మధు సేవ

(మధుసేవ నుండి దారిమార్పు చెందింది)

కాళ్ళకూరి నారాయణరావు సుప్రసిద్ధ నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితుడు. ఈయన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో 1871, ఏప్రిల్ 28న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.

మధుసేవ అనే ఈ నాటకాన్ని మద్యపాన మహమ్మారిని పోద్రోలడానికి రచించారు. ఈ నాటకం రెండవ కూర్పును కాళ్లకూరి సదాశివరావు 1929 సంవత్సరంలో ప్రచురించారు.

ఇందులోని పాత్రలు

మార్చు
  1. రఘునాధరావు - కథానాయకుడు
  2. విశ్వాసరావు - రఘునాధరావుగారి మేనేజరు
  3. శర్మ - రఘునాధరావుగారి దుష్టస్నేహితుడు
  4. నిర్మల - రఘునాధరావుగారి భార్య
  5. కస్తూరి - వేశ్య
  6. సిపాయి చిన్నయ్య - రఘునాధరావుగారి నౌకరు
  7. రంగడు - ఒక త్రాగుబోతు
  8. వెంకటేశము - కస్తూరి తమ్ముడు
  9. కాసిం సాహెబు - కస్తూరి రహస్యవిటుడు
  10. ఇనస్పెక్టరు
  11. మెజిస్ట్రేటు
  12. ప్రాసిక్యూటరు
  13. పంతులు - రఘునాధరావుగారి వకీలు
  14. నాయుడు - కస్తూరి, శర్మల బారిస్టరు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మధు_సేవ&oldid=2882984" నుండి వెలికితీశారు