నగేష్

సినీ నటుడు


సి.కె.నగేష్ (సెప్టెంబర్ 27, 1933జనవరి 31, 2009) దక్షిణ భారతదేశానికి చెందిన హాస్యనటుడు, రంగస్థల నటుడు. పలు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించాడు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రం కమల్ హాసన్ నటించిన దశావతారం. నవ్విస్తూనే ఏడిపించేవారాయన. అందుకే ఆయన అభిమానులు ఆయన్ని దక్షిణాది చార్లీ చాప్లిన్ గా అభివర్ణిస్తుంటారు.

నగేష్

జన్మ నామంగుండూ రావు
జననం (1933-09-27)1933 సెప్టెంబరు 27
మరణం 2009 జనవరి 31(2009-01-31) (వయసు 75)
చెన్నై
క్రియాశీలక సంవత్సరాలు 1958- 2008
భార్య/భర్త రెజీనా [1]
పిల్లలు ఆనంద్ బాబు

బాల్యం

మార్చు

ఈయన అసలు పేరు గుండూరావు. 1933, సెప్టెంబర్ 27న కర్ణాటక రాష్ట్రం, తుమకూరు జిల్లా టిప్టూరు తాలూకాలో చెయ్యూరు అనే ప్రాంతానికి చెందిన ఒక సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు రుక్మిణమ్మ, కృష్ణారావు.[2] చిన్నప్పుడే తాను ఏదో ఒక రంగంలో తన ప్రతిభను నిరూపించుకొన్నాకనే తిరిగి వస్తానని చెప్పి మద్రాసుకు వచ్చేశాడు. చెన్నైలో వెస్ట్ మాంబళంలో ఒక చిన్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిలో తమిళ రచయిత వాలి, తమిళ నటుడు శ్రీకాంత్ లతో కలిసి ఉన్నాడు. తరువాత కొద్ది కాలానికి భారతీయ రైల్వేలలో చిన్న ఉద్యోగాన్ని చేపట్టాడు. కానీ అది అంతగా సంతృప్తినివ్వకపోవడంతో దానిని వదిలేశాడు.

నట జీవితము

మార్చు

నాటకాలపై మక్కువతో తొలుత రంగస్థల నటుడిగా అవతారమెత్తాడు. నిర్మాత బాలాజీ నిర్మించిన నీర్ కుమిళి ఆయన నటించిన మొదటి చిత్రం. ఆయన నటించిన చివరి చిత్రం, కమల్ హాసన్ పది పాత్రలు పోషించిన దశావతారం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సుమారు 1000 సినిమాలలో నటించిన ఘనత ఆయనది. నగేష్ నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం సర్వర్ సుందరం . ఇది 1964లో విడుదలైంది. ఇందులో ఆయనే కథానాయకుడు. కె.ఆర్. విజయ కథానాయిక.

నటించిన తెలుగు చిత్రాలు

మార్చు
  1. సర్వర్ సుందరం (1964/1966) - సుందరం
  2. దేవత (1965)
  3. ఎవరాస్త్రీ? (1966) - గైడ్
  4. కన్నెపిల్ల (1966)
  5. పెళ్ళి పందిరి (1966)
  6. కాలచక్రం (1967)
  7. నువ్వే (1967)
  8. పెళ్ళంటే భయం (1967)
  9. అనుభవించు రాజా అనుభవించు (1968)
  10. పోస్టుమన్ రాజు (1968)
  11. ప్రేమకథ (1968)
  12. బస్తీలో భూతం (1968)
  13. శ్రీమంతులు (1968)
  14. ప్రేమ మనసులు (1969)
  15. కోటీశ్వరుడు (1970)
  16. బొమ్మలాట (1970)
  17. భయంకర గూఢచారి (1970)
  18. సికింద్రాబాద్ సి.ఐ.డి. (1971)
  19. కలవారి కుటుంబం (1972)
  20. పాపం పసివాడు (1972) - విమాన చోదకుడు
  21. సోగ్గాడు (1975) - సన్యాసిరావు
  22. ఆడవాళ్లు అపనిందలు (1976)
  23. ఉత్తమురాలు (1976)
  24. పూర్ణమ్మ కథ (1976)
  25. మనుషులంతా ఒక్కటే (1976) - గణపతి
  26. సావాసగాళ్ళు (1977)
  27. ఇంద్రధనుస్సు (1978)
  28. కన్నవారిల్లు (1978)
  29. దేవుడున్నాడు జాగ్రత్త (1978)
  30. ముగ్గురు మూర్ఖురాళ్ళు (1978)
  31. ఒక చల్లని రాత్రి (1979)
  32. ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979)
  33. బొమ్మా బొరుసే జీవితం (1979)
  34. వేటగాడు (1979)
  35. ఒకనాటి రాత్రి (1980)
  36. కొండవీటి సింహం (1981) - సీతాపతి
  37. గడసరి అత్త సొగసరి కోడలు (1981)
  38. జస్టిస్ చౌదరి (1982)
  39. భామా రుక్మిణి (1983)
  40. శ్రీరంగనీతులు (1983)
  41. వసంత గీతం (1984)
  42. కారు దిద్దిన కాపురం (1986) - మన్మధరావు
  43. ఇంద్రుడు చంద్రుడు (1989)
  44. విచిత్ర సోదరులు (1989)
  45. దళపతి (1992) - పంతులు
  46. బృందావనం (1992)
  47. ఆడవాళ్ళకు మాత్రమే (1994)
  48. మేడమ్ (1994)
  49. శుభాకాంక్షలు (1997)
  50. తొలిప్రేమ (1998)
  51. తమ్ముడు (1999)
  52. చెలి (2001)
  53. దశావతారం (2008)

ఒడిదుడుకులు

మార్చు

తన హాస్యంతో ప్రేక్షక లోకాన్ని నవ్వించిన నగేష్ జీవితంలో పలు కష్టాలను అనుభవించాడు. నటుడిగా స్థిరపడిన తర్వాత తను సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. ఒక థియేటర్ కూడా నిర్మించాడు. ఎమ్జీఆర్ తో అభిప్రాయ భేదాలు వచ్చాక నగేష్ కి ఇబ్బందులు మొదలయ్యాయని తమిళ చిత్ర వర్గాలు అంటుంటాయి. సరిగ్గా అప్పుడే వ్యాపారం కూడా దెబ్బతిన్నది. అయితే మళ్ళీ ఎమ్జీఆర్ తో కలిశాక కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఎప్పుడూ కష్టాల్ని బయటకు చెప్పుకునేవాడు కాదు. నేను ఓ ఖరీదైన కారు కొన్నాను. అందులో మా అమ్మ రుక్మిణమ్మను ఎక్కించుకుని తిప్పాను. అలా తిప్పుతుండగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఆ క్షణాలే నన్ను ఎక్కువగా బాధ పెట్టాయి అంటాడు నగేష్.

కుటుంబం

మార్చు

75 ఏళ్ళు జీవించిన నగేష్ కు ఇద్దరు కుమారులు. ఒకరు ఆనంద్ బాబు మరొకరు రమేష్ బాబు. వీరిలో ఆనంద్ బాబు నటుడు. ఆయన భార్య 2006లో చనిపోయింది.. అస్వస్థత కారణంగా ఆయన చెన్నైలోని తన స్వగృహంలో 2009, జనవరి 31 శనివారం రోజు ఉదయం 11 గంటలకు కన్నుమూశాడు.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-04. Retrieved 2009-02-03.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-03-07. Retrieved 2009-02-03.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=నగేష్&oldid=3833003" నుండి వెలికితీశారు