మనీష్ సిసోడియా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఢిల్లీ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికై 2015 ఫిబ్రవరి 14[1] నుండి 2023 ఫిబ్రవరి 28[2] వరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

మనీష్ సిసోడియా
మనీష్ సిసోడియా


రాజీనామా
పదవీ కాలం
14 ఫిబ్రవరి 2015 – 28 ఫిబ్రవరి 2023
Lieutenant Governor
ముందు Post created

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
10 ఫిబ్రవరి 2015
ముందు రాష్ట్రపతి పాలన
నియోజకవర్గం పట్పర్‌గంజ్
పదవీ కాలం
8 డిసెంబర్ 2013 – 10 ఫిబ్రవరి 2014
ముందు అనిల్ కుమార్ చౌదరి
తరువాత రాష్ట్రపతి పాలన
నియోజకవర్గం పట్పర్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1972-01-05) 1972 జనవరి 5 (వయసు 52)
హాపూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
పూర్వ విద్యార్థి భారతీయ విద్య భవన్
వృత్తి

రాజకీయ జీవితం

మార్చు

మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. ఆయన అనంతరం రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు. సిసోడియా 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో తూర్పు ఢిల్లీలోని పట్పర్‌గంజ్ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌పై 11,476 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మనీష్ సిసోడియా 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ నుండి పోటీ చేసి  తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ బిన్నీని 28,761 ఓట్లతో మెజారిటీతో  గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2020 ఢిల్లీ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి 3000 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.  

మూలాలు

మార్చు
  1. Sakshi (13 February 2015). "ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా!". Archived from the original on 1 March 2023. Retrieved 1 March 2023.
  2. Zee News Telugu (28 February 2023). "ఢిల్లీ మంత్రులుగా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లు రాజీనామా!". Archived from the original on 1 March 2023. Retrieved 1 March 2023.