మన్మధ లీల (2022 సినిమా)

మన్మధ లీల 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. అశోక్ సెల్వన్, సంయుక్త హెగ్డే, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 24న ఆహా ఓటీటీలో విడుదలైంది.[1]

మన్మధ లీలా
దర్శకత్వంవెంకట్ ప్రభు
రచనమణివణ్ణన్ బాలసుబ్రమణియం
నిర్మాతశ్రీనివాస చిట్టూరి
తారాగణంఅశోక్ సెల్వన్
సంయుక్త హెగ్డే
రియా సుమన్
స్మృతి వెంకట్
చంద్రన్
జయప్రకాశ్
ఛాయాగ్రహణంతమిళ్ ఎ అజగన్
కూర్పువెంకట్ రాజన్
సంగీతంప్రేమగీ అమరేన్
నిర్మాణ
సంస్థ
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ
జూన్ 24, 2022 (2022-06-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా రెండు భిన్నమైన కాలాల వ్యవధుల్లో సాగుతుంది.

సత్య (అశోక్ సెల్వన్) 2010లో కాలేజ్ లైఫ్‌ను పూర్తి చేసి డ్రెస్ డిజైన‌ర్ బొటిక్‌ను సొంతంగా ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ క్రమంలో అత‌డికి ఆర్కుట్‌లో పూర్ణి (సంయుక్త హెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. కొద్ది రోజుల చాటింగ్ తర్వాత పూర్ణి తన తండ్రి ఊరికి వెళ్లాడని, రెండు రోజుల వరకు తిరిగి రాడని సత్యను త‌న ఇంటికి రమ్మనగా అక్కడికి వెళ్లిన సత్య ఆమె ఇంట్లోనే రాత్రి ఉంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం పూర్ణి తండ్రి ఇంటికి తిరిగివ‌స్తాడు. ఆ త‌ర్వాత సత్య, పూర్ణిలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?

స‌త్య 2020లో సిటీలోనే ఫేమ‌స్ డిజైన‌ర్‌గా పేరుతెచ్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించే భార్య అను, కూతురితో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంతాడు. ఈ క్రమంలో తన భార్య ఊరికి వెళుతుంది. ఆ స‌మ‌యంలో లీల అనే అమ్మాయి ఓ అడ్ర‌స్ కోసం వెతుకుతూ సత్య ఇంటికి రాగా వ‌ర్షం కార‌ణంగా ఆ రాత్రి అతడి ఇంటిలోనే ఉండిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయమే సత్య భార్య ఇంటికి తిరిగి వ‌స్తుంది. లీలను తన భార్య కంటపడకుండా దాచేందుకు సత్య ఏం చేశాడు ? లీల‌, పూర్ణి జీవితాలు ఏ విధంగా ముగిసాయి ? ఆ స‌మ‌స్య‌ల నుండి స‌త్య బయటపడ్డాడా? లేదా ? అనేదే ఈ సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
  • నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
  • సంగీతం: తమిళ్ ఎ అజగన్
  • సినిమాటోగ్రఫీ: తమిళ్ ఎ అజగన్
  • ఎడిటర్: వెంకట్ రాజన్
  • ఆర్ట్: ఉమేష్ జె కుమార్

మూలాలు

మార్చు
  1. "ఆహాలో అడల్ట్ కామెడీ థ్రిల్లర్ 'మన్మథలీల'!". 18 June 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
  2. The Hindu (2 April 2022). "'Manmatha Leelai' movie review: There is nothing for adults in this Venkat Prabhu quickie" (in Indian English). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.