మదనాపురం మండలం (వనపర్తి జిల్లా)

వనపర్తి జిల్లా, మదనాపూర్ మండలానికి కేంద్రం

మదనాపురంమండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ మదనాపూర్  గ్రామం మహబూబ్ నగర్ జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని కొత్తకోట మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మదనాపూర్ గ్రామాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా వనపర్తి జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. మదనాపురం
 2. గోవిందహళ్లి
 3. దంతనూర్
 4. శంకరంపేట
 5. తిరుమలాయిపల్లి
 6. రామన్‌పాడు
 7. అజ్జకొల్లు
 8. నర్శింగాపూర్
 9. కొన్నూర్
 10. ద్వారకానగర్
 11. నెలివిడి
 12. దుప్పల్లి
 13. కొత్తపల్లి
 14. గోపన్‌పేట
 15. కార్వెన

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులుసవరించు