మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి

మద్దెలచెరువు సూర్యనారాయణ (సూరి) రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు.

జీవితం

మార్చు

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువులో సూర్యనారాయణరెడ్డి జన్మించారు. మద్దలచెరువు సూరి పేరుతో ప్రాచుర్యం పొందారు. అదే జిల్లా రామగిరి మండలం వెంకటాపురం వాసి , మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్రతో ఫ్యాక్షన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు మారుపేరుగా నిలిచారు. భానుమతిని వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారు.

హైదరాబాద్‌లో సూరితో పాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్ యూసుఫ్‌గూడ ప్రాంతంలో దేశవాళీ తుపాకీతో కాల్చి ఆయన్ని చంపి పరారయ్యాడు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ 2012, ఏప్రిల్ 21న జహీరాబాద్ వద్ద భానుకిరణ్‌ను అరెస్ట్ చేశారు. సూరిని హత్య చేసిన తర్వాత మధ్యప్రదేశ్ పారిపోయిన భానుకిరణ్ సియోని ప్రాంతంలో తలదాచుకున్నాడు. అతడిపై నిఘా పెట్టిన పోలీసులు జహీరాబాద్ వద్ద అదుపులోకి తీసుకుని తుపాకీ, మూడు సెల్‌ఫోన్లు, బ్యాంకు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భానుకిరణ్‌పై నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. [1] ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌‌‌‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. మరో నిందితుడు మన్మోహన్ సింగ్‌కు ఐదేళ్ల సాధారణ జైలు శిక్షను ఖరారు చేసింది. మిగతా నలుగురు నిందుతలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. [2]

మూలాలు

మార్చు
  1. "మద్దెలచెరువు సూరి హత్య కేసులో నేడే తీర్పు". Samayam Telugu. Retrieved 2022-11-19.
  2. "Suri Murder Case: సూరి హత్యకేసులో సంచలన తీర్పు". Samayam Telugu. Retrieved 2022-11-19.