మదనాపురం మండలం (వనపర్తి జిల్లా)
మదనాపురంమండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం. మదనాపురం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[1] దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
మదనాపురం మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, మదనాపురం మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°22′55″N 77°53′18″E / 16.381929°N 77.888281°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండల కేంద్రం | మదనాపురం (వనపర్తి జిల్లా) |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 104 km² (40.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 27,905 |
- పురుషులు | 14,075 |
- స్త్రీలు | 13,830 |
పిన్కోడ్ | 509381 |
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
మార్చులోగడ మదనాపూర్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని కొత్తకోట మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మదనాపూర్ గ్రామాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా వనపర్తి జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 104 చ.కి.మీ. కాగా, జనాభా 27,905. జనాభాలో పురుషులు 14,075 కాగా, స్త్రీల సంఖ్య 13,830. మండలంలో 5,823 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.