మన్మోహన్ సింగ్ లిబర్హాన్

భారతీయ న్యాయవాది

మన్మోహన్ సింగ్ లిబర్హాన్, (11 నవంబర్ 1938) భారతీయ న్యాయవాది. 1998-2000 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేతపై ఒక నివేదికను తయారు చేసిన లిబర్హాన్ అయోధ్య కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి 17 సంవత్సరాలపాటు నాయకత్వం వహించాడు.[1][2]

మన్మోహన్ సింగ్ లిబర్హాన్
జూన్ 30న న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కి లిబర్‌హాన్ కమిషన్ నివేదిక సమర్పించిన జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అంతకు ముందు వారుఉమేష్ చంద్ర బెనర్జీ
తరువాత వారుసత్యవ్రతా సిన్హా
వ్యక్తిగత వివరాలు
జననం11 నవంబరు 1938

వృత్తి జీవితం

మార్చు

ఉత్తర భారత రాష్ట్రమైన హర్యానాకు మన్మోహన్ సింగ్ లిబర్హాన్ అడ్వకేట్ జనరల్ గా పనిచేశాడు. అనతికాలంలోనే పంజాబ్, హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఎదిగాడు. అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు లిబర్హాన్ అయోధ్య విచారణ కమిషన్ చైర్మన్‌గా నియమించారు 1992 డిసెంబరు 6న అయోధ్యలో జరిగిన సంఘటనలు "ఆకస్మికమైనవి లేదా ప్రణాళిక లేనివి" అని కమిషన్ తేల్చింది.[1]

కొంతకాలం తరువాత లిబర్హాన్‌ను మద్రాస్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయబడి, పదవీ విరమణ చేసే వరకు అందులో పనిచేశాడు.

2009 వరకు లిబర్హాన్ కమిషన్ చైర్మన్ పదవిలో కొనసాగాడు.

ప్రస్తుతం భారతదేశంలోని చండీగఢ్ లో నివసిస్తున్నాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 NDTV correspondent (23 November 2009). "What is the Liberhan Commission?". NDTV India. Archived from the original on November 26, 2009. Retrieved 14 June 2021.
  2. "India Babri Masjid demolition neither spontaneous nor unplanned: Liberhan". Hindustan Times. 24 November 2009. Archived from the original on 3 January 2013. Retrieved 14 June 2021.

బయటి లింకులు

మార్చు