మనోజ్‌ పాండే (జననం 1962 మే 6) భారతదేశానికి చెందిన ఆర్మీ జనరల్. ఆయన 2022 ఏప్రిల్ 18న భారత 29వ ఆర్మీ చీఫ్‌గా నియమితుడయ్యాడు.[2] జనరల్ మనోజ్ పాండే గతంలో తూర్పు కమాండ్ కు కమాండింగ్ ఆఫీసర్‌గా, అండమాన్, నికోబార్ కమాండ్ కమాండర్-ఇన్-చీఫ్ గా పనిచేసి పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం అందుకున్నాడు.

లెఫ్టినెంట్‌ జనరల్‌
మనోజ్ పాండే
పివిఎస్ఎం, ఏవిఎస్ఎం, విశిష్ట సేవ మెడల్(విఎస్ఎం)
29వ భారత ఆర్మీ చీఫ్‌
Assumed office
1 మే 2022
అధ్యక్షుడురామ్‌నాథ్ కోవింద్
ప్రథాన మంత్రినరేంద్ర మోదీ
అంతకు ముందు వారుమనోజ్ ముకుంద్ నరవణే
43వ ఉపాధ్యక్షుడు
Assumed office
1 ఫిబ్రవరి 2022
అంతకు ముందు వారుచాందీ ప్రసాద్ మొహంతి
వ్యక్తిగత వివరాలు
జననం (1962-05-06) 1962 మే 6 (వయసు 61)[1]
నాగపూర్ , మహారాష్ట్ర
పురస్కారాలు పరం విశిష్ట సేవ మెడల్
అతి విశిష్ట సేవ మెడల్
విశిష్ట సేవ మెడల్
Military service
Allegiance భారతదేశం
Branch/serviceభారత సైనిక దళం
Years of serviceడిసెంబర్ 1982 – ప్రస్తుతం
Rank లెఫ్టినెంట్‌ జనరల్‌
Unit[[బొంబాయి ఇంజనీర్ గ్రూప్
ఇండియన్ ఆర్మీ కార్ప్స్ అఫ్ ఇంజనీర్స్ |Corps of Engineers]]
Commandsఈస్టర్న్ కమాండ్
అండమాన్ అండ్ నికోబర్ కమాండ్
Service numberIC-40716F

జననం, విద్యాభాస్యం మార్చు

మనోజ్ పాండే 1962 మే 6న మహారాష్ట్రలోని, నాగపూర్ లో డాక్టర్ సీజీ పాండే, ప్రేమ దంపతులకు జన్మించాడు. ఆయన స్కూలింగ్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరి చీఫ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

ఉద్యోగ జీవితం మార్చు

మనోజ్ పాండే 1982 డిసెంబరులో కార్డ్స్ ఆఫ్ ఇంజనీర్స్ రెజిమెంట్ అయిన బాంబే సాపర్స్ లో నియమితుడయ్యాడు. ఆయన యూకేలోని క్యాంబర్లీలోని స్టాఫ్ కాలేజ్ లో కూడా శిక్షణ పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చి ఈశాన్య భారతదేశానికి చెందిన మౌంటైన్ బ్రిగేడు బ్రిగేడ్ మేజర్‌గా నియమితుడయ్యాడు. మనోజ్ పాండే మిలిటరీలో వివిధ హోదాల్లో పనిచేసి లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరుకున్న తరువాత, ఇథియోపియా, ఎరిట్రియాలోని ఐక్యరాజ్యసమితి మిషన్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశాడు.

జనరల్ మనోజ్ పాండే జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖపై 117 ఇంజనీర్ రెజిమెంట్ కు కూడా నాయకత్వం వహించాడు. పరాక్రమ్ ఆపరేషన్ సమయంలో పార్ రెజిమెంట్ కమాండర్‌గా ఉన్నాడు. ఆయన తర్వాత మోలోని ఆర్మీ వార్ కాలేజీలో చేరి హయ్యర్ కమాండ్ కోర్సును పూర్తి చేసి ఆ తర్వాత, హెడ్ క్వార్టర్స్ 8 మౌంటైన్ డివిజన్ లో కల్నల్ క్యూగా నియమితుడయ్యాడు.

మనోజ్ పాండే మేజర్ జనరల్ స్థాయికి పదోన్నతి పొందిన తరువాత పశ్చిమ లడఖ్ లోని 8వ మౌంటైన్ విభాగానికి కమాండర్ గా వహించి ఆ తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లోని డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ADG) గా పనిచేసి లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి పదోన్నతి అందుకొని సదరన్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతను నిర్వహించాడు. మనోజ్ పాండే కోల్‌కతాలోని ఈస్టర్న్ కమాండ్‌కు నాయకత్వం వహిస్తున్న సమయంలో 2022 ఏప్రిల్ 18న భారత 29వ సైన్యాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. మే 1న బాధ్యతలు చేపట్టనున్నాడు.

మూలాలు మార్చు

  1. "Government appoints Lt Gen Manoj C Pande as next Chief of Army Staff". Press Information Bureau. 18 April 2022.
  2. 10TV (18 April 2022). "కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే" (in telugu). Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)