మద్దూరి వేంకటరమణమ్మ
మద్దూరి వేంకటరమణమ్మ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు.[1]
జీవిత విశేషాలు
మార్చుఆమె మార్చి 2 1906 న పెద్దాపురం లో కొల్లూరి కామేశ్వరమ్మ, బ్రహ్మాజీ రామశర్మలకు జన్మించింది. ఆమె భర్త అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు. స్వాతంత్ర్య పోరాటంలో జైలు శిక్షను అనుభవించింది. ఆమె మరది గారు సమాజ సేవకుడు, సీతానగరంలో మహిళల సంక్షేమం కోసం ఉన్న ఆశ్రమంలో ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఆమె విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా 1932లో రాజమండ్రిలో బట్టల దుకాణాల ముందు విదేశీ దుస్తుల బహిష్కరణ ఉద్యమం చేపట్టింది. వెల్లూరు, కనమర్రు జైళ్ళలో 6 నెలల జైలుశిక్ష అనుభవించింది.రాత్రి సమయాలలో రహస్య సమావేశాలను నిర్వహించి, సాటి మహిళల్లో దేశభక్తిని ప్రేరేపించిన ప్రాతః స్మరణీయురాలు.[2] ఆమె తన 37 సంవత్సరాల వయస్సులో తన భర్త జైలులో ఉన్న సమయంలో 1943 జనవరి 6న మరణించింది. వీరి సోదరుడు కె. ఎస్. శాస్త్రి విశాఖకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.[3]