మధురపూడి గ్రామం అనే నేను

మధురపూడి గ్రామం అనే నేను 2023లో విడుదలైన తెలుగు సినిమా. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.[1] శివ కంఠ‌మ‌నేని, క్యాథ‌లిన్ గౌడ, భ‌ర‌ణి శంక‌ర్‌, స‌త్య‌, నూక‌రాజు ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను దర్శకుడు బాబీ విడుద‌ల చేయగా, సినిమాను అక్టోబ‌రు 13న విడుదల చేశారు.[2]

మధురపూడి గ్రామం అనే నేను
దర్శకత్వంమల్లి
స్క్రీన్ ప్లే
  • నాగ‌కృష్ణ గుండా
కథమల్లి
మాటలు
  • ఉదయ్ కిరణ్
నిర్మాతకేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు
తారాగణం
  • పులివెందుల మహేష్
  • ప్రియ పాల్
  • మంజునాథ్ రెడ్డి
  • మహేష్ విట్టా
ఛాయాగ్రహణంసురేష్ భార్గవ్
కూర్పుగౌతమ్ రాజు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
లైట్ హౌస్ సినీ మ్యాజిక్
విడుదల తేదీ
2023 అక్టోబ‌రు 13
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • శివ కంఠ‌మ‌నేని[3]
  • క్యాథ‌లిన్ గౌడ
  • భ‌ర‌ణి శంక‌ర్‌
  • స‌త్య‌
  • నూక‌రాజు

కథ మార్చు

ఊర్లో సూరి (శివ కంఠమనేని) ఓ మొరటోడు, మొండోడు. సూరి తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత వ‌ర‌కైన నిలబడతాడు. తన స్నేహితుడి మంచి కోసం ప్రాణాలిచ్చేందుకైనా, తీసేందుకైనా ఏమాత్రం వెనకాడ‌ని మనస్తత్వం. త‌న స్నేహితుడి కోసం ప్రాణాలైన ఇవ్వ‌గ‌లిగే సూరి జీవితంలోకి హీరోయిన్ (క్యాథ‌లిన్ గౌడ) వస్తుంది? ఆమె వచ్చాక సూరి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి ? చివరకు బాబ్జీ సూరి స్నేహబంధం ఎలా మలుపు తిరిగింది? ఊర్లోని రాజకీయాల్లో సూరి పాత్ర ఏంటి? అనేదే మిగతా సినిమా కథ.

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
  • నిర్మాత: కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు
  • కథ, దర్శకత్వం: మల్లి (మల్లికార్జున్)[4][5]
  • స్క్రీన్‌ప్లే: నాగ‌కృష్ణ గుండా
  • మాటలు: ఉదయ్ కిరణ్
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్
  • ఎడిటర్‌: గౌతమ్ రాజు

మూలాలు మార్చు

  1. Namaste Telangana (8 October 2023). "ముధరపూడిలో జరిగిన కథ". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
  2. Zee News Telugu (30 September 2023). "అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న"మధురపూడి గ్రామం అనే నేను"". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  3. Andhrajyothy (13 October 2023). "అన్ని వాణిజ్య హంగులున్న చిత్రమిది | It is a film with all the commercial feel". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  4. Sakshi (12 October 2023). "ఓ ఊరికి ఆత్మ ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ: మల్లికార్జున్‌". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
  5. A. B. P. Desam (30 September 2023). "ఊరికి ఒక ఆత్మ ఉంటే - కళ్యాణ్ రామ్ 'కత్తి' దర్శకుడి కొత్త సినిమా!". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.

బయటి లింకులు మార్చు