మన నవలలు-మన కథానికలు
మన నవలలు-మన కథానికలు ప్రముఖ రచయిత, విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి వ్రాసిన పుస్తకం. ఈ పుస్తకానికి 2014 సంవవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది[1][2].
మన నవలలు-మన కథానికలు | |
"మన నవలలు-మన కథానికలు" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | సాహిత్య విమర్శ |
ప్రచురణ: | |
విడుదల: | |
ప్రతులకు: | విశాలాంధ్ర బుక్ హౌస్ |
పుస్తక సమీక్ష
మార్చుకేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం డిల్లీలో 22 భాషల్లో పురస్కారాలను ప్రకటించగా తెలుగులో 'మన నవలలు-మన కథానికలు' పుస్తక రచనకు గాను రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిని ఉత్తమ విమర్శకుడిగా ఎంపికచేసింది. ఆయన ప్రముఖ సాహితీ విమర్శకుడు. ఆయన కృషి ప్రాచీన సాహిత్యం మీదా, ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద ఆయన కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద ఆయన పదమూడు వ్యాసాలు రాసారు.
ఓ పుష్కర కాలంలో వచ్చిన తెలుగు నవలలు, కథానికల మీద విమర్శనా గ్రంథం 'మన నవలలు మన కథానికలు'. సంఘ సంస్కరణ, జాతీయ, అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలను, ఉద్యమాలను ప్రతిబింబించిన నవలలు, కథలపై సమకాలీన వాస్తవికతతో చేసిన సద్విమర్శ ఇది. రాగద్వేషాలకు అతీతంగా వస్తు వివేచనతో సాగే విమర్శనా పద్ధతికి నిలువుటద్దం ఈ పుస్తకం.[3]
ఈ పుస్తకంలోని 24 వ్యా సాలు 13 ఏళ్ల సాహిత్య అధ్యయన కృషికి అక్షరరూపం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన ప్రాతినిధ్య నవలలు, కథానికల మీద చేసిన మూల్యాంకనం, పునర్ మూల్యాంకనాలే ఇందులో ఉన్నాయి. ఈ పుస్త కంలో మాస్టర్‌పీస్‌లు రెండు ఉన్నాయి. అవి ఒకటి. ‘సామాజిక ఉద్యమాలు- తెలుగు కథానికా వికాసం’. ఈ వ్యాసంలో సంఘసంస్కరణ ఉద్యమం నుండి ప్రపంచీకరణ నేపథ్యం వరకు తెలుగు కథానిక ఎలా వికసించిందో చెప్పారు. రెండు. ‘అయ్యో పాపం నుండి ఆగ్రహం దాకా తెలుగు దళిత కథానిక’. ఈ వ్యాసంలో 1925-2008 మధ్య 9 దశాబ్దాలలో దళిత జీవితం వస్తువుగా వచ్చిన కథానికల్ని చారిత్రక దృక్పథంతో అధ్యయనం చేశారు. దళిత సాహిత్య విమ ర్శలో ఈ వ్యాసం కలికితురాయి.[4]
మూలాలు
మార్చు- ↑ https://www.youtube.com/watch?v=IWWeHMA9hDQ
- ↑ "సాహిత్య అకాడమీ అవార్డుల వెబ్‌సైట్" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2016-02-07.
- ↑ Mana Navalalu Mana Kathanikalu - మన నవలలు మన కథానికలు[permanent dead link]
- ↑ "విమర్శలో రాచ'పాళీ'యం". శశిశ్రీ. సాక్షి. 21 December 2014. Retrieved 7 February 2016.