఆయన మొదటి సినిమా పల్లవి అనుపల్లవి అనే కన్నడ సినిమా. సుహాసిని మణిరత్నం దంపతులకు నందన్ అనే కుమారుడు ఉన్నాడు. అతను ప్రస్తుతం బ్రిటన్ లోని ఎడింబరో లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఆయన తీసిన సినిమాల్లో ఆయనకు బాగా నచ్చింది ఇద్దరు. అందులో మోహన్‌లాల్ నటనకు గాను జాతీయ బహుమతి వస్తుందని ఆయన అనుకున్నాడు. కానీ రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాడు. ఆయన తీసిన తాజాచిత్రం 'కడలి ' కూడా ఎంతో నిరుత్సాహాపరిచింది. [1]

ఇవి కూడ చూడండి మార్చు

ఓ కాదల్ కన్మణి

మూలాలు మార్చు

  1. ఈనాడు ఆదివారం అనుబంధం, అక్టోబరు 24, 2010


"https://te.wikipedia.org/w/index.php?title=మణిరత్నం&oldid=3879953" నుండి వెలికితీశారు