మధుసూదన్ గుప్త
భారతీయ వైద్యుడు
పండిట్ మదుసూధన్ గుప్త అలోపతి వైద్యుడు. 1836 వ సంవత్సరంలో ఆ వైద్యంలో డిప్లమో పొందిన మొదటి భారతీయుడు. యూరోపియన్ డాక్టర్లతో సమంగా ప్రజలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం మధుసూదన్ గుప్తకు అనుమతినిచ్చింది. 1836, జనవరి 10 వతారీకున తరతరాలుగా వస్తున్న మూడనమ్మకాలను పక్కకునెట్టి డాక్టర్ గుప్త తన నలుగురు విద్యార్థులతో కలసి కలకత్తా మెడికల్ కాలేజీలో మొదటి శవపరీక్ష పూర్తి చేసారు.
పండిట్ మధుసూదన్ గుప్త মধুসূদন গুপ্ত | |
---|---|
జననం | 1800 |
మరణం | 15 నవంబరు 1856 (aged 56) కోల్‌కాతా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | వైద్యుడు |
కలకత్తా వైద్యకళాశాల | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారతదేశంలో పాశ్చాత్య పద్ధతిలో శవపరీక్ష నిర్వహించిన తొలి వ్యక్తి. |