యాదాద్రి జిల్లా

తెలంగాణ రాష్ట్ర జిల్లా
(యాదాద్రి భువనగిరి జిల్లా నుండి దారిమార్పు చెందింది)

యాదాద్రి జిల్లా, తెలంగాణ లోని 33 జిల్లాలలో ఒకటి.[3] ఈ జిల్లా 2016 అక్టోబరు 11న, అవతరించింది. ఈ జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, ఉన్నాయి. జిల్లా పరిపాలన కేంద్రం భువనగిరి.

యాదాద్రి జిల్లా
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా స్థానం
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంభువనగిరి
మండలాలు17
Government
 • జిల్లా కలెక్టరుటి. వినయ్ కృష్ణారెడ్డి (ఐఏఎస్)[1]
 • లోకసభ నియోజకవర్గాలుభువనగిరి
 • శాసనసభ నియోజకవర్గాలుభువనగిరి
విస్తీర్ణం
 • మొత్తం3,091.48 కి.మీ2 (1,193.63 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం7,26,465
 • జనసాంద్రత230/కి.మీ2 (610/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత68 శాతం
Vehicle registrationటిఎస్-30[2]
అక్షాంశ రేఖాంశాలు17°30'36"N, 78°53'24"E

ఇంతకుపూర్వం భువనగిరి, యాదగిరిగుట్ట రెండు వేరువేరు మండలాలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్, చిన్నజీయర్ స్వామి సూచనల మేరకు యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారు. దీనియొక్క ముఖ్య ఉద్దేశం యాదగిరిగుట్ట అనగా "గిరి" అనేది "గుట్ట" అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా చెప్పాడుతున్నవి కావున రెండు ఒకే అర్థాన్ని ఇస్తునందునా సంస్కృత పదమైన "ఆద్రి" అనగా కొండ అనే అర్థంతో యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారు.   

తెలంగాణలోని ముఖ్యమైన అధ్యాత్మికక్షేత్రం యాదాద్రి పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నల్గొండ జిల్లా లోనివే.[4]

పటం
యాదాద్రి జిల్లా

పరిపాలనా విభాగాలు

మార్చు

ఈ జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

ముఖ్య ప్రదేశాలు

మార్చు
యాదగిరిగుట్ట

మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్లగొండ లోని భువనగిరి, రాయగిరి మధ్యలో ఉంది. యాదర్షి గాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షాత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కథనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఉగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.

దర్శనీయ ప్రాంతాలు

మార్చు

జిల్లాలోని మండలాలు

మార్చు
క్ర.సం. భువనగిరి రెవెన్యూ డివిజన్ క్ర.సం. చౌటప్పల్ రెవెన్యూ డివిజన్
1 అడ్డగూడూర్ మండలం * 13 (బి) పోచంపల్లి మండలం
2 ఆలేరు మండలం 14 చౌటుప్పల్ మండలం
3 ఆత్మకూర్ (ఎం) మండలం 15 నారాయణపూర్ మండలం
4 బీబీనగర్ మండలం 16 రామన్నపేట్ మండలం
5 భువనగిరి మండలం 17 వలిగొండ మండలం
6 బొమ్మల రామారాం మండలం
7 మూటకొండూరు మండలం *
8 మోతుకూరు మండలం
9 రాజాపేట‌ మండలం
10 తుర్కపల్లి మండలం
11 యాదగిరిగుట్ట మండలం
12 గుండాల మండలం[5]

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (2)

జిల్లాలోని పురపాలక సంఘాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "నూతన కలెక్టర్‌గా వినయ్‌ కృష్ణారెడ్డి". EENADU. 2023-08-01. Archived from the original on 2023-08-01. Retrieved 2023-08-01.
  2. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2016.
  5. "యాదాద్రి జిల్లాలో..ఇక 17 మండలాలు (జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరికి మారిన గుండాల)". m.andhrajyothy.com. 2019-02-27. Archived from the original on 2022-02-14. Retrieved 2022-02-14.

వెలుపలి లంకెలు

మార్చు