మత్స్యగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి దేవాలయం
మత్స్యగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వేములకొండ గ్రామం సమీపంలోని ఎత్తయిన గుట్టపై ఉన్న దేవాలయం.
మత్స్యగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి దేవాలయం | |
---|---|
![]() మత్స్యగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి గర్భగుడి | |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | యాదాద్రి భువనగిరి జిల్లా |
ప్రదేశం: | వేములకొండ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | లక్ష్మీనరసింహస్వామి |
ప్రధాన దేవత: | లక్ష్మీదేవి |
స్థల పురాణంసవరించు
వేములకొండ గుట్టకు రెండు వైపుల ఘాట్ రోడ్డు ఉంది. గుట్టపైన ఉన్న నీటి గుండంలో కుండంలో ఉండే చేపల రకం పేరు మార్పుడుగాళ్ళు. వాటిని పట్టుకొని తినే ప్రయత్నం చేసేవాళ్ళంతా చచ్చిపోతారనే కథ ప్రచారంలో ఉంది. వేములకొండంటే వేయిమునుల కొండ అని అర్థం. ఒకప్పుడు జైనమునులు ఇక్కడ నివసించేవారు. వేములకొండ అని పేరు వచ్చింది.[1]
గుడిసవరించు
ఒకప్పుడు ఈ గుట్టపై గుడి ఉండేదికాదని, తరువాతికాలంలో ఈ గుడి, మిగిలిన నిర్మాణాలు జరిగాయి తెలుస్తుంది. పూర్వం కొండ కిందనుండి మెట్లదారి ఉండేది. ద్వార బంధానికి మత్స్యం చెక్కివుంది. మెట్లదారికి కుడివైపున కొండరాతికే చెక్కిన గణపతి, ఆంజనేయ శిల్పాలున్నాయి. అవి శిల్పరీతిని బట్టి రాష్ట్రకూటుల కాలానికి చెందినవిగా చెబుతున్నారు. గుడికి రాతి ప్రహరి నిర్మించిన ఆనవాళ్ళున్నాయి. పలుచని నలుపు, ఎరుపు, బూడిద రంగు కుండపెంకులు ఆ స్థలంలో లభించడంతో ఈ గుట్ట ప్రాచీన కాలం నుండి మానవునికి ఆవాసంగా ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు.[1]
విశిష్టతసవరించు
సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తులోవున్న కొండపై లక్ష్మీనర్సింహస్వామి మత్స్య అవతారంలో వెలిసాడు. కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుండం ఎప్పుడూ నీళ్లతో కళకళలాడుతుంటుంది. ఈ పుష్కరిణిలోని చేపలు మూడు (విష్ణు) నామాలు, మీసాలతో కనిపిస్తాయి. ఇలా నామాలు, మీసాలు కనిపించడంతో భక్తులు వీటిని భగవంతుడి అవతారంగా భావిస్తారు. లక్ష్మీనర్సింహస్వామి స్వయంగా మత్స్య అవతారంలో వెలిసాడని భక్తులు విశ్వాసం.[2] చేపలకు పులిహోర, దద్దోజనం లాంటి ప్రసాదాలతోపాటు బిస్కెట్లు కూడా ఉదయం ఆరు గంటలకే సమర్పిస్తారు.
గతంలో సరస్సును శుద్ధిచేయడంలో భాగంలో పాత నీటిని తీసివేసి, కొత్త నీటితో సరస్సును నింపారట. కొత్తనీరు చేర్చిన తర్వాత ఓ ట్రక్ లోడ్ సరిపోయే చేపలు సరస్సులో మరణించడం భక్తుల విశ్వాసంపై తీవ్రంగా ప్రభావం చూపిందని అక్కడివారు చెబుతారు. అయితే సరస్సులోని చేపగుడ్లు మళ్లీ ఫలదీకరణం చెందడంతో మళ్లీ విష్ణు నామాలున్న చేపలు భారీ సంఖ్యలో జన్మించాయని స్థానికులు వెల్లడించారు. మండు వేసవి కాలంలో కూడా ఈ సరస్సులో నీళ్లు నిండుగా ఉంటాయి. ఈ సరస్సులో చేపల్ని పట్టడానికి ఎవర్ని అనుమతించరు. గతంలో ఈ సరస్సులో చేపలు పట్టిన స్థానికుడు రక్తం కక్కుకుని మరణించాడని అక్కడి వాళ్లు చెబుతారు. ఆ ప్రాంతపు చుట్టు పక్కల వారు రెగ్యులర్ గా ఆలయాన్ని సందర్శించుకోవడంతోపాటు చేపలకు బిస్కెట్ ప్రసాదాన్ని సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 నవతెలంగాణ (28 November 2015). "చరిత్రక శకలాల కుప్ప వేములకొండ గుట్ట". శ్రీరామోజు హరగోపాల్. Retrieved 31 October 2017.
- ↑ వి6 న్యూస్ (31 October 2017). "ప్రారంభమైన మత్స్యగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి బ్రహ్మోత్సవాలు". Archived from the original on 10 నవంబరు 2017. Retrieved 31 October 2017.