మధుకర్ యశ్వంతరావు కుక్డే భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2018లో బాంద్రా గొండియా నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మధుకర్ యశ్వంతరావు కుక్డే
పదవీ కాలం
31 మే 2018 – 23 మే 2019
ముందు నానా పటోలే
తరువాత సునీల్ బాబురావు మెంధే
నియోజకవర్గం బాంద్రా గొండియా
పదవీ కాలం
1995 – 2009
ముందు సుభాశ్చంద్ర కరేమోర్
తరువాత అనిల్ బావంకర్
నియోజకవర్గం తుమ్సర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) (2014–ప్రస్తుతం)
భారతీయ జనతా పార్టీ ( 2014 వరకు)
సంతానం మోనాల్ కుక్డే, పల్లవి కుక్డే
నివాసం తుమ్సర్ సిటీ, భండారా జిల్లా , భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మధుకర్ కుక్డే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 నుండి 2009 వరకు తుమ్సర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009, 2014 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు. ఆయన 2014లో ఎన్‌సీపీలో చేరి 2018లో బాంద్రా గొండియా లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. "State Elections 1999 – Tumsar Assembly Constituency". ECI. Retrieved 2018-06-25.
  2. "State Elections 2004 - Constituency wise detail for 142-Tumsar Constituency of Maharashtra". ECI. Retrieved 2018-06-25.
  3. News18 (2 June 2018). "Behind NCP's Win in Bhandara-Gondia By-election Was a Battle Between Masses and Leaders" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Indian Express (31 May 2018). "Bhandara-Gondia bypoll results 2018: Congress-NCP underscores possibility of victory against BJP in 2019" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.