మనుషులంతా ఒక్కటే

(మనుష్యులంతా ఒక్కటే నుండి దారిమార్పు చెందింది)

మనుషులంతా ఒక్కటే 1976లొ విడుదలైన తెలుగు చిత్రం. ఎన్.టి.ఆర్., దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం.నందమూరి తారక రామారావు జమున ముఖ్య పాత్రలు పోషించారు సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

మనుషులంతా ఒక్కటే
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణ రావు
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
చలపతిరావు,
నగేష్
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
గీతరచన సి.నారాయణరెడ్డి ఆత్రేయ "కొసరాజు"దాసరి నారాయణరావు.
నిర్మాణ సంస్థ ఆదిత్య చిత్ర
భాష తెలుగు



తారాగణం

మార్చు

నందమూరి తారక రామారావు

జమున

మంజుల

చలపతిరావు

కైకాల సత్యనారాయణ

అల్లు రామలింగయ్య

రమాప్రభ

నగేష్

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: దాసరి నారాయణరావు

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

నిర్మాణ సంస్థ: ఆదిత్య చిత్ర

గీత రచయితలు: ఆత్రేయ, సి నారాయణ రెడ్డి,కొసరాజు, దాసరి నారాయణరావు

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

విడుదల:07:04:1976 .



చిత్రకథ

మార్చు

సత్యనారాయణ నిరంకుశుడైన జమిందారు. అతని కొడుకు రామారావు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తుంటాడు. అతను చేసిన పొరపాటు వల్ల తండ్రిని కోల్పోయిన జమున వల్ల పరివర్తన చెందుతాడు. పేద వారితో కలిసి తండ్రిని వ్యతిరేకిస్తాడు. జమునను పెళ్ళి చేసుకుంటాడు. జమిందారు కొడుకును హత్యచేయిస్తాడు. జమున కొడుకు (మరో) రామారావు తన తాత ఆట కట్టిస్తాడు.

పాటలు

మార్చు
  • అనుభవించురాజా. యస్ పి.బాలసుబ్రహ్మణ్యం. రచన: సీ. నారాయణ రెడ్డి.
  • కాలంకాదూ ఖర్మా కాదూ విధి వ్రాసిన రాత కానేకాదూ, మనిషే మనిషికి ద్రోహంచేశాడు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.రచన: ఆత్రేయ.
  • ఎవడిదిరా ఈ భూమి యస్ పి. బాలసుబ్రహ్మణ్యం. పి. సుశీల. రచన: సీ. నారాయణ రెడ్డి.
  • నిన్నేపెళ్ళాడుతా, రాముడూ భీముడూ, రాముని మించిన రాముడు. పి. సుశీల. రచన: దాసరి నారాయణ రావు.
  • తాతా బాగున్నావా,ఏం తాతా బాగున్నావా. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం. రచన: సీ. నారాయణ రెడ్డి.
  • ముత్యాలూ వస్తావా ? అడిగిందీ ఇస్తావా. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం . పి. సుశీల.రచన: కొసరాజు.
  • వీరాభిమన్యు (బుర్రకథ)
  • నేల నీరు గాలి వెలుగు దేవుడే సృష్టించాడు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: ఆచార్య ఆత్రేయ .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.